Subhaman Gill: ఈ స్టేడియంలో ధోనీ, కోహ్లీ ఓటమి.. మ్యాచ్ విజయంతో చరిత్ర సృష్టించిన గిల్

Subhaman Gill:భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 336 పరుగుల తేడాతో గెలిచింది. కెప్టన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో టీమిండియా జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఐదు సిరీస్‌ల మ్యాచ్ ఇప్పుడు 1-1గా ఉంది. అయితే ఈ మ్యాచ్‌తో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు సృష్టించాడు. ఇందులో శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ చేసి రికార్డులు సృష్టించారు. ఇలా ఒకే టెస్ట్‌లో డబుల్ సెంచర చేసిన సునీల్ గవాస్కర్ తర్వాత శుభ్‌మన్ గిల్ రికార్డు సృష్టించాడు. అయితే ఇదే కాకుండా ఇంకా ఎన్నో రికార్డులు సాధించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన మొదటి భారత కెప్టెన్‌గా గిల్ చరిత్ర సృష్టించాడు. అయితే ఇక్కడ టీమిండియా ఏ కెప్టెన్ కూడా ఇప్పటి వరకు విజయం సాధించలేదు.
లెజెండరీ ప్లేయర్ ధోనీ, విరాట్ కోహ్లీ కూడా ఈ మైదానంలో విజయం సాధించలేదు. అయితే 1986లో కపిల్ దేవ్ నేతృత్వంలో అప్పుడు మ్యాచ్ డ్రా అయ్యింది. ఈ ఒక్కటి తప్ప అన్ని మ్యాచ్‌ల్లో కూడా భారత్ ఓటమిని చవి చూసింది. 1967లో మంసూర్ అలీ ఖాన్ పటౌడీ నేతృత్వంలో 132 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాత 1974లో అజీత్ వాడేకర్ 78 పరుగుల తేడాతో ఓటమి, 1979లో ఎస్. వెంకటరాఘవన్ కెప్టెన్సీలో 83 పరుగుల తేడాతో ఓటమి, 1986 లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో డ్రా, 1996లో అజారుద్దీన్ నేతృత్వంలో 8 వికెట్ల తేడాతో ఓటమి, 2011లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో 242 పరుగుల తేడాతో ఓటమి, 2018లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 31 పరుగుల తేడాతో ఓటమి, 2022లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కానీ ఈ సారి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో 336 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసింది. అయితే కెప్టెన్ శుభ్ మన్ గిల్ (269 పరుగులు), రవీంద్ర జడేజా (89 పరుగులు), యశస్వి జైస్వాల్ (87 పరుగులు) రాణించారు. దీంతో ఇంగ్లాండ్ జుట్టును ఓడించారు. అయితే శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో టీమిండియా అద్భుతంగా ఆడుతుంది. మొదటి మ్యాచ్‌లో గిల్, రిషబ్ పంత్ సెంచరీలు చేసినా ఓడిపోయింది. కానీ ఈ మ్యాచ్‌లో అందరూ ఆటగాళ్లు రాణించారు. ఈ స్టేడియంలో మ్యాచ్ గెలిచి గిల్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఏ కెప్టెన్ చేయని రికార్డు అధిగమించాడు. దిగ్గజాల వల్ల ధోనీ, కోహ్లీకి సాధ్యం కానిది గిల్ చరిత్ర సృష్టించాడు. ఇక మూడో టెస్ట్ జూలై 10 నుంచి లార్డ్స్ మైదానంలో ప్రారంభం కానుంది.
Read Also:Infosys : 46గంటలు దాటి పని చేస్తే ఇన్ఫోసిస్ వార్నింగ్.. నారాయణ మూర్తి మాటలకు భిన్నంగా కంపెనీ పాలసీ
-
Shubman Gill: టీమిండియా వన్డే కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్?
-
Team india captain Subhaman gill: డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించిన గిల్.. ఒకే మ్యాచ్‌లో ఇన్ని రికార్డులా!
-
Suryakumar Yadav : ఆస్పత్రిలో చేరిన స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్.. ఇంతకీ ఏమైందంటే ?
-
Jitesh Sharma: రికార్డు సృష్టించిన జితేష్ శర్మ.. ధోని రికార్డును బద్దలు కొట్టి..!
-
Team India: టీమిండియా టెస్ట్ కెప్టెన్ గిల్, రిషబ్ కాదు.. ఎవరంటే?
-
RCB Vs CSK 2025: మ్యాచ్ ఓడినా.. ధోనీ సెన్సెషనల్ రికార్డు క్రియేట్