UPI Payments: యూపీఐ పేమెంట్స్ చేసేవారికి బ్యాడ్ న్యూస్.. లావాదేవీలపై ఇక ఛార్జీలు?

UPI Payments: ఇప్పుడు గల్లీలోని చిన్న కిరాణా షాపుల నుంచి ఢిల్లీలోని పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అంతా యూపీఐ హవా నడుస్తోంది. పాలు, పెరుగు, ఛాయ్, కూరగాయలు కొనుగోలు దగ్గర నుంచి విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలు కొనే వరకు అన్నీ ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యూపీఐ యాప్‌ల ద్వారానే జరుగుతున్నాయి. ఫోన్ నంబర్ సాయంతో ఇంట్లో కూర్చునే ఎవరికైనా ఎంత మొత్తమైనా చిటికెలో డబ్బు పంపించవచ్చు. ఇప్పటివరకు ఈ యూపీఐ లావాదేవీలపై ఎటువంటి ట్యాక్స్ లేదా ఛార్జీలు ఉండేవి కావు. అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులపై ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. యూపీఐ ద్వారా రూ.3 వేలకు పైబడిన లావాదేవీలపై ఛార్జీలు విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నిర్ణయం గనుక అమలైతే, దేశవ్యాప్తంగా లక్షలాది మంది యూపీఐ వినియోగదారులపై ఇది ప్రభావం చూపనుంది. ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డులపై ఎమ్‌డీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) అనే ఛార్జీలు ఉన్నాయి. ఇవి 0.9 శాతం నుంచి 2 శాతం వరకు ఉంటాయి. ఈ ఛార్జీలను సాధారణంగా వ్యాపారులు లేదా చెల్లింపులు స్వీకరించేవారు బ్యాంక్‌లకు చెల్లిస్తారు. ఇప్పుడు యూపీఐ విషయంలో కూడా ఇదే పద్ధతిని అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
చిన్న మొత్తాల యూపీఐ లావాదేవీలపై మాత్రం ఎమ్‌డీఆర్ ఛార్జీల మినహాయింపు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే రూ.3 వేల లోపు ఎలాంటి ఛార్జీలు ఉండవు. రూపే కార్డులపై ప్రస్తుతానికి ఎమ్‌డీఆర్ విధించే ఆలోచన లేనట్లు సమాచారం. యూపీఐల ద్వారా రూ.3 వేలకు పైగా చేసే లావాదేవీలపై ఈ ఛార్జీలను మరో రెండు మూడు నెలల్లో విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఛార్జీలు వ్యాపారులకు వర్తిస్తాయి. అయితే, చాలా సందర్భాలలో వ్యాపారులు ఈ అదనపు భారాన్ని వస్తువులు లేదా సేవల ధరలు పెంచడం ద్వారా వినియోగదారులపై పరోక్షంగా బదిలీ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల రూ.3 వేలకు పైబడిన యూపీఐ చెల్లింపులు చేసే వినియోగదారులకు పరోక్షంగా కొంత ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల యూపీఐ లావాదేవీలు తగ్గుతాయా, లేక ప్రజలు పెద్ద మొత్తాల చెల్లింపులకు ఇతర పద్ధతులను ఆశ్రయిస్తారా అనేది వేచి చూడాలి. డిజిటల్ ఇండియాలో యూపీఐ ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. ఇప్పుడు రాబోయే ఈ ఛార్జీలు దాని వినియోగంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో చూడాలి.
ఇది కూడా చూడండి: Vitamin B12 : విటమిన్ బి12 కేవలం నాన్ వెజ్ లోనే ఉంటుందా..ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతున్నారంటే ?
-
Whatsapp New Feature: వాట్సాప్‌లోకి వచ్చేసిన కొత్త ఫీచర్.. యూజర్ల ప్రైవసీకి అసలు భయపడక్కర్లేదు
-
Anil Ravipudi: సుధీర్‌నే టార్గెట్ చేయమన్నారు.. సంచలన విషయాలు బయట పెట్టిన అనిల్ రావిపూడి
-
UPI Circle : ఇక నుంచి పిల్లలు కూడా యూపీఐ చేయొచ్చు.. కొత్త ఫీచర్ వచ్చేసింది
-
Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?
-
Zodiac Signs: త్వరలో జరగనున్న మహా అద్భుతం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Home loan refinancing: గృహ రుణ రీఫైనాన్సింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలేంటి?