Starlink : భారతదేశంలో ఏ మారుమూలన ఉన్నా.. సిగ్నల్స్ లేకున్నా హై స్పీడ్ ఇంటర్నెట్

Starlink : ఇకపై భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. బిలియనీర్ ఎలాన్ మస్క్ కు చెందిన శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ స్టార్‌లింక్ భారతదేశంలో ఇంటర్నెట్ సేవలు అందించడానికి మార్గం సుగమం అయ్యింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్‌లింక్, తన జెన్1 లో ఎర్త్ ఆర్బిట్ (LEO) శాటిలైట్ ద్వారా ఐదేళ్ల పాటు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అనుమతులు పొందింది.
ఎలాన్ మస్క్ డ్రీమ్ ప్రాజెక్ట్ స్టార్‌లింక్‌కు భారతదేశంలో కీలక అనుమతులు లభించాయి. దేశవ్యాప్తంగా ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఇది చివరి ఆమోదం పొందినట్టయింది. బుధవారం దేశ అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ & ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) నుండి ఈ అనుమతి లభించింది. జెన్ 1 లో-ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహాలను ఉపయోగించి ఇంటర్నెట్ సేవలు అందించడానికి మార్గం సుగమమైంది. దేశంలో చవకైన ఇంటర్నెట్ సేవలు, వాణిజ్య ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఉన్న అన్ని రెగ్యులేటరీ అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడానికి దోహదపడుతుంది.
Read Also:YouWeCan : సచిన్, కోహ్లీ, పీటర్సన్.. యువీ ఛారిటీ కోసం తరలివచ్చిన క్రికెట్ దిగ్గజాలు!
భారతదేశంలో ఇంకా చాలా గ్రామీణ, రుమూల ప్రాంతాలకు నమ్మకమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో లేదు. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వేయడం కష్టంగా ఉండే ఈ ప్రాంతాలకు శాటిలైట్ ఇంటర్నెట్ ఒక అద్భుతమైన పరిష్కారం. స్టార్‌లింక్ సేవలు అందుబాటులోకి వస్తే, వ్యవసాయం, విద్య, వైద్యం, వ్యాపారం వంటి రంగాలలో ఈ ప్రాంతాల ప్రజలు డిజిటల్ అవకాశాలను మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు. ఇది డిజిటల్ ఇండియా లక్ష్యానికి మరింత బలాన్ని చేకూర్చనుంది. ఉపగ్రహం నుండి నేరుగా ఇంటర్నెట్ లభించడం వల్ల అధిక వేగం సాధ్యమవుతుంది. ఇది దేశంలో డిజిటల్ రంగ అభివృద్ధిని మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది.
స్టార్‌లింక్ అనేది స్పేస్ఎక్స్ (SpaceX) కు చెందిన ఒక శాటిలైట్ ఇంటర్నెట్ కాన్స్టెలేషన్. స్టార్‌లింక్ జెన్ 1 అనేది 4,408 ఉపగ్రహాల సమూహం. ఇవి భూమికి 540 నుండి 570 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో తిరుగుతాయి. ఈ తక్కువ ఎత్తులో ఉండే ఉపగ్రహాలు సాంప్రదాయ ఉపగ్రహాల కంటే మెరుగైన ఇంటర్నెట్ వేగాన్ని, తక్కువ లాగ్‌ను అందిస్తాయి. ప్రస్తుతం, స్టార్‌లింక్ మొత్తం 6,750కి పైగా ఉపగ్రహాలను కలిగి ఉంది. స్టార్‌లింక్ సేవలు ఇప్పటికే మంగోలియా, జపాన్, ఫిలిప్పీన్స్, మలేషియా, ఇండోనేషియా, జోర్డాన్, యెమెన్, అజర్బైజాన్ మరియు శ్రీలంక వంటి అనేక దేశాలలో అందుబాటులో ఉన్నాయి.
Read Also:Lizard in Samosa: సమోసాలో బల్లి.. పిల్లలకు వాంతులు.. షాప్ మూసేసి యజమాని పరార్
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
Tesla Enters India: భారత్ లోకి అడుగుపెట్టిన టెస్లా.. ధర, ఫీచర్లు ఇవే
-
Hair cutting price: ప్రపంచంలోనే హెయిర్ కట్ కి అత్యధికంగా ఛార్జ్ చేస్తున్న దేశాలేవో తెలుసా?
-
Fake Wedding trend: తినంత తిండి.. తాగేంత మందు.. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్. తో ఎంజాయ్ చేయండి
-
Cab Charges : ప్రయాణికులకు షాక్.. భారీగా పెరగనున్న క్యాబ్ ఛార్జీలు.. కొత్త నిబంధనలు ఇవే!
-
Team india captain Subhaman gill: డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించిన గిల్.. ఒకే మ్యాచ్‌లో ఇన్ని రికార్డులా!