Satellite internet: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. డైరెక్ట్‌గా శాటిలైట్ ఇంటర్నెట్

Satellite internet:దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నెట్‌వర్క్ ఉండదు. ఇలాంటి సమస్యల నుంచి వినియోగదారులకు విముక్తి కల్పించేందుకు ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా ఓ నిర్ణయం తీసుకుంది. భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు ప్రారంభించడానికి ఒప్పందం చేసుకుంది. వోడాఫోన్ ఐడియా అమెరికాకు చెందిన శాటిలైట్ల తయారీ సంస్థ ఏఎస్‌టీ స్పేస్ మొబైల్‌తో ఒప్పందం చేసుకుంది. అయితే ఏఎస్‌టీ అనేది ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌కు పోటీ సంస్థ. అయితే ఈ సంస్థ అంతరిక్ష ఆధారిత సెల్యూలర్ బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్‌ను అందిస్తోంది. ఇలా AST స్పేస్ మొబైల్స్ బాగా గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈ సంస్థ డైరెక్ట్‌గా అంతరిక్షం నుంచి స్మార్ట్‌ఫోన్‌కే సర్వీసులు అందిస్తుంది. అయితే జియో, ఎయిర్‌టెల్ సంస్థలు కూడా స్పేస్‌ఎక్స్ సంస్థతో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. స్పేస్‌ఎక్స్‌కు చెందిన అనుబంధ సంస్థ స్టార్‌లింక్ ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. ఈ సర్వీసులు యూజర్లు పొందాలంటే తప్పకుండా ఒక ప్రత్యేకమైన హార్డ్‌వేర్‌ను కొనుగోలు చేయాలి. డైరెక్ట్‌గా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. అయితే దీన్ని కమర్షియల్, ప్రభుత్వ అప్లికేషన్ల కోసం మాత్రమే డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మొబైల్ నెట్‌వర్క్ చాలా ప్రాంతాల్లో ఉండదు. ఇలాంటి ప్రాంతాల్లో కనెక్టివిటీని విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికా సంస్థ అయిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్స్ అంతరిక్షం నుంచి డైరెక్ట్‌గా స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వాయిస్, వీడియో కాల్ సేవలు అందిస్తుంది. అలాగే అంతరిక్షం నుంచి డైరెక్ట్‌గా 4G, 5G సేవలు అందిస్తామని AST స్పేస్‌మొబైల్స్ సంస్థ తెలిపింది. అయితే వోడాఫోన్ ఐడియా, ఏఎస్‌టీ ఒప్పందం చేసుకున్న ఈ సర్వీసులు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయనే విషయం తెలియాల్సి ఉంది. ఈ సేవలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయనే విషయాన్ని అయితే ఇంకా రెండు సంస్థలు వెల్లడించలేదు. అయితే ఇటీవల టెలికాం విభాగం స్టార్ లింక్‌కు లైసెన్స్ మంజూరు చేసింది. అలాగే ట్రాయ్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. ఆమోదం పొందిన తర్వాత సేవలు ప్రారంభం అవుతాయి. అయితే దీనికి కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్టార్‌లింక్ ప్రస్తుతం సుమారుగా వందకు పైగా దేశాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తోంది. అలాగే 6 వేలకు పైగా ఉపగ్రహాలతో శాటిలైట్ ఇంటర్నెట్‌ను కూడా అందిస్తోంది. ఇవి భూమికి సుమారుగా 550 కి.మీ ఎత్తులో పరిభ్రమిస్తున్నాయి. ఇక్కడ నుంచే హైస్పీడ్ ఇంటర్నెట్‌ను ఇవి అందిస్తున్నాయి. అయితే మిగతా దేశాలతో పోలిస్తే భారత్లో తక్కువ ధరకే ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Google pixle 10 series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. డిజైన్, ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే భయ్యా
-
BSNL : బీఎస్ఎన్ఎల్ ధమాకా ఆఫర్.. ఇక మీద ఇంటివద్దకే సిమ్ కార్డ్
-
Recharge Plan : జియో, ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్.. గంటల లెక్కన ఇంటర్నెట్ డేటా?
-
Elon Musk : సూపర్ యాప్ గా మారబోతున్న .. మస్క్ X యాప్.. ఇక అన్నీ దాని నుంచేనట
-
Phone Farming: ఫోన్ ఫార్మింగ్ అంటే ఏంటో మీకు తెలుసా?
-
Starlink : జియోలాంటి ప్లాన్స్‌తో స్టార్‌లింక్ ఎంట్రీ..ఇంటర్నెట్ మార్కెట్‌లో మస్క్ సంచలనం!
-
Jio vs Airtel Recharge Plans: రూ.50 తేడాతో భారీ ప్రయోజనాలు: జియో 299 vs ఎయిర్‌టెల్ 349 ప్లాన్ ఏది బెస్ట్ ?