UPI Payments : యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్థిక మంత్రిత్వ శాఖ

UPI Payments : యూపీఐ పేమెంట్స్ గురించి సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాలలో ఇటీవల తరచుగా ఒక వార్త వైరల్ అవుతోంది. ప్రభుత్వం యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించేటప్పుడు , స్వీకరించేటప్పుడు దుకాణదారుల నుంచి ఎక్స్ ట్రా ఛార్జీలు వసూలు చేయనుందని ప్రచారం జరుగుతోంది. ఇందుకు కార్యచరణ కూడా సిద్ధమైందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల యూపీఐ చెల్లింపులు వీసా కార్డ్ (Visa Card) పేమెంట్స్ అధిగమించి ఆన్లైన్ చెల్లింపులలో (Online Payments) మొదటి స్థానాన్ని సంపాదించుకున్నాయి.
ఈ మధ్య యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుంచి యూపీఐ ఉపయోగించే వారిలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో, యూపీఐ చెల్లింపులపై అదనపు ఛార్జీలు తీసుకుంటారా లేదా అనే దానిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.
Read Also:UPI Payments: యూపీఐ పేమెంట్స్ చేసేవారికి బ్యాడ్ న్యూస్.. లావాదేవీలపై ఇక ఛార్జీలు?
అదనపు ఛార్జీలు పుకార్లే
యూపీఐ పేమెంట్స్ ఛార్జీలు ఉండే విధంగా మారబోతున్నాయనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఆర్థిక మంత్రిత్వ శాఖ తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో “యూపీఐ చెల్లింపులపై దుకాణదారులకు అదనపు ఛార్జీలు విధించబడతాయా?” అనే వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. అవి కేవలం పుకార్లు, తప్పుడు వార్తలు అని పేర్కొంది. అంతేకాకుండా, అలాంటి పుకార్లు సృష్టించే వారు అనవసరమైన ఆందోళనను క్రియేట్ చేస్తున్నారని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉందని కూడా సోషల్ మీడియా పోస్ట్‌లో తెలియజేసింది.
వీసాను అధిగమించిన యూపీఐ
యూపీఐ జూన్ నెలలో సాధించిన ట్రాన్సాక్షన్లు, వీసా లావాదేవీల కంటే చాలా ఎక్కువ. జూన్ 1, 2025న యూపీఐ ద్వారా 64.4 కోట్ల లావాదేవీలు జరిగాయి. మరుసటి రోజే ఈ లావాదేవీల సంఖ్య 65 కోట్లు దాటింది. అయితే, ఆర్థిక సంవత్సరం 2024లో వీసా ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య 64 కోట్లు మాత్రమే. జూన్ 2025లో యూపీఐ ద్వారా మొదటి మూడు రోజుల్లో జరిగిన సగటు లావాదేవీలు 64.8 కోట్లుగా ఉన్నాయి. యూపీఐ సాధించిన ఈ వృద్ధిపై ఎయిర్పే వ్యవస్థాపకుడు కునాల్ ఝున్‌ఝున్‌వాలా మాట్లాడుతూ.. యూపీఐ రోజువారీ లావాదేవీలలో త్వరలో వీసాను అధిగమించబోతోందని అన్నారు. కాబట్టి, యూపీఐ చెల్లింపులపై అదనపు ఛార్జీల గురించి వస్తున్న వార్తలు కేవలం పుకార్లే అని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Read Also:Vastu Tips: ఇంటి మెట్ల కింద టాయిలెట్ అస్సలు కట్టకూడదు.. ఎందుకో తెలుసా ?
-
Viral News: రూ.84 లక్షల లగ్జరీ కారు.. కేవలం రూ. 2.5 లక్షలు మాత్రమే.. ఎక్కడో తెలిస్తే మీరు కొనేస్తారు
-
UPI Payments: యూపీఐ పేమెంట్స్ చేసేవారికి బ్యాడ్ న్యూస్.. లావాదేవీలపై ఇక ఛార్జీలు?
-
Singer Mangli Birthday Party: మంగ్లీ డ్రగ్స్ తీసుకుందా.. అందుకేనా వీడియో వద్దు.. ఇందులో ఏది నిజమేంటి?
-
Auto Driver: నెలకు రూ.8 లక్షలు.. ఇది ఒక ఆటో డ్రైవర్ జీతం.. వైరల్ న్యూస్
-
Viral News: మరీ ఇంత దారుణమా.. స్నానం చేసిన నీరు విక్రయించడం.. వైరల్ న్యూస్
-
YouTuber Sunny Yadav arrested: యూట్యూబర్ సన్నీ యాదవ్ అరెస్ట్.. బెట్టింగ్ యాప్స్ కారణమా?