Elon Musk : సూపర్ యాప్ గా మారబోతున్న .. మస్క్ X యాప్.. ఇక అన్నీ దాని నుంచేనట

Elon Musk : ప్రపంచంలోనే ధనవంతుడైన బిజినెస్ ఐకాన్ ఎలన్ మస్క్ ఇప్పుడు ఇంకో పెద్ద ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నారు. ఆయన ఇప్పటికే తన స్టార్ లింక్ తో ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ను కొత్త స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన దృష్టి అంతా డిజిటల్ పేమెంట్లు, ఫైనాన్షియల్ టెక్నాలజీ ప్రపంచంలోకి అడుగు పెట్టడంపై ఉంది. అంటే, ఆయన కొత్తగా ఏదో పెద్ద ప్లానే చేస్తున్నారు.
ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను కొన్నప్పటి నుంచీ దానిని కేవలం ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా ఉంచలేదు. ఇప్పుడు దాని పేరు X అని మారింది. త్వరలోనే ఇది ఒక ‘సూపర్ యాప్’ గా మారబోతోందట. అంటే, మీరు ఈ యాప్‌లో కేవలం పోస్టులు పెట్టడమే కాదు, షాపింగ్ చేయడం, బ్యాంకింగ్ పనులు చూసుకోవడం, డబ్బులు ఇన్వెస్ట్ చేయడం, ఇంకా పేమెంట్లు చేయడం.. ఇవన్నీ ఒకే యాప్‌లో చేయొచ్చన్నమాట.
ఫైనాన్షియల్ టైమ్స్ అనే పత్రిక రిపోర్ట్ ప్రకారం, X కంపెనీ సీఈఓ లిండా యాకారినో ఒక విషయం చెప్పారు. అదేంటంటే, X యాప్ భవిష్యత్తులో పిజ్జాకు డబ్బులు కట్టడం దగ్గర నుంచి, స్టాక్ ట్రేడింగ్ చేయడం, డబ్బులు ఇన్వెస్ట్ చేయడం, రోజువారీ షాపింగ్ చేయడం ఇలా ప్రతీ పని చేయగలదని చెప్పారు.
కంపెనీ ప్లాన్ ఏంటంటే.. X త్వరలోనే తన సొంత డిజిటల్ వాలెట్ ను లాంచ్ చేయాలి. దీని ద్వారా ప్రజలు వస్తువులు కొనడం, డబ్బులు పంపడం, పేమెంట్లు చేయడం లాంటి పనులు చేయగలరు. దీంతో పాటు, X కంపెనీ X డెబిట్, క్రెడిట్ కార్డులను కూడా తీసుకురావడానికి రెడీ అవుతోందట.
ఎలన్ మస్క్ కల ఏంటంటే.. ఒకే ఒక్క యాప్ ఉండాలి. దాన్ని వాడితే యూజర్లు వేర్వేరు పనుల కోసం వేర్వేరు యాప్‌లను వాడాల్సిన అవసరం ఉండకూడదు. చైనాలో వీచాట్ అనే ఒక యాప్ ఉంది. అందులో చాటింగ్, పేమెంట్స్, బుకింగ్స్, షాపింగ్ అన్నీ ఒకే చోట జరుగుతాయి. అచ్చం అదే విధంగా మస్క్ కూడా X ను ఒక సూపర్ యాప్ గా తయారు చేసే పనిలో ఉన్నారు.
Read Also:RBI : ఆర్బీఐ కొత్త రూల్.. పదేళ్లు దాటిన పిల్లలకు గుడ్ న్యూస్
వీచాట్ లాగానే X కూడా ఒకే యాప్ అవుతుంది. ఇది యూజర్ల మెసేజింగ్, సోషల్ మీడియా, షాపింగ్ ఇంకా డిజిటల్ పేమెంట్ అవసరాలను ఒకే చోట తీరుస్తుంది. వాట్సాప్ కూడా ఈ దిశలో మొదలుపెట్టింది కానీ, పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు మస్క్ X ఆ లోపాలన్నిటినీ సరిచేసి, ప్రపంచం మొత్తంలో ఒక సూపర్ యాప్‌గా మారిపోవాలని కోరుకుంటున్నారు.
భారత్‌కు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కానీ, ఇండియా ఒక పెద్ద డిజిటల్ మార్కెట్ కాబట్టి, మస్క్ దీన్ని అస్సలు వదిలిపెట్టరు. భవిష్యత్తులో ఇండియాలో కూడా X యాప్ ద్వారా పేమెంట్లు, ఇన్వెస్ట్మెంట్లు లాంటి ఫీచర్లు కచ్చితంగా అందుబాటులోకి వస్తాయని అందరూ ఆశిస్తున్నారు.
-
UPI : యూపీఐలో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త
-
Satellite internet: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. డైరెక్ట్‌గా శాటిలైట్ ఇంటర్నెట్
-
Call Merging Scam : వెలుగులోకి కొత్త మోసం.. కాల్ మర్జింగ్ స్కామ్.. నిమిషాల్లో మీ డబ్బులు మాయం
-
Starlink : జియోలాంటి ప్లాన్స్‌తో స్టార్‌లింక్ ఎంట్రీ..ఇంటర్నెట్ మార్కెట్లో మస్క్ సంచలనం!
-
Banking Frauds : సామాన్యులనే కాదు..బ్యాంకులనూ దోచేస్తున్న కేటుగాళ్లు..ఏడాదిలో 3రెట్లు పెరిగిన సైబర్ మోసాలు
-
UPI : యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్.. మోసాలకు చెక్ పెట్టేలా కొత్త సిస్టమ్