Kidneys : అందంగా ఉండాలని అతిగా నీళ్లు తాగుతున్నారా ? తస్మాత్ జాగ్రత్త

Kidneys : మన శరీరానికి నీళ్లు చాలా ముఖ్యం అని అందరికీ తెలుసు. శరీరంలో విష పదార్థాలను బయటికి పంపించడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ఇంకా ఎనర్జీగా ఉండటానికి నీళ్లు చాలా అవసరం. మామూలుగా ఒక పెద్ద మనిషి రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తారు. కానీ, కొందరు మరీ ఆరోగ్యంగా కనిపించాలనో, లేదా డీహైడ్రేషన్ రాకుండా ఉండాలనో అవసరం కంటే ఎక్కువ నీళ్లు తాగేస్తుంటారు. ఇది మన శరీరానికి, ముఖ్యంగా కిడ్నీలకు చాలా నష్టం కలిగించవచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అసలు ఎక్కువ నీళ్లు తాగడం వల్ల కిడ్నీలకు ఎలా నష్టం జరుగుతుంది? దాని లక్షణాలు ఏంటి? అలా జరగకుండా ఎలా చూసుకోవాలి? తెలుసుకుందాం.
మనం అవసరం కంటే ఎక్కువ నీళ్లు తాగినప్పుడు, మన కిడ్నీలు ఆ ఎక్కువ నీటిని బయటికి పంపించడానికి మామూలు కంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగి, వాటి పనితీరు నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల రక్తంలో సోడియం స్థాయిలు చాలా తగ్గిపోవచ్చు. దీన్ని హైపోనెట్రేమియా అనే పరిస్థితి అంటారు.
Read Also:Anchor Swetha : తెలుగు యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య.. గుండెలు పిండేస్తున్న ఆఖరి పోస్ట్
ఈ హైపోనెట్రేమియా వల్ల శరీరంలోని కణాలు ఉబ్బిపోవడం మొదలవుతాయి. ముఖ్యంగా మెదడు, కిడ్నీల కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలా ఎక్కువ కాలం జరిగితే, కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గిపోతుంది. చివరికి కిడ్నీలు పనిచేయడం పూర్తిగా ఆగిపోయి, కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అయ్యే ప్రమాదం ఉంది.
ఎక్కువ నీళ్లు తాగడం వల్ల మొదటగా ఎక్కువసార్లు మూత్రం వస్తూ ఉంటుంది. ముఖ్యంగా రాత్రిపూట చాలాసార్లు టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చి, నిద్ర డిస్టర్బ్ అవుతుంది. చేతులు, కాళ్లలో వాపులు, తరచుగా అలసిపోవడం వంటివి ఉంటాయి. తల తిరుగుతున్నట్లు అనిపించడం, వికారం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు మానసిక గందరగోళం కూడా కలగవచ్చు. రక్తంలో సోడియం స్థాయిలు మరీ ఎక్కువగా పడిపోతే, మనిషి అపస్మారక స్థితిలోకి కూడా వెళ్లవచ్చు. మూత్రం రంగు నీళ్లలాగే ఉంటే, అది శరీరంలో అవసరం కంటే ఎక్కువ నీళ్లు ఉన్నాయని సూచిస్తుంది. ఇలా ఎక్కువ కాలం జరిగితే, కిడ్నీల పనితీరు బలహీనపడి, శరీరంలోని విష పదార్థాలు పూర్తిగా బయటికి వెళ్ళలేక, చాలా రకాల తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
Read Also:The Family Man : ఫ్యామిలీ మ్యాన్ 3 టీజర్ వచ్చేసింది.. మాస్టర్ పీస్ అంటున్న మనోజ్ ఫ్యాన్స్
ఎక్కువ నీళ్లు తాగి ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఉండాలంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. దాహం వేస్తేనే నీళ్లు తాగాలి. బలవంతంగా ఎక్కువ నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. ఒక రోజులో 7-8 గ్లాసుల నీళ్లు సరిపోతుంది. వ్యాయామం చేసినా, లేదా బాగా చెమట పట్టినా, కేవలం నీళ్లు తాగితే సరిపోదు. ఆ సమయంలో శరీరం నుంచి బయటికి పోయిన ఎలక్ట్రోలైట్స్ ను తిరిగి పొందడానికి కొబ్బరి నీళ్లు లేదా ఓఆర్ఎస్ వంటివి తాగడం మంచిది. మీకు తరచుగా అలసట, లేదా పదేపదే మూత్రం వస్తున్నట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలిసి సలహా తీసుకోండి.