Viral News: రూ.84 లక్షల లగ్జరీ కారు.. కేవలం రూ. 2.5 లక్షలు మాత్రమే.. ఎక్కడో తెలిస్తే మీరు కొనేస్తారు

Viral News: మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉన్న లగ్జరీ కారు కొనాలని చాలా మంది అనుకుంటారు. నిజానికి మధ్య తరగతి వారి కల కారు. లగ్జరీ కారు కొనలేక కొందరు సాధారణ కార్లు కొంటారు. లేకపోతే ఆ లగ్జరీ కారును సెకండ్స్‌లో కొంటారు. అయితే ఈ లగ్జరీ కార్లు సెకండ్స్‌లో కూడా భారీ ధరను పలుకుతాయి. అయితే ఇటీవల ఓ వ్యక్తి తన లగ్జరీ కారును తక్కువ ధరకే అమ్మేశాడు. ఏదో లక్ష లేదా రెండు లక్షలకు తక్కువగా అమ్మలేదు. ఓ వ్యక్తి రూ.84 లక్షల లగ్జరీ కారును రూ.2.50 లక్షలకే కేవలం అమ్మేశాడంటే నమ్ముతారా? అలాగని ఇదేం ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కాదు. అసలు ఎందుకు ఇంత తక్కువ ధరకు ఆ కారును అమ్మేశాడో పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుతం ఓ కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. దీనివల్ల లక్షలు పెట్టి కొన్న కారును ఇలా తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోంది. అయితే ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్ 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలను వాడకూడదు. వీటిపై ఢిల్లీలో నిషేధం విధించారు. ఇలాంటి వాహనాలకు ఢిల్లీ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కూడా ఇవ్వరు. దీంతో ఆ వాహనం ఏం చేయలేక వేరే రాష్ట్రంలో అమ్మేస్తున్నారు. అయితే సాధారణంగా ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు ఈ పాత వాహనాల వల్ల ఇంకా ఎక్కువగా కాలుష్యం పెరుగుతుంది. అందుకే మంచిగా ఉన్న లగ్జరీ వాహనాలను కూడా ఇలా అమ్మేస్తున్నారు. కొన్ని వాహనాలకు మంచి లైఫ్ ఉన్నా కూడా తక్కువ ధరకే అమ్మాల్సి వస్తుంది. గతంలో ఎక్కువ డబ్బులు పెట్టి కొనుగోలు చేసినా కూడా తక్కువకి అమ్మాలి. ఈ క్రమంలోనే రూ.84 లక్షల లగ్జరీ కారును రూ.2.50 లక్షలకు ఓ వ్యక్తి అమ్మేశారు.
ఈ విషయాన్ని రితేష్ గండోత్రా అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. చాలా జాగ్రత్తగా కారను వాడామని, 8 ఏళ్ల క్రితం కారు ఇది. ఎక్కువగా తిరగలేదు. కేవలం 74,000 కిలో మీటర్లు మాత్రమే తిరిగిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ ఎనిమిదేళ్లలో కోవిడ్ సమయంలో రెండు ఏళ్ల పాటు అలా పార్కింగ్‌లోనే ఉండిపోయిందని అన్నారు. ఈ కారు ఇంకా తిరగడానికి 2 లక్షల కిలో మీటర్లు ఉంది. కానీ ఇంత మంచి కారును ఇప్పుడు అమ్మాల్సి వస్తుందని అన్నారు. మరో వ్యక్తి 2015లో కొనుగోలు చేసిన తన మెర్సిడెస్-బెంజ్ ML350 కారును రూ.2.5 లక్షలకు అమ్మవలసి వచ్చిందని బాధపడ్డారు. ఢిల్లీలో ఇలా ఎన్నో కారులు తక్కువ ధరకే అమ్మాల్సి వస్తుందని అన్నారు. ఎన్నో కిలోమీటర్లు తిరగాల్సి ఉండగా కూడా ఇప్పుడు కొత్త రూల్స్ వల్ల మార్చాల్సి వస్తుందన్నారు.
Also Read: RailOne : రైల్వే ప్రయాణికులకు బంపర్ న్యూస్.. టికెట్, ఫుడ్.. అన్నీ ఒకే యాప్‌లో!
-
Kedarnath: తక్కువ బడ్జెట్‌లో కేదార్‌నాథ్ వెళ్లడం ఎలా? అయితే ఈ ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి
-
UPI Payments : యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్థిక మంత్రిత్వ శాఖ
-
Singer Mangli Birthday Party: మంగ్లీ డ్రగ్స్ తీసుకుందా.. అందుకేనా వీడియో వద్దు.. ఇందులో ఏది నిజమేంటి?
-
Auto Driver: నెలకు రూ.8 లక్షలు.. ఇది ఒక ఆటో డ్రైవర్ జీతం.. వైరల్ న్యూస్
-
Viral News: మరీ ఇంత దారుణమా.. స్నానం చేసిన నీరు విక్రయించడం.. వైరల్ న్యూస్
-
YouTuber Sunny Yadav arrested: యూట్యూబర్ సన్నీ యాదవ్ అరెస్ట్.. బెట్టింగ్ యాప్స్ కారణమా?