Kedarnath: తక్కువ బడ్జెట్‌లో కేదార్‌నాథ్ వెళ్లడం ఎలా? అయితే ఈ ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి

Kedarnath: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో కొండల మధ్య కొలువైన ఈ దివ్య క్షేత్రం కేదార్‌నాథ్ ఉంది. ఈ కేదార్‌నాథ్‌ను దర్శించుకోవడానికి ఏటా ఎందరో భక్తులు వెళ్తుంటారు. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. హిమాలయాల్లోని ఈ పవిత్ర స్థలానికి చేరుకోవడం చాలా కష్టం. అయితే కేదార్‌నాథ్‌కు చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీ బడ్జెట్, సమయాన్ని బట్టి మీరు రైలు, బస్సు, విమానం లేదా హెలికాప్టర్ వంటి వాటిని ఎంచుకోవచ్చు. కేదార్‌నాథ్‌కు వెళ్లాలంటే ముందుగా మీరు హరిద్వార్ లేదా డెహ్రాడూన్ మీదుగా వెళ్లాలి. అక్కడ నుంచి బస్సులో హరిద్వార్/రిషికేశ్ వెళ్లాలి. ఇక అక్కడ నుంచి గౌరీకుండ్ వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించాలి. గౌరీకుండ్ నుండి కేదార్‌నాథ్ ఆలయం వరకు సుమారు 16 నుండి 18 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాలి. కాలినడకన వెళ్తే దాదాపుగా 6 గంటల నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఈ సమయంలో మీతో ఒక కర్ర, కొన్ని అత్యవసర వస్తువులు (నీరు, స్నాక్స్, ప్రథమ చికిత్స కిట్, చలి దుస్తులు) తప్పకుండా తీసుకెళ్లాలి. నడవలేని వారు గుర్రాలను ఎంచుకోవచ్చు. ఒక్కొక్కరికి సుమారు రూ.2,300 ఖర్చవుతుంది. డోలీ ఒక్కోరికి రూ.5,500 నుంచి రూ.7,000 వరకు తీసుకుంటారు.
విమాన ప్రయాణం
మీరు విమానంలో కేదార్‌నాథ్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తే సమీప విమానాశ్రయం డెహ్రాడూన్‌లోని జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్ట్. హైదరాబాద్ వంటి నగరాల నుండి డెహ్రాడూన్‌కు విమాన టిక్కెట్ ధర సుమారు రూ.9,500 నుండి రూ.24,000 వరకు ఉంటుంది. మొత్తం మీకు రూ.34,100 వరకు అవుతుంది.
రైలు ప్రయాణం
కేదార్‌నాథ్‌కు సమీప రైల్వే స్టేషన్లు హరిద్వార్ లేదా రిషికేశ్. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ లేదా విశాఖపట్నం నుంచి హరిద్వార్‌కు డైరెక్ట్‌గా రైలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఛార్జీ సుమారు రూ.1,000 నుండి రూ.2,500 వరకు ఉంటుంది. మొత్తం మీకు రూ.9,100 వరకు ఉండవచ్చు.
బస్సు ప్రయాణం
కేదార్‌నాథ్‌కు నేరుగా బస్సులో కూడా వెళ్ళవచ్చు. దీనికి మీరు ముందుగా ఢిల్లీ చేరుకోవాలి. తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి బస్సు ఛార్జీ రూ.1,500 నుండి రూ.3,000 వరకు ఉంటుంది. ఢిల్లీ నుండి హరిద్వార్‌కు బస్సు ఛార్జీ రూ.500 నుండి రూ.1,000 మధ్య ఉంటుంది. మొత్తం కనీస బడ్జెట్ రూ.12,100 వరకు అవుతుంది.
ఇది కూడా చూడండి: WhatsApp’s new changes: వాట్సప్ ఇకపై అలా కనిపిస్తుంది.. కొత్తగా వచ్చే మార్పులు ఏంటంటే..
-
Brutal Incident In Delhi: ఢిల్లీలో దారుణ ఘటన.. భర్త హత్యకు ప్లాన్ ఎలా చేసిందంటే?
-
Telugu States CMs Meet: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ
-
Flipkart Goat Sale: అదిరిపోయే ఫీచర్లతో రూ.4,499 స్మార్ట్‌ఫోన్.. ఆలస్యమెందుకు కొనేయండి
-
Fake Wedding trend: తినంత తిండి.. తాగేంత మందు.. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్. తో ఎంజాయ్ చేయండి
-
Viral News: రూ.84 లక్షల లగ్జరీ కారు.. కేవలం రూ. 2.5 లక్షలు మాత్రమే.. ఎక్కడో తెలిస్తే మీరు కొనేస్తారు
-
Auto Driver: నెలకు రూ.8 లక్షలు.. ఇది ఒక ఆటో డ్రైవర్ జీతం.. వైరల్ న్యూస్