Telugu States CMs Meet: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ
Telugu States CMs Meet ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరు రాష్ట్రాల సీఎస్ లు హాజరయ్యారు.

Telugu States CMs Meet: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్యనున్న జల అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో శ్రమశక్తి భవన్లో సమావేశమయ్యారు. ఏపీ ప్రతిపాదించిన పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో పాటు తెలంగాణ ప్రతిపాదించిన 10 అంశాలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నట్లు సమాచారం.
ఈ భేటీకి ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరు రాష్ట్రాల సీఎస్ లు హాజరయ్యారు. ఈ భేటీలో లేవనెత్తాల్సిన అంశాలు, సాంకేతికంగా ఇవ్వాల్సిన సమాధానాలపై చర్చించారు. సీఎంలు తమ అధికారిక నివాసాల్లో సుమారు గంటన్నరపాటు సీఎస్ లు, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారుతో సమీక్షించారు.
Related News
-
Telangana Heavy Rains: తెలంగాణలో ఆ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
-
Rajagopal Reddy Counters CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి కౌంటర్
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
-
KTR Comments On CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
-
Free Bus In AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్ డేట్