Virat Kohli Sensational Comments Rohit: రోహిత్‌పై కోహ్లీ సంచలన కామెంట్స్.. ఇంపాక్ట్ చూపించడం లేదంటూ..?

Virat Kohli Sensational Comments Rohit: ఐపీఎల్ 2025 విజేతగా రాయల్స్ బెంగళూరు జట్టు అవతరించింది. 18 ఏళ్ల కళ ఇప్పుడు నెరవేరింది. ఆర్సీబీ జట్టు గెలవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఆర్సీబీ జట్టుకు విరాట్ కోహ్లీ ఎంత నిజాయితీగా ఉన్నాడో.. ఫ్యాన్స్ కూడా ఆ జట్టుకు అంతే నిజాయితీతో ఉన్నారు. అయితే 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ మొదటి టైటిల్‌ను సొంతం చేసుకోవడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఆర్సీబీ ప్లేయర్స్, ఫ్యాన్స్, సెలబ్రెటీలు ఇలా ప్రతీ ఒక్కరూ కూడా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆర్సీబీ విజయ ఆనందంతో మునిగి తేలుతున్నారు. నేడు యావత్తు భారత్ కూడా ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటుంది. అయితే మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎన్నో ఏళ్ల ఈ ఏడాది నెరవేరడంతో ఎమోషనల్ అయ్యారు. ఈ సమయంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చూడండి:IPL 2025 Final: రిజర్డ్వ్ డే రోజు వర్షం పడితే.. విన్నర్ ఇక ఆ జట్టే!
ఐపీఎల్ చివరి రోజు వరకు కూడా కేవలం ఆర్సీబీ జట్టులోనే ఆడుతానని స్పష్టం చేశాడు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రం తాను ఆడనని కోహ్లీ అన్నాడు. మైదానంలో 20 ఓవర్ల పాటు ఇంపాక్ట్ చూపించాలని భావిస్తానని విరాట్ కోహ్లీ అన్నాడు. తనకు వీలు కుదిరే వరకు జట్టుకు సాయం చేస్తానని తెలిపాడు. అయితే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే కొందరు సీనియర్ ఆటగాళ్లు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతున్నారు. కనీసం 20 ఓవర్ల వరకు కూడా ఉండటం లేదు. అందులోనూ ఈ సీజన్‌లో ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడాడు. మైదానంలో ఎక్కువ సమయం ఉండలేదు. కేవలం బ్యాటింగ్ మాత్రమే చేశాడు. అయితే విరాట్ కోహ్లీ కేవలం రోహిత్‌ను ఉద్దేశించి అన్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. డైరెక్ట్‌గా అనలేక ఇన్‌డైరెక్ట్‌గా ఇలా అంటున్నాడని కొందరు అన్నారు.
ఇది కూడా చూడండి:IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!
నిజానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మంచి స్నేహితులు. వీరి మధ్య ఎలాంటి గొడవలు, మాటలు అనుకోవడం కూడా లేదు. కానీ విరాట్ ఏదో తన ఆనందాన్ని చెబితే రోహిత్‌ను ఉద్దేశించి అన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఆర్సీబీకి తనకి ఉన్న అనుబంధాన్ని గురించి చెబుతున్నాడు.
-
RCB Stampede: ఆర్సీబీ తొక్కిసలాట.. రిపోర్టు లో సంచలన విషయాలు
-
YouWeCan : సచిన్, కోహ్లీ, పీటర్సన్.. యువీ ఛారిటీ కోసం తరలివచ్చిన క్రికెట్ దిగ్గజాలు!
-
Jasprit Bumrah : కెప్టెన్సీ ఆఫర్‌ను తిరస్కరించిన బుమ్రా.. బీసీసీఐకి ‘నో’ చెప్పడానికి గల అసలు కారణం ఇదే!
-
Virat Kohli : ‘కోహ్లీతో నా కూతురికి పెళ్లి చేస్తా’: స్టార్ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
IPL 2025 : ఐపీఎల్ వేలంలో రూ. 20 కోట్ల బిడ్..వాష్ రూంలోకి పరిగెత్తిన శ్రేయాస్ అయ్యర్!
-
Bengaluru Stampede : విరాట్ కోహ్లీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి.. పోలీసులకు స్థానికుల ఫిర్యాదు