UPI Circle : ఇక నుంచి పిల్లలు కూడా యూపీఐ చేయొచ్చు.. కొత్త ఫీచర్ వచ్చేసింది

UPI Circle : ఈరోజుల్లో ఏ చిన్న పనికైనా UPI పేమెంట్స్ కామన్. కిరాణా కొన్నా, ఎవరికైనా డబ్బులు పంపాలన్నా UPI తోనే జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో చాలా మంది తల్లిదండ్రులకు ఒక డౌట్ వస్తుంది.. పిల్లలు కూడా UPI పేమెంట్స్ చేయవచ్చా అని ప్రశ్న మొదలవుతుంది. మీ పిల్లల వయసు, బ్యాంక్ అకౌంట్ బట్టి ఇది సాధ్యమవుతుంది. ముఖ్యంగా, UPI సర్కిల్ అనే ఒక కొత్త ఫీచర్‌తో పిల్లలు కూడా పేమెంట్స్ చేయొచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది? ఎలా సెట్ చేసుకోవాలి? వివరంగా తెలుసుకుందాం.
ఇప్పుడు గూగుల్ పే, భీమ్ యాప్‌లలో ‘UPI సర్కిల్’ అనే ఒక కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది. దీని ద్వారా తల్లిదండ్రులు తమ బ్యాంక్ అకౌంట్‌ను పిల్లల యాప్‌కి లింక్ చేయొచ్చు. దీనివల్ల పిల్లలు సులువుగా పేమెంట్లు చేసుకోవచ్చు. కాకపోతే పేమెంట్ చేసే కంట్రోల్ మొత్తం తల్లిదండ్రుల చేతిలోనే ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్ లేదా UPI పిన్ (UPI PIN) పిల్లలకు తెలీయాల్సిన అవసరం లేదు. మీరు రోజుకు లేదా నెలకు ఎంత డబ్బు ఖర్చు చేయొచ్చో లిమిట్ పెట్టొచ్చు. లేదా, ప్రతి పేమెంట్‌కు మీ అప్రూవల్ కావాలని సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ముఖ్యంగా 15 సంవత్సరాల లోపు పిల్లల కోసం, లేదా సొంతంగా బ్యాంక్ అకౌంట్ లేని పిల్లల కోసం.
ఒకవేళ మీ పిల్లలకు 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండి, వారి పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉంటే, వారు సొంతంగా UPI ID కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు 10 ఏళ్ల పిల్లలకు కూడా తల్లిదండ్రుల పర్యవేక్షణలో అకౌంట్లు తెరవడానికి అనుమతిస్తాయి.
Read Also:Walking Tips: డైలీ ఇలా వాకింగ్ చేస్తే.. ఆరోగ్యానికి లక్షలకొద్ది లాభాలు!
UPI సర్కిల్ ఎలా సెటప్ చేయాలి?
* ముందుగా, మీ ఫోన్లో Google Pay లేదా BHIM యాప్‌ను ఓపెన్ చేయండి.
* మీ ప్రొఫైల్ పిక్చర్ (Profile Picture) పై క్లిక్ చేయండి.
* కిందకి స్క్రోల్ చేస్తే ‘UPI సర్కిల్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
* అక్కడ మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి: ‘యాడ్ పీపుల్ టు యువర్ UPI సర్కిల్’, ‘జాయిన్ UPI సర్కిల్’.
* మీ పిల్లలను చేర్చడానికి ‘యాడ్’ (Add) ఆప్షన్ ఎంచుకోండి.
తర్వాత, మీ పిల్లల ఫోన్లో ఉన్న పేమెంట్ యాప్ (Google Pay, PhonePe, Paytm వంటివి) ఓపెన్ చేసి, వారి అకౌంట్లో కనిపించే QR కోడ్‌ను మీ ఫోన్‌తో స్కాన్ చేయండి. (ఉదాహరణకు, పిల్లల ఫోన్లో Google Pay ఉంటే, దానిలో ‘జాయిన్’ ఆప్షన్ క్లిక్ చేస్తే QR కోడ్ కనిపిస్తుంది.) QR కోడ్ స్కాన్ చేశాక, ‘యాడ్ టు మై UPI సర్కిల్’ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు రెండు ఆప్షన్లు వస్తాయి: ‘స్పెండ్ విత్ లిమిట్స్’ లేదా ‘అప్రూవ్ ఎవ్రీ పేమెంట్’. వీటిలో మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోండి. చివరగా, సెకండరీ యూజర్‌గా మీ పిల్లలను యాడ్ చేయడానికి మీ UPI పిన్ ఎంటర్ చేయండి. అంతే, సెటప్ కంప్లీట్ అవుతుంది.
Read Also:Micro Robots: సమస్యలకు సరికొత్త చికిత్స.. మైక్రో రోబోలతో సమస్యలు క్లియర్
-
UPI : యూపీఐలో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త
-
PhonePe and Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా?
-
Elon Musk : సూపర్ యాప్ గా మారబోతున్న .. మస్క్ X యాప్.. ఇక అన్నీ దాని నుంచేనట
-
UPI Payments: యూపీఐ పేమెంట్స్ చేసేవారికి బ్యాడ్ న్యూస్.. లావాదేవీలపై ఇక ఛార్జీలు?
-
Call Merging Scam : వెలుగులోకి కొత్త మోసం.. కాల్ మర్జింగ్ స్కామ్.. నిమిషాల్లో మీ డబ్బులు మాయం
-
Banking Frauds : సామాన్యులనే కాదు..బ్యాంకులనూ దోచేస్తున్న కేటుగాళ్లు..ఏడాదిలో 3రెట్లు పెరిగిన సైబర్ మోసాలు