UPI : యూపీఐలో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త

UPI : మన దేశంలో యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయడం ప్రస్తుతం కామన్ అయిపోయింది. చిన్న టీ తాగినా, షాపింగ్‌కి వెళ్లినా, పెద్ద పెద్ద బిల్లులు కట్టినా… ఫోన్‌పే (PhonePe), గూగుల్ పే (Google Pay), పేటీఎం (Paytm) లాంటి యాప్‌లతో క్షణాల్లో పని కానిచ్చేస్తున్నాం. దీనివల్ల క్యాష్తో పని లేకుండా పోయింది. డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరిగాయి.
యూపీఐ నెట్వర్క్ ఇంత పెద్ద ఎత్తున వాడుకలోకి రావడంతో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఇంకా మంచి సేవలు అందించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లు రోజూ చేసే కొన్ని పనులకు సంబంధించి కొన్ని పరిమితులు పెట్టబోతోంది. ఇది యూపీఐ నెట్‌వర్క్‌పై భారాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం అని ఎన్పీసీఐ చెబుతోంది.
Read Also:Jaundice: కామెర్లు వచ్చినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. తస్మాత్ జాగ్రత్త
యూపీఐ ద్వారా మనం తరచుగా చేసే పనుల్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఒకటి. చాలామంది తరచుగా తమ బ్యాలెన్స్‌ను చెక్ చేస్తుంటారు. ఈ పదే పదే చేసే చెకింగ్లు యూపీఐ నెట్‌వర్క్‌పై కొంత భారాన్ని పెంచుతాయని ఎన్పీసీఐ గుర్తించింది. అందుకే, ఈ భారాన్ని తగ్గించడానికి కొత్త రూల్స్ తీసుకొచ్చింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఆగస్టు 1, 2025 నుంచి మీరు రోజులో గరిష్టంగా 50 సార్లు మాత్రమే మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోగలరు. అంటే, 24 గంటల్లో మీరు 50 సార్లు మాత్రమే మీ యూపీఐ యాప్ ద్వారా మీ బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో చూసుకోగలరు. మీరు ఒకటికి మించి యూపీఐ యాప్‌లు వాడుతుంటే (ఉదాహరణకు.. ఫోన్‌పే, గూగుల్ పే రెండూ వాడుతున్నారనుకుందాం), అప్పుడు మీరు ప్రతి యాప్‌లో రోజుకు 50 సార్లు చొప్పున బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
Read Also:Fahadh Faasil: లగ్జరీ కారును కొనుగోలు చేసిన ఫహద్ ఫాసిల్.. ఆ డబ్బుతో ఓ అపార్ట్ మెంట్ కొనేయొచ్చు
అంటే ఫోన్‌పేలో 50 సార్లు, గూగుల్ పేలో 50 సార్లు …ఇలా మొత్తం కలిపి 100 సార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అయితే, ఇది వేర్వేరు యాప్‌ల ద్వారా మాత్రమే సాధ్యం. ఒకే యాప్‌లో ఒక రోజులో 50 సార్లు దాటి బ్యాలెన్స్ చెక్ చేయడానికి కుదరదు. ఈ కొత్త నిబంధన యూపీఐ నెట్‌వర్క్‌ను మరింత సమర్థవంతంగా నడపడానికి, వినియోగదారులకు అంతరాయం లేని సేవలు అందించడానికే అని ఎన్పీసీఐ స్పష్టం చేసింది.
-
PhonePe and Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా?
-
Elon Musk : సూపర్ యాప్ గా మారబోతున్న .. మస్క్ X యాప్.. ఇక అన్నీ దాని నుంచేనట
-
UPI Payments: యూపీఐ పేమెంట్స్ చేసేవారికి బ్యాడ్ న్యూస్.. లావాదేవీలపై ఇక ఛార్జీలు?
-
Call Merging Scam : వెలుగులోకి కొత్త మోసం.. కాల్ మర్జింగ్ స్కామ్.. నిమిషాల్లో మీ డబ్బులు మాయం
-
Banking Frauds : సామాన్యులనే కాదు..బ్యాంకులనూ దోచేస్తున్న కేటుగాళ్లు..ఏడాదిలో 3రెట్లు పెరిగిన సైబర్ మోసాలు
-
Shock for UPI users: యూపీఐ యూజర్లకు షాక్.. ఆగస్ట్ 1నుంచి మారనున్న రూల్స్