The Family Man : ఫ్యామిలీ మ్యాన్ 3 టీజర్ వచ్చేసింది.. మాస్టర్ పీస్ అంటున్న మనోజ్ ఫ్యాన్స్

The Family Man : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మూడో సీజన్ టీజర్ ఎట్టకేలకు వచ్చేసింది. దీనితో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనోజ్ బాజ్‌పాయ్ లీడ్ రోల్లో, పాత టీమ్ అంతా మళ్లీ తిరిగొచ్చారు. టీజర్ చూస్తుంటే ఇంకోసారి థ్రిల్ రైడ్ పక్కా అనిపిస్తోంది. ఈసారి విలన్‌గా జైదీప్ అహ్లావత్ చేరడం విశేషం. ఈ యాక్షన్-ప్యాక్డ్ టీజర్‌కు ఆన్లైన్లో ఎక్కడలేని ప్రశంసలు దక్కుతున్నాయి. తిరిగి వచ్చిన పాత్రల చార్మ్, సిరీస్‌కు పేరు తీసుకొచ్చిన హై-క్వాలిటీ స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి.
టీజర్ వచ్చిన కాసేపట్లోనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు కామెంట్స్ అయితే నవ్వు తెప్పిస్తున్నాయి. ఒక ఫ్యాన్ కామెంట్ చేస్తూ.. ఎంతగానో ఎదురుచూస్తున్న సిరీస్ ఇది. మనోజ్ సర్, తాను లైఫ్ అండ్ రిలేషన్షిప్ కౌన్సెలర్‌ను అని చెప్పినప్పుడు ప్రియమణి మేడమ్ లుక్ అదిరిపోయింది” అన్నాడు. నిజమే, శ్రీకాంత్ తివారి భార్యగా ప్రియమణి తన సహజమైన నటనతో ఎప్పటిలాగే ఫ్యాన్స్ ఫేవరెట్‌గా ఉంది.
Read Also:Viral : ఫ్యాషన్ కి పరాకాష్ట.. కారు దిగగానే గాలికి లేచిన డ్రస్సు..కవర్ చేసుకున్న ఖుషీ
మరో నెటిజన్.. “అవును, జైదీప్ అహ్లావత్ విలనిజం చూసేందుకు ఎక్సైటెడ్‌గా ఉన్నాను!” అని రాశాడు. జైదీప్ అహ్లావత్ అంటేనే ఇంటెన్స్ పర్ఫార్మెన్స్కు పేరు. సీజన్ రాకముందే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ అంటేనే జాతీయ భద్రత, ఎమోషనల్ డ్రామా, ఇంకా ఆ డార్క్ హ్యూమర్ కలగలిసి ఉంటాయి. అందుకే ఇది ఇండియన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
ఈ టీజర్ చూస్తుంటే ఇందులో ఒక ఉత్కంఠభరితమైన పొలిటికల్ ట్విస్ట్ ఉన్నట్లు అనిపిస్తోంది. కోవిడ్-19 కాలంలో చైనా మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలపై దాడులు చేయడానికి కోవిడ్‌ను వాడుకుందని టీజర్ సూచిస్తోంది. ఇది కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో #FamilyMan3 ట్రెండింగ్‌లో నిలిచింది.
Read Also:Fancy Number : ఒక్క నంబర్ కు లక్షల ఖర్చు.. ఖైరతాబాద్ ఆర్టీఏకు ఒక్క రోజే రూ.42లక్షల ఆదాయం
మనోజ్ బాజ్‌పాయ్ మళ్లీ శ్రీకాంత్ తివారిగా తిరిగి వస్తున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ప్రమాదకరమైన జాబ్‌ను, తన ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసే అతని క్యారెక్టర్ ఎంతో మందికి కనెక్ట్ అవుతుంది. అతని పాత్ర పడే కష్టాలు, చురుకైన తెలివి తేటలు అతన్ని ఇండియన్ వెబ్ సిరీస్ చరిత్రలోనే అత్యంత ఇష్టమైన పాత్రలలో ఒకటిగా మార్చాయి. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 క్రియేటర్స్ రాజ్, డీకేకు మరో పెద్ద విజయం కావడం ఖాయం అనిపిస్తోంది.