Shubman Gill: టీమిండియా వన్డే కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్?

Subhman Gill:టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్నారు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌కి గిల్ కెప్టెన్‌గా ఆడుతున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో శుభ్‌మన్ గిల్‌ను టెస్ట్ మ్యాచ్‌లకు టీమిండియా కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లకు శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో టీమిండియా అదరగొడుతుంది. మొదటి మ్యాచ్‌లో ఓడిపోయినా కూడా రెండో మ్యాచ్‌లో గెలిచింది. అయితే ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వన్డే క్రికెట్‌కు ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటున్నారు. ఇకపై గిల్ ఉంటారని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో చాలా పేలవంగా ఆడారు. ఈ క్రమంలోనే ఇప్పుడు గిల్‌ను కెప్టెన్ చేయాలని బీసీసీఐ భావించినట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే శ్రీలంక పర్యటనలో రోహిత్ శర్మకు బదులు గిల్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే రోహిత్ శర్మతో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. అయితే ఈ విషయాన్ని ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. త్వరలో జరిగే వన్డే సిరీస్‌కి గిల్ ఎంట్రీ ఇస్తాడని ట్వీట్ చేశారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా రోహిత్, కోహ్లీ సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో తిరిగి రావాల్సి ఉంది. కానీ ఈ సిరీస్‌ను BCCI, BCB పరస్పర నిర్ణయంతో వచ్చే ఏడాది వరకు వాయిదా వేశారు. నవంబర్‌లో మెన్ ఇన్ బ్లూ జట్టు వైట్ బాల్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు ఇప్పుడు భారతదేశం తరపున ఆడటానికి తిరిగి వస్తారు. ప్రపంచ కప్‌కు ముందు భారతదేశం కొన్ని వన్డేలు మాత్రమే ఆడుతుంది. 2027 ప్రపంచ కప్ జట్టులో కోహ్లీ, రోహిత్ ఆటోమేటిక్ సెలక్షన్లు కాదని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాలి.
ఇదిలా ఉండగా భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 336 పరుగుల తేడాతో గెలిచింది. కెప్టన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో టీమిండియా జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఐదు సిరీస్‌ల మ్యాచ్ ఇప్పుడు 1-1గా ఉంది. అయితే ఈ మ్యాచ్‌తో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు సృష్టించాడు. ఇందులో శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ చేసి రికార్డులు సృష్టించారు. ఇలా ఒకే టెస్ట్‌లో డబుల్ సెంచర చేసిన సునీల్ గవాస్కర్ తర్వాత శుభ్‌మన్ గిల్ రికార్డు సృష్టించాడు. అయితే ఇదే కాకుండా ఇంకా ఎన్నో రికార్డులు సాధించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన మొదటి భారత కెప్టెన్‌గా గిల్ చరిత్ర సృష్టించాడు. అయితే ఇక్కడ టీమిండియా ఏ కెప్టెన్ కూడా ఇప్పటి వరకు విజయం సాధించలేదు. ఈ కారణంగానే వన్డే కి కెప్టెన్ గా చేయాలని జోరుగా ప్రచారం సాగుతుంది.
Aslo read : IND vs ENG : ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేసి ఇంగ్లాండ్ వెన్ను విరిచిన తెలుగు కుర్రాడు
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Pat Cummins : శుభ్‌మన్ గిల్ సేనను చూసి కమ్మిన్స్ భయపడ్డారా? ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Shubman Gill : టీమిండియా గెలిచాక కనిపించకుండా పోయిన జర్నలిస్ట్.. తన కోసం వెతికిన శుభమాన్ గిల్
-
Team India : మూడో టెస్టులో బూమ్రా ఆడడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్
-
Subhaman Gill: ఈ స్టేడియంలో ధోనీ, కోహ్లీ ఓటమి.. మ్యాచ్ విజయంతో చరిత్ర సృష్టించిన గిల్
-
Team india captain Subhaman gill: డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించిన గిల్.. ఒకే మ్యాచ్‌లో ఇన్ని రికార్డులా!