Shubman Gill : ఒకే టెస్ట్‌తో 15 స్థానాలు ఎగబాకిన శుభ్‌మన్ గిల్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సంచలనం

Shubman Gill : ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్‌లో 400 కంటే ఎక్కువ పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్లారు. కొత్త ర్యాంకింగ్స్ లో గిల్ ఏకంగా 15మంది బ్యాట్స్మెన్లను వెనక్కి నెట్టి ఆరో స్థానానికి చేరుకున్నాడు. వాస్తవానికి ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ తర్వాత 21వ స్థానంలో ఉన్న శుభ్‌మన్ గిల్, రెండో టెస్ట్ ముగిసిన తర్వాత ఆరో స్థానానికి చేరుకోవడం విశేషం. మరోవైపు, ఇంగ్లాండ్ జట్టు వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ నంబర్ 1 స్థానాన్ని దక్కించుకోగా, జో రూట్ నంబర్ 1 నుండి నంబర్ 2 స్థానానికి పడిపోయాడు.
శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చినప్పుడు చాలా మంది విశ్లేషకులు అతని ఆట తీరును ప్రశ్నించారు. అయితే, మొదటి టెస్ట్‌లోనే గిల్ సెంచరీ చేసి ఆ విమర్శకుల నోరు మూయించాడు. ఆ టెస్ట్‌లో భారత్ ఓడిపోయినప్పటికీ, గిల్ ప్రదర్శన ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో గిల్ డబుల్ సెంచరీ బాదాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో అదరగొట్టాడు. ఈ విధంగా ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో మొత్తం 430 పరుగులు సాధించాడు. ఈ అద్భుత ప్రదర్శన ఆధారంగా 807 రేటింగ్ పాయింట్లు సాధించిన శుభ్‌మన్ గిల్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో నిలిచాడు.
Read Also:SSMB29 : మహేష్ బాబు సినిమాకు కొత్త చిక్కులు.. షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న రాజమౌళి
అగ్రస్థానానికి చేరుకున్న హ్యారీ బ్రూక్ మొదటి టెస్ట్‌లో 99 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. దీంతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు, రెండు టెస్ట్‌లలోనూ విఫలమైన జో రూట్, నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకోలేక నంబర్ 2 స్థానానికి పడిపోయాడు. ఇతర బ్యాట్స్మెన్ల విషయానికి వస్తే, న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో ఉన్నాడు. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ నాలుగో స్థానంలో, ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్ ఐదో స్థానంలో ఉన్నారు. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా ఏడో స్థానంలో ఉండగా, ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన రిషబ్ పంత్ ఒక స్థానం దిగజారి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు.
ఇంగ్లాండ్ ఆటగాడు జామీ స్మిత్ ఏకంగా 16 మంది బ్యాట్స్మెన్లను దాటి టాప్ 10లోకి ప్రవేశించాడు. ఇప్పుడు లార్డ్స్ టెస్ట్ 10న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో పరుగులు చేసే ఆటగాళ్లు మళ్ళీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 6వ స్థానంలో ఉన్న గిల్, టెస్ట్ సిరీస్ ముగిసే సమయానికి ఏ స్థానానికి వస్తాడో చూడాలి.
Read Also:Manjummel Boys : రూ.250కోట్ల బ్లాక్ బస్టర్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ హీరో, నిర్మాత సౌబిన్ అరెస్టు