My Bharat : ‘మై భారత్’ పోర్టల్ ఇప్పుడు వాట్సాప్‌లోనే.. ఒక్క ‘హాయ్’తో యువతకు బోలెడు అవకాశాలు!

My Bharat : మన భారత ప్రభుత్వం ఇప్పుడు యువతతో కనెక్ట్ అవ్వడానికి ఒక సరికొత్త దారిని కనిపెట్టింది. యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ‘మై భారత్’ అనే పోర్టల్‌ను నేరుగా వాట్సాప్ చాట్‌బాట్‌తో కలిపేసింది. అంటే, ఇప్పుడు దేశంలో ఏ యువకుడు అయినా సరే ఒక్క ‘హాయ్’ మెసేజ్ పంపించి, కొత్త విషయాలు నేర్చుకోవడం, లీడర్షిప్ వంటి బోలెడు అవకాశాలను అందుకోవచ్చు. ప్రభుత్వ పథకాలు, వాలంటీర్ పనులు లాంటి వాటిల్లో యువతను భాగం చేయడానికి ఇది కీలక అడుగుగా చెప్పొచ్చు.
మరి ఈ కొత్త అవకాశం ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. మీ ఫోన్లో 7289001515 అనే నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ పంపండి. అంతే! మీ ఫోనే ప్రభుత్వ సేవలు, అవకాశాలను అందించే ఒక సులభమైన సాధనంగా మారిపోతుంది. ఈ వాట్సాప్ చాట్‌బాట్ మీతో డిజిటల్‌గా మాట్లాడి, చాలా విషయాల్లో మీకు సాయం చేస్తుంది. సమాజ సేవ చేస్తూ దేశంతో కనెక్ట్ అవ్వడానికి మంచి అవకాశాలు దొరుకుతాయి. మీ గురించి చెప్పే రెజ్యూమె లేదా సీవీని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది ఉద్యోగాల కోసం చూసే వాళ్లకి చాలా ఉపయోగపడుతుంది. మీ కెరీర్ గురించి లేదా ఏదైనా డౌట్ ఉంటే, నిపుణుల నుంచి సలహాలు, సూచనలు పొందడానికి ఇది చక్కటి దారి. లీడర్షిప్ క్వాలిటీలు ఉన్నవారు ఏదైనా సంస్థలో చేరాలనుకుంటే లేదా కొత్త సంస్థను స్టార్ట్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన వివరాలు, అవకాశాలు ఉంటాయి.
Read Also: Sugar Free Drinks : షుగర్-ఫ్రీ డ్రింక్స్ నిజంగా ఆరోగ్యానికే మంచివా? రీసెర్చ్‌లో బయటపడ్డ షాకింగ్ నిజం
అలాగే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, దాన్ని నేరుగా చెప్పి, వెంటనే సొల్యూషన్ పొందవచ్చు. ఇది చాలా సింపుల్‌గా, ఫాస్టుగా జరుగుతుంది. మీకు ఎప్పుడైనా ఏ సాయం కావాలన్నా, ఈ హెల్ప్‌డెస్క్ ఎప్పుడూ మీ సేవలో ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సేవలు అన్నీ మీ వాట్సాప్ ఫోన్లోనే జరుగుతాయి. పైగా మీకు అర్థమయ్యే భాషలో సమాచారం అందిస్తారు.
ముందు ముందు ఇంకేం వస్తాయి?
రాబోయే రోజుల్లో ఈ వాట్సాప్ చాట్బాట్లో ఇంకొన్ని అదిరిపోయే ఫీచర్లు రాబోతున్నాయి. అవేంటంటే యాప్‌లోనే డైరెక్ట్‌గా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు పాల్గొన్న ఈవెంట్స్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయొచ్చు. మీకు వచ్చిన సర్టిఫికెట్లు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను నేరుగా ఫోన్లోనే పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పనులను గుర్తుచేయడం, మీరు చేసిన పనిని ట్రాక్ చేయడం లాంటి ఫీచర్లు ఉంటాయి. ఇంకా ప్రభుత్వ పథకాల గురించి పూర్తి సమాచారం డైరెక్ట్‌గా మీ మొబైల్‌కే వస్తుంది.
Read Also: Virus Alert : వైరస్ అలర్ట్.. చైనా గబ్బిలాల్లో 20 కొత్త వైరస్లు.. మానవాళికి మరో ముప్పు తప్పదా ?
ఈ ‘మై భారత్’ ప్లాట్‌ఫామ్ యూత్ ను కేవలం కనెక్ట్ చేయడమే కాదు.. వారిలో సేవా భావం, వారికి సమాజం పట్ల బాధ్యతలను పెంచుతుంది. అంతేకాదు, వాళ్లని లీడర్షిప్, కెరీర్, సామాజిక సేవ మార్గంలో మరింత పవర్ ఫుల్ గా మారుస్తుంది. ఇక మీదట యువత తమ మొబైల్‌తోనే దేశాభివృద్ధిలో భాగం కావచ్చు. కొత్త అవకాశాలను ఈజీగా అందుకోవచ్చు.
-
Mobile Data : ఇంటర్నెట్ వాడకంలో ఇండియా టాప్.. నెలకు ఒక వ్యక్తి ఎంత డేటా వాడుతున్నాడో తెలుసా?
-
Voter ID Card : ఓటర్లకు గుడ్ న్యూస్.. 15 రోజుల్లోనే ఇంటికే ఓటర్ ఐడీ కార్డు!
-
Driverless Car : త్వరలో ఇండియాలో డ్రైవర్‌లెస్ కార్ల ట్రయల్స్ ప్రారంభం..ప్రభుత్వం భారీ సన్నాహాలు!
-
Job Creation : మేక్ ఇన్ ఇండియా నుంచి డిజిటల్ ఎకానమీ వరకు.. 10ఏళ్లలో 17కోట్ల ఉద్యోగాలు
-
Smart Phone : డిజిటల్ ఇండియా ఎఫెక్ట్.. దాని వినియోగంలో అమెరికాను దాటేసిన భారత్
-
Bharat 6G 2025 : టెలికాం రంగంలో విప్లవం.. 5G కంటే 100 రెట్లు వేగంతో ఇంటర్నెట్!