Team India : మూడో టెస్టులో బూమ్రా ఆడడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్

Team India : ఎడ్జ్‌బాస్టన్ కోటను జయించిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఇప్పుడు లార్డ్స్ టెస్ట్ కోసం ఎదురు చూస్తోంది. ఇంగ్లాండ్‌తో జరిగిన హెడింగ్లీ టెస్ట్‌లో టీమిండియా ఓడిపోయింది. ఓడినప్పటికీ ఆ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా భారత్ తరపున అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే, వర్క్ లోడ్ కారణంగా అతనికి ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో విశ్రాంతినిచ్చారు. ప్రస్తుతం, జస్ప్రీత్ బుమ్రా లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ లార్డ్స్ టెస్ట్‌లో బుమ్రా ఆడే విషయాన్ని ధృవీకరించాడు.
ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ చారిత్రక విజయం సాధించిన తర్వాత, జస్ప్రీత్ బుమ్రా మూడో టెస్ట్‌లో ఆడతాడా అని గిల్‌ను అడిగారు. బుమ్రా గురించి అడిగిన ప్రశ్నకు శుభ్‌మన్ గిల్ కచ్చితంగా అంటూ బదులిచ్చాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ యువ బౌలర్ ఆకాశ్ దీప్ బౌలింగ్ విధానాన్ని ప్రశంసలతో ముంచెత్తాడు. తన బ్యాటింగ్ గురించి కూడా శుభ్‌మన్ గిల్ మాట్లాడాడు. “నా ఆటలో నేను చాలా కంఫర్టబుల్ గా ఉన్నాను. నా సహకారంతో సిరీస్ గెలిస్తే నాకు మరింత సంతోషంగా ఉంటుంది. నేను బ్యాట్స్‌మెన్‌గా ఆడాలని, బ్యాట్స్‌మెన్‌గా ఆలోచించాలని కోరుకుంటున్నాను” అని గిల్ తెలిపాడు.
Read Also:Subhaman Gill: ఈ స్టేడియంలో ధోనీ, కోహ్లీ ఓటమి.. మ్యాచ్ విజయంతో చరిత్ర సృష్టించిన గిల్
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ జట్టును 336 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంలో టీమిండియాలోని చాలా మంది ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. కెప్టెన్ గిల్ ఒక ఇన్నింగ్స్‌లో 269 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశాడు. ఆకాశ్ దీప్ ఏకంగా 10 వికెట్లు పడగొట్టాడు. ఈ గెలుపుకు ప్రతి ఆటగాడు గణనీయమైన కృషి చేశాడు.
ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియాకు ఇది మొదటి విజయం కావడం విశేషం. ఇంతకు ముందు ఈ మైదానంలో భారత జట్టు 9 మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 8 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయ్యింది. అంతేకాకుండా ఎడ్జ్‌బాస్టన్‌లో గెలిచిన మొదటి ఆసియా జట్టు కూడా టీమిండియానే. విదేశీ గడ్డపై పరుగుల విషయంలో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం. దీనికి ముందు 2019లో వెస్టిండీస్‌పై భారత్ జట్టు 318 పరుగుల తేడాతో విజయం సాధించింది. అదే అతిపెద్ద విజయం.
Read Also:Nayanthara : ఆ సినిమాలో నటించి తప్పు చేశా.. బ్లాక్ బస్టర్ సినిమాపై నయన్ కు అంతకోపమెందుకు ?
-
Asia Cup 2025: ఆసియా కప్ కు భారత జట్టు ఇదే..
-
Ravichandran Ashwin Comments On Shubman Gill: శుభ్ మన్ గిల్ పై రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు
-
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. ఏం జరగనుంది
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్
-
Lords Test : లార్డ్స్ టెస్టులో కష్టాల్లో టీమిండియా.. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన శుభమన్ గిల్
-
Joe Root : లార్డ్స్‌లో రాహుల్ ద్రావిడ్‌ను దాటేసిన జో రూట్.. సెంచరీతో సరికొత్త రికార్డు