Samantha : వామ్మో.. ఫోటోగ్రాఫర్ల పై విరుచుకుపడ్డ సమంత.. ఇంత కోపం ఎన్నడూ చూడలేదు

Samantha : స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆమె ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. ఇటీవల ఆమె జిమ్‌కు వెళ్లినప్పుడు, ఆమె ఫోటోలు, వీడియోలు తీయడానికి ఫోటోగ్రాఫర్లు ఎగబడ్డారు. వద్దని చెబుతున్నా వినకుండా తన ఫోటోలు తీయడానికి వచ్చిన వాళ్ల మీద సమంత అసహనం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి వేధింపులు బాగాలేదని నెటిజన్లు ఫోటోగ్రాఫర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీల ప్రైవసీకి గౌరవం ఇవ్వాలని ప్రజలు కామెంట్లు పెడుతున్నారు.
సాధారణంగా సెలబ్రిటీలు ఫోటోగ్రాఫర్ల ముందు సంతోషంగానే ఫోజులిస్తారు. కానీ కొన్నిసందర్భాల్లో మాత్రమే కోపంతో ఉంటారు. నటి సమంత ప్రస్తుతం మంచి మూడ్‌లో లేదనిపిస్తుంది. బహుశా అందుకే ఆమె ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. జిమ్‌లో వర్కౌట్ ముగించుకుని సమంత బయటకు వచ్చారు. అయితే ఆమె కారు ఇంకా రాలేదు. సమంత ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు మీదికి వచ్చేసారు. అక్కడ ఆమెకు కారు కనిపించలేదు. ఆమె ఏదో టెన్షన్లో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె పరిస్థితి అర్థం చేసుకోకుండా ఫోటోగ్రాఫర్లు ఆమె వెంటపడ్డారు. దీంతో ఆమెకు చాలా ఇబ్బంది కలిగింది.
Read Also:Banana: ఈ పండు తిన్న తర్వాత ఈ మిస్టేక్స్ చేశారో.. ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే
స్టాప్ ఇట్ గాయ్స్ అంటూ సమంత వారి మీద గట్టిగా అరిచారు. అయినప్పటికీ ఆమె మాటలకు వాళ్లు విలువ ఇవ్వలేదు. నడిరోడ్డుపై ఒక హీరోయిన్ ఫోటోలు, వీడియోల కోసం ఇలా ప్రవర్తించిన వారిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది తమ కామెంట్లలో ఫోటోగ్రాఫర్ల తీరును తప్పుబడుతూ, సెలబ్రిటీలకు కూడా వ్యక్తిగత ప్రైవసీ ఉంటుందని గుర్తు చేస్తున్నారు. సమంత ఎందుకు అంత టెన్షన్లో ఉన్నారు అనేది మాత్రం ప్రస్తుతానికి తెలియదు.
సమంత రూత్ ప్రభుకు సినిమా, వెబ్ సిరీస్, అడ్వర్టైజింగ్ రంగంలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఆమె సౌతిండియాలోనే కాకుండా బాలీవుడ్లో కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీబని’ వంటి వెబ్ సిరీస్‌ల ద్వారా సమంత హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇటీవల, దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె చనువుగా తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Read Also:Kedarnath: తక్కువ బడ్జెట్లో కేదార్నాథ్ వెళ్లడం ఎలా? అయితే ఈ ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం