Jofra Archer : 1596 రోజుల తర్వాత టీంలోకి తిరిగొచ్చిన స్టార్ ప్లేయర్.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు

Jofra Archer : ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో టీమిండియా చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టు జూలై 10 నుంచి లార్డ్స్‌లో జరిగే మూడో టెస్ట్ మ్యాచ్‌కు గట్టిగా ప్రిపేర్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం ఈ మ్యాచ్ కోసం 16 మంది సభ్యుల జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, ఇప్పుడు మూడో టెస్ట్ మ్యాచ్‌కు తమ ఆడే ప్లేయింగ్ ఎలెవన్ ప్రకటించింది. ఊహించినట్లుగానే జట్టులో ఒక మార్పు చేశారు. నాలుగేళ్ల తర్వాత స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ టెస్ట్ క్రికెట్లోకి తిరిగి వస్తున్నాడు.
టెస్ట్ సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు ఒక రోజు ముందు జూలై 9న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు లార్డ్స్‌లో జరిగే చారిత్రాత్మక మ్యాచ్ కోసం తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో ఓటమి తర్వాత ఇంగ్లాండ్ జట్టులో మార్పులు ఖాయమని వార్తలు వచ్చాయి. అయితే, ఏ ఆటగాడిని పక్కన పెట్టి ఎవరికి అవకాశం ఇస్తారో తెలుసుకోవాలని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆర్చర్‌తో పాటు, మరో పేసర్ గస్ అట్కిన్సన్ ను కూడా మూడో టెస్ట్ మ్యాచ్ కోసం జట్టులో సెలక్ట్ చేశారు. కానీ, అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన సెలక్షన్ కమిటీ ఆర్చర్‌కు అవకాశం ఇచ్చింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్వయంగా ఈ విషయాన్ని ట్వీట్ చేసింది.
Read Also:Shubman Gill : ఒకే టెస్ట్‌తో 15 స్థానాలు ఎగబాకిన శుభ్‌మన్ గిల్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సంచలనం
కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెకల్లమ్ జోడి బౌలింగ్ విభాగం బాధ్యతను ఆర్చర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. దీనితో ఆర్చర్ దాదాపు 4 సంవత్సరాల 5 నెలల తర్వాత(1596 రోజుల) టెస్ట్ క్రికెట్‌కు తిరిగి వస్తున్నాడు. ఆర్చర్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2021 ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌లో ఇదే టీమిండియాపై ఆడాడు. అయితే, ఆర్చర్ స్థానంలో లార్డ్స్ టెస్ట్ నుంచి బయటపడిన మరో పేసర్, ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు పడగొట్టాడు. అయినా కూడా అతన్ని జట్టు నుంచి తప్పించడం ఆశ్చర్యం కలిగించింది. లార్డ్స్ టెస్ట్ నుంచి యువ పేసర్ జోష్ టంగ్‌ను పక్కన పెట్టాలని ఇంగ్లాండ్ జట్టు నిర్ణయించింది. ఈ సిరీస్‌లో టంగ్ ఇప్పటివరకు అత్యధికంగా 11 వికెట్లు తీశాడు. అయితే, అతని లైన్-లెంగ్త్‌పై కంట్రోల్ లేకపోవడం వల్ల రెండు మ్యాచ్‌లలో చాలా పరుగులు ఇచ్చాడు. అందుకే అతన్ని జట్టు నుంచి తొలగించారు.
లార్డ్స్ టెస్ట్‌కు ఇంగ్లాండ్ ప్లేయింగ్ ఎలెవన్:
బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ డకెట్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్ , జామీ స్మిత్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రిడాన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, షోయెబ్ బషీర్,
Read Also:SSMB29 : మహేష్ బాబు సినిమాకు కొత్త చిక్కులు.. షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న రాజమౌళి
-
Lords Test : లార్డ్స్ టెస్టులో కష్టాల్లో టీమిండియా.. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన శుభమన్ గిల్
-
IND vs ENG : ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేసి ఇంగ్లాండ్ వెన్ను విరిచిన తెలుగు కుర్రాడు
-
Pat Cummins : శుభ్‌మన్ గిల్ సేనను చూసి కమ్మిన్స్ భయపడ్డారా? ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Team India : మూడో టెస్టులో బూమ్రా ఆడడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్
-
Jasprit Bumrah : రెండో టెస్టుకు ముందు టీం ఇండియాకు గుడ్ న్యూస్.. బూమ్రా వచ్చేశాడు
-
Asia Cup 2025 : మరో క్రికెట్ సమరానికి ముహూర్తం ఫిక్స్.. క్రికెట్ అభిమానులకు పండుగే