Wheat Flour : ఇంట్లో గోధుమ పిండి ఇలా వాడుతున్నారా.. మీరు అనారోగ్యం బారిన పడినట్లే

Wheat Flour : గోధుమపిండి లేని ఇల్లు ఉండదు. రోజూ తినే చపాతీలు, రోటీలు, పూరీలు అన్నీ గోధుమపిండితోనే చేస్తాం. చాలా మంది గోధుమపిండి ఆరోగ్యానికి మంచిదని అనుకుంటారు. ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్లు ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువగా చపాతీలు తింటుంటారు. కానీ, ఒక్కోసారి రోజూ వాడే గోధుమ పిండి ఆరోగ్యానికి హానికరం అవుతుంది. మీరు ఇంట్లో ఎక్కువ కాలం నిల్వ ఉంచి వాడే గోధుమపిండి నెమ్మదిగా విషంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల అరుగుదల సమస్యలు, అలర్జీలు లేదా పొట్టకు సంబంధించిన జబ్బులు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన పిండిని విషంగా మార్చే కొన్ని తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాత గోధుమలను వాడటం
చాలా మంది ఒకేసారి నెలకు లేదా సంవత్సరానికి సరిపడా గోధుమలను కొని తీరిక ఉన్నప్పుడు పిండి పట్టించుకుంటారు. కానీ, ఎక్కువ కాలం నిల్వ ఉంచిన గోధుమలు తాజాగా ఉండవు. వాటిలో పోషకాలు కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా, గోధుమలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే పురుగులు, ఫంగస్, తేమ పట్టే సమస్యలు వస్తాయి. ఇలాంటి పిండిని వాడితే శరీరానికి సమస్యలు వస్తాయి. అందుకే, ఎప్పుడూ తాజా శుభ్రమైన గోధుమలను వాడాలి.
Read Also : Smartphone : ఫోన్లో ఎవరు ఏం చూశారో మొత్తం బయటపడుతుంది.. ఈ ట్రిక్ వెంటనే ట్రై చేయండి
నెలల తరబడి నిల్వ చేయొద్దు
చాలా మంది ఒకేసారి చాలా పిండిని పట్టించుకుని, నెలల తరబడి వాడతారు. ఈ పద్ధతి తప్పు. గోధుమపిండి గాలిలోని తేమను పీల్చుకుంటుంది. దీనివల్ల అది త్వరగా పాడైపోతుంది. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన పిండిలో బ్యాక్టీరియా చేరుతుంది. పోషకాలు తగ్గిపోతాయి. అందుకే, పిండిని ప్రతి 15-20 రోజులకోసారి తాజాగా పట్టించుకుని, గాలి చొరబడని డబ్బాలో పొడి ప్రదేశంలో ఉంచాలి.
కల్తీ పిండితో ప్రమాదం
కొన్నిసార్లు షాపుల్లో తక్కువ ధరలో పిండి దొరుకుతుంది. అయితే, ఈ షాపుల్లో దొరికే గోధుమపిండిలో కల్తీ ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు సున్నం పొడి, మైదా లేదా స్టార్చ్ లాంటివి కలుపుతారు. ఇలాంటి కల్తీ పిండిని తింటే అరుగుదల వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. గ్యాస్, ఎసిడిటీ, అలర్జీలు లాంటి సమస్యలు వస్తాయి. అందుకే, ఎప్పుడూ మంచి బ్రాండ్ పిండిని మాత్రమే కొనాలి.
Read Also :Kubera : ఒకచోట హిట్.. ఇంకోచోట ఫ్లాప్.. ‘కుబేర’ కలెక్షన్లపై అంతుచిక్కని మిస్టరీ!
ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేయొద్దు
చాలా ఇళ్లలో పిండిని ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేస్తుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ప్లాస్టిక్ వేడికి లేదా తేమ తగిలినప్పుడు, అది విష రసాయనాలను విడుదల చేస్తుంది. అవి పిండిలో కలిసిపోతాయి. ఇది శరీరంలో విష పదార్థాల స్థాయిని పెంచుతుంది. కాబట్టి, గోధుమపిండిని సురక్షితంగా ఉంచడానికి స్టీల్ లేదా గ్లాస్ డబ్బాల్లో నిల్వ చేయడం చాలా మంచిది.
-
Kidneys : అందంగా ఉండాలని అతిగా నీళ్లు తాగుతున్నారా ? తస్మాత్ జాగ్రత్త
-
Daily Bread : రోజూ బ్రెడ్ తింటున్నారా.. ఈ మెదడు వ్యాధి రావచ్చట.. తస్మాత్ జాగ్రత్త
-
Pressure Cooker : పొరపాటున కూడా ప్రెషర్ కుక్కర్లో ఈ 5 వస్తువులను వండకండి
-
Tattoo: ఈ ఐదు చోట్ల పొరపాటున కూడా టాటూ వేయించుకోకండి.. లేదంటే అంతే సంగతులు!
-
Health Tips : రోజుకు ఒకసారి అన్నం తింటే శరీరంలో ఈ మార్పులు పక్కా..