Fancy Number : ఒక్క నంబర్ కు లక్షల ఖర్చు.. ఖైరతాబాద్ ఆర్టీఏకు ఒక్క రోజే రూ.42లక్షల ఆదాయం

Fancy Number : ఈ రోజుల్లో ఏదైనా కొత్త బండి కొన్నా, కారు కొన్నా, రిజిస్ట్రేషన్ చేయిస్తాం కదా. అప్పుడు చాలా మందికి ఒక కోరిక ఉంటుంది.. నా బండికి ఫ్యాన్సీ నంబర్ ఉంటే బాగుటుంది కాదా అని. కొందరు ఏ నంబర్ వచ్చినా పర్లేదంటారు. కానీ మరికొందరు మాత్రం, తమకు నచ్చిన నంబర్ కోసం లక్షలకు లక్షలు ఖర్చు చేయడానికి కూడా వెనకాడడం లేదు. ఈ ట్రెండ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం కళ్లు చెదిరేంత ఆదాయం వస్తోంది. తాజాగా, ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో జరిగిన ఒక వేలంలో ఫ్యాన్సీ నంబర్లు రికార్డు ధర పలికాయంట.
అసలు ఈ ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్ ఎందుకు?
చిన్న బండి కొన్నా, పెద్ద కారు కొన్నా, ఫ్యాన్సీ నంబర్ ఉండాల్సిందే అని చాలా మంది చూసుకుంటున్నారు. ముఖ్యంగా వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, ఇంకా తమ బండి ప్రత్యేకంగా కనిపించాలని కోరుకునే వాళ్ళు తమకు బాగా నచ్చిన నంబర్ కోసం లక్షలు పెడుతున్నారు. అసలు వీళ్లకి ఈ ఫ్యాన్సీ నంబర్లు ఎందుకు అంత ముఖ్యమో తెలుసుకుందాం.
కొందరు తమ పుట్టిన తేదీ, జ్యోతిష్యం, న్యూమరాలజీ ప్రకారం కొన్ని నంబర్లను ‘లక్కీ’ అని నమ్ముతారు. ఉదాహరణకు, ‘0009’, ‘1111’, ‘3333’ వంటి నంబర్ల కోసం పోటీ పడతారు. అలాగే కొందరు ఫ్యాన్సీ నంబర్ అనేది తమ లెవల్, స్టేటస్ చూపించుకోవడానికి ఒక సింబల్ గా భావిస్తారు. లక్షలు పెట్టి నంబర్ కొన్నారంటే వాళ్ళు ఎంత రిచ్ అనేది బయటి ప్రపంచానికి తెలుస్తుంది కదా.
#Hyderababd—#Khairatabad RTA rakes in Rs 42 lakh from fancy number auction
Total collection today: Rs 42.1 lakh
Top bids:
🔹 TG09F9999 – Rs 12 L (Keystone Infra)
🔹 TG09G0001 – Rs 5.66 L (Nspira Mgmt)
🔹 TG09G0009 – Rs 5.25 L (Sreenivasa Constructions)
🔹 TG09G0006 –… pic.twitter.com/xLLR1lqMVi
— NewsMeter (@NewsMeter_In) June 27, 2025
Read Also:Kannappa Movie : కన్నప్ప సినిమా చూసి కేసు పెడతామంటున్న ప్రభాస్ ఫ్యాన్స్
కొన్ని నంబర్లు (ఉదా: ‘9999’, ‘0001’) సులభంగా గుర్తుంటాయి. తమ బిజినెస్ నంబర్, ఫోన్ నంబర్ లాంటివి ఉంటే బాగా ప్రమోషన్ అవుతుందని కూడా కొందరు అనుకుంటారు. కొందరికి తమ జీవితంలో ముఖ్యమైన తేదీలు, లేదా ఇష్టమైన వ్యక్తుల నంబర్లు, కారుకు వచ్చేలా చూసుకుంటారు.
తాజాగా ఖైరతాబాద్ RTA ఆఫీసులో జరిగిన ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఏకంగా రూ. 42.1 లక్షల ఆదాయం వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.
Read Also:My Bharat : ‘మై భారత్’ పోర్టల్ ఇప్పుడు వాట్సాప్‌లోనే.. ఒక్క ‘హాయ్’తో యువతకు బోలెడు అవకాశాలు!
TG09F9999: ఈ నంబర్ కోసం పోటీపడి, చివరకు కీస్టోన్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఏకంగా రూ. 12 లక్షలు పెట్టి సొంతం చేసుకుంది. ఇది అందరికంటే ఎక్కువ పలికిన నంబర్!
TG09G0001: ఈ నంబర్ కోసం రూ. 5.66 లక్షలు చెల్లించారు.
TG09G0009: దీనిని రూ. 5.25 లక్షలు పెట్టి కొన్నారు.
TG09G0006: ఈ నంబర్ కోసం రూ. 3.92 లక్షలు చెల్లించారు.
ఈ కొన్ని ఫ్యాన్సీ నంబర్ల అమ్మకంతోనే ఒక్క రోజులో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ. 42.1 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం. ప్రజలు తమ కోరికల కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారని దీనిబట్టి అర్థమవుతోంది.