Fake Wedding trend: తినంత తిండి.. తాగేంత మందు.. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్. తో ఎంజాయ్ చేయండి

Fake Wedding trend: పెళ్లికి రావాలని ఆహ్వానాలు వస్తున్నాయి.. భోజనాలు, హల్దీ, ఫొటో షూటింగ్ ఇలా అన్ని ఉన్నాయి. కానీ ఒకటే లోటు.. వరుడు, వధువు ఉండరు. ఇదేందయ్యా ఆట అనుకుంటున్నారా.. మీరు విన్నది నిజమే. ఈ పెళ్లిలో అన్ని ఉంటాయి. కానీ వరుడు, వధువు అసలు ఉండరు. ప్రస్తుతం ఈ ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్ నడుస్తోంది. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి రోజుకొక ట్రెండ్ వస్తోంది. ఎక్కడ లేని ట్రెండ్‌లు అన్ని కూడా ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్నాయి. అసలు ఈ ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్ ఏంటో పూర్తి వివరాల్లో మీకు తెలియాలంటే మీరు స్టోరీ మొత్తం చదవాల్సిందే.
ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్ అంటే.. పెళ్లిలో వధూవరులు లేకుండా జరగడం. ఈ పెళ్లిలో శుభలేఖలు, కంకణాలు ఉండవు. ఒక పెళ్లి మండపంలో ఫేక్‌గా జరిగే పెళ్లి. అంటే పెళ్లి కొడుకు, కూతురు ఉండరు. కానీ భోజనాలు, డీజే, హల్దీ, ఫొటోషూట్, మండపాలు అన్ని ఉంటాయి. చూడటానికి ఇది నిజమైన పెళ్లిలా అనిపిస్తు్ంది. కానీ ఇది అసలు నిజమైన పెళ్లి కాదు. ఈ ఫేక్ వెడ్డింగ్ ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, పుణే వంటి నగరాల్లో ఉంది. అయితే పెళ్లి వేడుకను ఒక ఎక్స్‌పీరియన్స్ చేయడం కోసం నిర్వహిస్తారు. అలాగే ఒత్తిడితో ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. బాగా ఒత్తిడిగా అనిపిస్తే ఈ ఫేక్ వెడ్డింగ్‌కి వెళ్లడం వల్ల కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో పెళ్లిలో జరిగే అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కేవలం పెళ్లి కొడుకు, కూతురు మాత్రమే ఉండరు. ఈ వేడుకకు రూ.1499 పెట్టి టికెట్ బుక్ చేసుకుని వెళ్లవచ్చు. దీనికి వెళ్లేవారంతా కూడా బాగా రెడీ అయ్యి వెళ్తారు. చీరలు, లెహంగాలు, షెర్వాణీలు ఇలా బాగా ధరించి వెళ్తుంటారు. అక్కడ ఫోటోలు తీసుకుని, రీల్స్ చేస్తుంటారు. అలాగే డ్యాన్స్ చేస్తుంటారు. ఇలా అందరితో కలిసి ఎంజాయ్ చేయడం వల్ల ఒత్తిడి తొలగిపోతుంది.
ఈ ఫేక్ వెడ్డింగ్ వల్ల కొందరికి పెళ్లి గురించి పూర్తిగా తెలుస్తుందని అంటున్నారు. అలాగే కొందరికి పెళ్లి సంప్రదాయం గురించి పూర్తిగా తెలియదు. అలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫేక్ వెడ్డి్ంగ్ వల్ల అందులో ఉన్న సంప్రదాయాలు అన్నింటి గురించి కూడా పూర్తిగా తెలుస్తాయి. అందరితో కలిసి మాట్లాడతారు. ఎంజాయ్‌గా అనిపిస్తుంది. అలాగే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇతరులతో మాట్లాడే కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఇతరులను గౌరవించడం వంటి అన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే సంప్రదాయాలు అన్ని కూడా తెలుస్తాయని దీన్ని నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్ వల్ల యువత ఎంజాయ్ చేస్తున్నారు.
Also read: SSMB29 : మహేష్ బాబు సినిమాకు కొత్త చిక్కులు.. షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న రాజమౌళి
-
Telugu States CMs Meet: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
Tesla Enters India: భారత్ లోకి అడుగుపెట్టిన టెస్లా.. ధర, ఫీచర్లు ఇవే
-
Hair cutting price: ప్రపంచంలోనే హెయిర్ కట్ కి అత్యధికంగా ఛార్జ్ చేస్తున్న దేశాలేవో తెలుసా?
-
Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Starlink : భారతదేశంలో ఏ మారుమూలన ఉన్నా.. సిగ్నల్స్ లేకున్నా హై స్పీడ్ ఇంటర్నెట్