Children’s Growth : పిల్లల ఆరోగ్యానికి ఏమిటి మంచిది? వారికి వరస్ట్, బెస్ట్ ఆప్షన్లు ఇవే

Children’s Growth : పిల్లల ఎదుగుదల, ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. వారు తినే ఆహారం, వారి శారీరక, మానసిక వికాసాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అయితే, ఏవి మంచి ఆహారాలు, ఏవి అసలు తీసుకోకూడదు అనే విషయంలో చాలామందికి స్పష్టత ఉండదు. కొన్ని ఆహారాలు పిల్లలకు చాలా హానికరమని తెలిసినా, తెలియకుండానో వాటిని ఇస్తుంటారు. ఈ కథనంలో పిల్లల ఆరోగ్యానికి ఏవి బెస్ట్, ఏవి వరస్ట్ అనేది తెలుసుకుందాం.
1. పిల్లల మెదడు చురుకుగా పనిచేయాలంటే, సరైన పోషకాలు అవసరం.
వరస్ట్ ఫుడ్: బిస్కెట్స్
బిస్కెట్లలో సాధారణంగా అధిక మొత్తంలో మైదా, చక్కెర, హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ ఉంటాయి. ఇవి పిల్లల రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి, తగ్గించి, వారి ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. వీటిలో పోషక విలువలు చాలా తక్కువ. మెదడు పనితీరుకు అవసరమైన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అసలు ఉండవు.
బెస్ట్ ఫుడ్: నానబెట్టిన వాల్నట్స్
వాల్‌నట్స్‌ను బ్రెయిన్ ఫుడ్ అని కూడా అంటారు. వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల మెదడు కణాల అభివృద్ధికి, జ్ఞాపకశక్తి పెంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి. రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట తినిపించడం వల్ల వాటిలోని పోషకాలు సులభంగా శరీరానికి అందుతాయి.
2. పిల్లల కంటి చూపుకు ఇవే ముఖ్యం
వరస్ట్ ఫుడ్: టెట్రా ప్యాక్ పాలు
టెట్రా ప్యాక్ పాలలో ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వివిధ రసాయనాలు కలిపే అవకాశం ఉంటుంది. ఇవి నేచురల్ పాలలోని పోషకాలను తగ్గిస్తాయి. కంటి చూపుకు అవసరమైన విటమిన్ ఎ వంటి సూక్ష్మపోషకాలు ప్రాసెస్ చేసిన పాలల్లో తక్కువగా ఉంటాయి.
Read Also:Internet Speed : నెట్‌ఫ్లిక్స్ మొత్తం ఒక్క సెకన్లో డౌన్లోడ్..ఇంటర్నెట్ స్పీడ్‌లో జపాన్ సంచలనం!
బెస్ట్ ఫుడ్: క్యారెట్స్
క్యారెట్లు విటమిన్ ఎ, బీటా-కెరోటిన్ కు అద్భుతమైన వనరులు. ఇవి కంటి రెటీనా ఆరోగ్యానికి చాలా అవసరం. క్రమం తప్పకుండా క్యారెట్లు తినడం లేదా క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల పిల్లల కంటి చూపు మెరుగుపడుతుంది. రేచీకటి వంటి సమస్యలను నివారిస్తుంది.
3. పిల్లల ఎదుగుదలకు
వరస్ట్ ఫుడ్: కార్న్ ఫ్లేక్స్
మార్కెట్లో లభించే చాలా కార్న్ ఫ్లేక్స్‌లో అధిక మొత్తంలో చక్కె, సోడియం ఉంటాయి. ఇవి కేవలం క్యాలరీలను అందిస్తాయి తప్ప, పిల్లల ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్లు, ఫైబర్, ఇతర సూక్ష్మపోషకాలు చాలా తక్కువగా ఉంటాయి.
బెస్ట్ ఫుడ్: గుడ్లు
గుడ్లను సూపర్ ఫుడ్ అంటారు. ఇవి ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులకు అద్భుతమైన వనరులు. పిల్లల కండరాల అభివృద్ధి, మెదడు పనితీరు, రోగనిరోధక శక్తిని పెంచడానికి గుడ్లు చాలా ముఖ్యమైనవి. ఉడికించిన గుడ్లు, ఆమ్లెట్లు వంటి రూపాల్లో వీటిని పిల్లలకు ఇవ్వొచ్చు.
4. పిల్లల ఎముకల బలానికి
వరస్ట్ ఫుడ్: ఇన్స్టంట్ నూడుల్స్
ఇన్స్టంట్ నూడుల్స్‌లో మైదా, సోడియం, కృత్రిమ రంగులు, ఉంటాయి. వీటిలో కాల్షియం, విటమిన్ డి వంటి ఎముకల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అస్సలు ఉండవు.
బెస్ట్ ఫుడ్: రాగి జావ, రాగి దోస
రాగులు కాల్షియానికి ప్రధాన వనరులు. పెరుగుతున్న పిల్లల ఎముకల బలానికి, దంతాల ఆరోగ్యానికి రాగులు చాలా ముఖ్యమైనవి. రాగి జావ లేదా రాగి దోస రూపంలో వీటిని క్రమం తప్పకుండా ఇవ్వడం వల్ల పిల్లలకు అవసరమైన కాల్షియం లభిస్తుంది.
Read Also:Shubman Gill: టీమిండియా వన్డే కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్?
5. పిల్లల జీర్ణక్రియకు
వరస్ట్ ఫుడ్: ప్రాసెస్ చేసిన ప్రోబయోటిక్ ఉత్పత్తులు
మార్కెట్లో లభించే కొన్ని ప్రోబయోటిక్ డ్రింక్స్‌లో లేదా యోగర్ట్‌లలో అధిక చక్కెరలు, కృత్రిమ రుచులు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థకు మేలు చేయకపోగా, చక్కెర వల్ల ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
బెస్ట్ ఫుడ్: మజ్జిగ
మజ్జిగ ఒక నేచురల్ ప్రోబయోటిక్. ఇందులో జీర్ణక్రియకు సహాయపడే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
6. పిల్లల ఎత్తు పెరగడానికి
వరస్ట్ ఫుడ్: పాలల్లో కలిపే పౌడర్లు
మార్కెట్లో ఎత్తు పెరగడానికి అని చెప్పి అమ్మే చాలా పౌడర్లలో కృత్రిమ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో వాస్తవమైన పోషకాలు చాలా తక్కువగా ఉండవచ్చు. కేవలం వీటిపై ఆధారపడడం వల్ల ఎత్తు పెరగడానికి పెద్దగా ప్రయోజనం ఉండదు.
బెస్ట్ ఫుడ్: జంపింగ్, అవుట్డోర్ గేమ్స్
ఎత్తు పెరగడానికి శారీరక శ్రమ, ముఖ్యంగా జంపింగ్, పరుగు, ఇతర అవుట్డోర్ గేమ్స్ చాలా ముఖ్యమైనవి. ఇవి ఎముకల సాంద్రతను పెంచుతాయి. గ్రోత్ హార్మోన్లను ఉత్తేజపరుస్తాయి. కండరాలను బలోపేతం చేస్తాయి. సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ డి కూడా ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం.