Jasprit Bumrah : కెప్టెన్సీ ఆఫర్‌ను తిరస్కరించిన బుమ్రా.. బీసీసీఐకి ‘నో’ చెప్పడానికి గల అసలు కారణం ఇదే!

Jasprit Bumrah : భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్‌కు రెడీ అవుతున్నారు. ఈ పర్యటనలో బుమ్రా మీద కీలక బాధ్యత ఉంటుంది. అతను పేస్ బౌలింగ్‌ను ముందుండి నడిపించడమే కాకుండా, తొలిసారి టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న శుభ్‌మన్ గిల్‌కు సాయం కూడా చేయబోతున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కెప్టెన్సీ రేసులో బుమ్రా ముందు వరుసలో ఉన్నారు. అయితే, బుమ్రాను టెస్ట్ కెప్టెన్‌గా ఎందుకు చేయలేదో తాజాగా బయటపడింది.
జస్ప్రీత్ బుమ్రా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతను ఎందుకు తీసుకోలేదో చెప్పుకొచ్చారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కాకముందే, బీసీసీఐ బుమ్రాను కెప్టెన్సీ బాధ్యతల కోసం పరిగణనలోకి తీసుకుంది. అయితే, బుమ్రా ఈ బాధ్యతను తీసుకోవడానికి నిరాకరించారు. దీని వెనుక ప్రధాన కారణం అతని ఫిట్నెస్, జట్టు ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడమే అని చెప్పుకొచ్చారు.
Read Also: Samantha : వామ్మో.. ఫోటోగ్రాఫర్ల పై విరుచుకుపడ్డ సమంత.. ఇంత కోపం ఎన్నడూ చూడలేదు
జస్ప్రీత్ బుమ్రా స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నారు.. “రోహిత్, విరాట్ రిటైర్ కాకముందు, ఐపీఎల్ సమయంలో నేను బీసీసీఐతో మాట్లాడాను. ఐదు టెస్టుల సిరీస్ సమయంలో వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ గురించి చర్చించాను. నన్ను చూసుకునే వారితో (నా ఫిజియో, ట్రైనర్స్) మాట్లాడాను. ఆ తర్వాత మనం మరింత తెలివిగా వ్యవహరించాలని ఒక నిర్ణయానికి వచ్చాం. అప్పుడు నేను బీసీసీఐకి ఫోన్ చేసి, కెప్టెన్సీకి నేను సిద్ధంగా లేనని చెప్పాను. ఎందుకంటే, నేను అన్ని టెస్ట్ మ్యాచ్‌లను ఆడలేను.” అంటూ చెపుకొచ్చారు.
“బీసీసీఐ నన్ను కెప్టెన్సీ బాధ్యతలో చూడాలనుకుంది. కానీ, నేను వారికి ‘వద్దు’ అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే, ఒకరు కెప్టెన్‌గా ఉన్నప్పుడు మూడు టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసి, తర్వాత మిగిలిన టెస్టులకు వేరేవారు నాయకత్వం వహించడం సరికాదు. కాబట్టి, ఇది జట్టుకు సరైనది కాదు. నేను ఎప్పుడూ జట్టును ముందు ఉంచాలని కోరుకుంటాను” అని బుమ్రా తన నిర్ణయం వెనుక గల కారణాన్ని స్పష్టం చేశారు.
Read Also:Banana: ఈ పండు తిన్న తర్వాత ఈ మిస్టేక్స్ చేశారో.. ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే
గత కొన్నేళ్లుగా నడుము నొప్పి బుమ్రాను చాలా ఇబ్బంది పెట్టింది. భారత్ చివరిసారి ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు, ఆ పర్యటనలో చివరి మ్యాచ్‌లో కూడా నడుము నొప్పి కారణంగా అతను మధ్యలోనే స్టేడియం విడిచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో.. బుమ్రా తన కెరీర్ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. తద్వారా అతను జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించగలుగుతాడు. అతని ఫిట్నెస్ బాగుంటేనే జట్టుకు పూర్తిస్థాయిలో సేవ చేయగలనని బుమ్రా నమ్ముతున్నారు.
-
Asia Cup 2025: ఆసియా కప్ కు భారత జట్టు ఇదే..
-
Sourav Ganguly: భారత క్రికెట్ ఎవరి కోసమూ ఆగదు.. గంగూలీ
-
Ravichandran Ashwin Comments On Shubman Gill: శుభ్ మన్ గిల్ పై రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు
-
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. ఏం జరగనుంది
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్
-
Lords Test : లార్డ్స్ టెస్టులో కష్టాల్లో టీమిండియా.. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన శుభమన్ గిల్