Kohli And Rohit: కోహ్లీ, రోహిత్ ఆడటం కష్టమేనా?
Kohli And Rohit విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మరో ఏడాదిలో మొత్తంగా 12 వన్డేలు ఆడనున్నారు. 2027 నవంబరులో వన్డే ప్రపంచకప్ జరగనుంది. మెగా టోర్నీకి సంసిద్ధం కావడానికి ఈ సీనియర్లకు ఈ మ్యాచ్ లు సరిపోతాయా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది.

Kohli And Rohit: ఇంగ్లాండ్ పై యువ క్రికెటర్ల ప్రదర్శన సీనియర్ ఆటగాళ్ల పై పడనుంది. అయితే ఆస్ట్రేలియాపై మూడు వన్డేల సిరీస్ లో కోహ్లీ, రోహిత్ లు ఆడనున్నారు. ఆస్ట్రేలియా సిరీస్ అనంతరం దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఉంటుంది. 2026 జనవరి, జూలై మధ్య న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తో ఆరు వన్డేలు ఆడే అవకాశముంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మరో ఏడాదిలో మొత్తంగా 12 వన్డేలు ఆడనున్నారు. 2027 నవంబరులో వన్డే ప్రపంచకప్ జరగనుంది. మెగా టోర్నీకి సంసిద్ధం కావడానికి ఈ సీనియర్లకు ఈ మ్యాచ్ లు సరిపోతాయా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది. కేవలం వన్డేలు, ఐపీఎల్ తో ప్రపంచకప్ వరకు ఆటలో ఎలా కొనసాగుతారో అని మరో ప్రశ్న. ఈ నేపథ్యంలోనే కోహ్లీ, రోహిత్ కు మెగా టోర్నీలో ఆడడం కష్టమేనా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.