Tattoo: ఈ ఐదు చోట్ల పొరపాటున కూడా టాటూ వేయించుకోకండి.. లేదంటే అంతే సంగతులు!
Tattoo: చాలామంది శరీరంపై ఎక్కడంటే అక్కడ టాటూలు వేయించుకుంటారు. మెడ మీద, నడుము మీద, చేతుల మీద ఇలా ఎక్కడ పడితే అక్కడ వేయించుకుంటారు.

Tattoo: ఈ రోజుల్లో టాటూ వేయించుకోవడం ఒక ఫ్యాషన్ ట్రెండ్‌గా మారిపోయింది. కుర్రాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు తమ వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా చూపించుకోవడానికి టాటూలు వేయించుకుంటున్నారు. కొందరేమో తమకిష్టమైన కొటేషన్లు వేయించుకుంటే.. మరికొందరు మాత్రమ తమకు ఇష్టమైన వాళ్ల పేర్లను టాటూలుగా వేయించుకుంటున్నారు. టాటూల ద్వారా తమ ఫీలింగ్స్‌ను బయటపెడుతూ, తమ శరీరాన్ని ఒక ఆర్ట్‌వర్క్‌లా చూపిస్తారు. చాలామంది శరీరంపై ఎక్కడంటే అక్కడ టాటూలు వేయించుకుంటారు. మెడ మీద, నడుము మీద, చేతుల మీద ఇలా ఎక్కడ పడితే అక్కడ వేయించుకుంటారు. కానీ కొన్ని ప్రత్యేకమైన చోట్ల టాటూ వేయించుకోవడం నొప్పి కలిగించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రమాదకరంగా మారొచ్చు.
ఎవరైనా టాటూ వేయించుకునే ముందు శరీరంపై ఏయే ప్రదేశాలు సున్నితమైనవో, ప్రమాదకరమైనవో తెలుసుకోవాలి. అలాంటి ప్రదేశాల్లో టాటూ వేయించుకుంటే నరాలు దెబ్బతినడం, ఇన్ఫెక్షన్ రావడం లేదా స్కిన్ అలర్జీ లాంటి సీరియస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆర్టికల్‌లో పొరపాటున కూడా టాటూ వేయించుకోకూడని 5 ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
1. చేతులపై టాటూ
చేతులు మన రోజువారీ పనుల్లో ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇక్కడి చర్మం చాలా పలుచగా ఉంటుంది. తరచూ కడగడం వల్ల, ఎండ తగలడం వల్ల, రాపిడి వల్ల టాటూ తొందరగా రంగు వెలిసిపోతుంది. అంతేకాదు, చేతులపై టాటూ వేయించుకోవడం చాలా నొప్పిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎముకలు చర్మానికి చాలా దగ్గరగా ఉంటాయి.
2. బైసెప్స్ కింద భాగం, చంక
ఈ భాగం శరీరం అత్యంత సున్నితమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ టాటూ వేయించుకునేటప్పుడు చాలా ఎక్కువ నొప్పి వస్తుంది. అంతేకాకుండా, చంకలో చెమట ఎక్కువగా వస్తుంది. దీనివల్ల టాటూ తొందరగా పాడైపోయే ప్రమాదం ఉంది. అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.
3. మోచేతిపై టాటూ
మోచేతిపై చర్మం మందంగా, గట్టిగా ఉంటుంది. కానీ అందులో తేమ తక్కువగా ఉంటుంది. దీనివల్ల టాటూ ఇంక్ సరిగ్గా పట్టదు, తరచుగా టచ్-అప్ చేయాల్సి వస్తుంది. అలాగే, టాటూ వేయించుకునేటప్పుడు మోచేతిపై చాలా ఎక్కువ నొప్పి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చర్మం కింద నేరుగా ఎముక ఉంటుంది.
4. అరికాళ్లపై టాటూ
అరికాళ్లు నిరంతరం నేలతో కాంటాక్ట్‌లో ఉంటుంది. ఇక్కడి చర్మం మందంగా ఉంటుంది. చెమట కూడా ఎక్కువగా వస్తుంది. దీనివల్ల ఇంక్ తొందరగా వ్యాప్తి చెందవచ్చు లేదా టాటూ మసకబారవచ్చు. నడవడం వల్ల ఇక్కడ టాటూ వేయించుకోవడం ఎక్కువ కాలం మన్నికగా ఉండదు. చాలా అసౌకర్యంగా కూడా ఉంటుంది.
5. అరచేతులపై టాటూ
అరచేతుల చర్మం నిరంతరం ఏదో ఒక పని చేయడం వల్ల ఎప్పుడూ రాపిడికి గురవుతూ ఉంటుంది. అంతేకాకుండా, అక్కడి చర్మం చాలా త్వరగా పునరుత్పత్తి చెందుతుంది. కాబట్టి అరచేతిపై టాటూ చాలా తొందరగా చెరిగిపోతుంది. దీనితో పాటు ఈ భాగంలో టాటూ వేయించుకునే ప్రక్రియ చాలా బాధాకరంగా ఉంటుంది. అది నయం కావడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది.
-
Wheat Flour : ఇంట్లో గోధుమ పిండి ఇలా వాడుతున్నారా.. మీరు అనారోగ్యం బారిన పడినట్లే
-
Kidneys : అందంగా ఉండాలని అతిగా నీళ్లు తాగుతున్నారా ? తస్మాత్ జాగ్రత్త
-
Kidney Problems : రాత్రిపూట పదే పదే మూత్రానికి వెళ్తున్నారా? అయితే ఈ వ్యాధి సంకేతాలు కావొచ్చు
-
Daily Bread : రోజూ బ్రెడ్ తింటున్నారా.. ఈ మెదడు వ్యాధి రావచ్చట.. తస్మాత్ జాగ్రత్త
-
Isn’t it the real ORS: వామ్మో.. ఇది అసలైన ఓఆర్ఎస్ కాదా? మరేం కొనాలి?
-
Periods coming late: పీరియడ్స్ లేట్ గా వస్తున్నాయా? రక్తస్రావం ఎక్కువ అవుతుందా?