Lizard in Samosa: సమోసాలో బల్లి.. పిల్లలకు వాంతులు.. షాప్ మూసేసి యజమాని పరార్

Lizard in Samosa: రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్లో జరిగిన ఒక సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక స్వీట్ షాపులో స్కూలు పిల్లలు కొనుక్కున్న సమోసాలో బల్లి కనిపించడంతో ఆహార భద్రత పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మోయినాబాద్‌లోని ఒక ప్రసిద్ధ స్వీట్ షాపులో ఇద్దరు పిల్లలు సమోసాలు కొనుక్కున్నారు. ఒక సమోసా తిన్న తర్వాత, రెండో సమోసాను కట్ చేయబోతుండగా, అందులో బల్లి కనిపించింది. ఇది చూసిన వెంటనే పిల్లలు షాక్‌కు గురయ్యారు. కొద్దిసేపటికే ఆ ఇద్దరు పిల్లలు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. అది గమనించిన తల్లిదండ్రులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన షాపు యజమాని వెంటనే షాపును మూసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Rajinikanth : హీరోయిన్లతో రొమాన్స్ చేయను.. రజనీకాంత్ సంచలన నిర్ణయం
బయట ఆహారం తినాలంటేనే భయమేస్తుందని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి ఫుల్ అమ్మే షాపుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. రైల్వే స్టేషన్లో దొరికే ఆహారం ఏ మాత్రం నాణ్యతగా ఉండదని, తినలేకపోతున్నామని కొందరు నెటిజన్లు రాశారు. ‘మంచి మాటలు ఎవరు వింటారు.. సమోసాలు, చిప్స్ లాంటి ఉడికించని ఆహార పదార్థాలు తినొద్దని చెప్పినా వినకుండా తింటున్నారు’ అని మరికొందరు వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. ఈ ఘటన ఆహార పరిశ్రమలో పరిశుభ్రత ప్రమాణాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
Read Also : Jofra Archer : 1596 రోజుల తర్వాత టీంలోకి తిరిగొచ్చిన స్టార్ ప్లేయర్.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు
ఈ విషయం తెలిసిన స్థానికులు ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేశారు. సమోసాలో బల్లి బయటపడటంతో ఆహార భద్రత, పరిశుభ్రతపై స్థానికంగా చర్చలు మొదలయ్యాయి. అధికారులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, ఆ షాపు యజమానిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పరిశుభ్రత పాటించని దుకాణాల మీద కఠిన చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.