Bharat 6G 2025 : టెలికాం రంగంలో విప్లవం.. 5G కంటే 100 రెట్లు వేగంతో ఇంటర్నెట్!

Bharat 6G 2025 : భారత్ ప్రస్తుతం 5G తర్వాత 6G వైపు దూసుకుపోతోంది. తాజాగా టెలికాం శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మాసాని BHARAT 6G 2025 కాన్ఫరెన్స్ సందర్భంగా మాట్లాడుతూ.. 111 కంటే ఎక్కువ పరిశోధన ప్రాజెక్ట్‌లకు అనుమతి లభించిందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ల కోసం రూ.300 కోట్ల నిధులు విడుదలయ్యాయని తెలిపారు. అంతేకాదు, 6G పేటెంట్ ఫైల్ చేయడంలో భారత్ ఇప్పుడు టాప్ 6 దేశాలలో ఒకటిగా నిలిచింది.
భారత్‌లో 6G స్పీడ్
చంద్రశేఖర్ పెమ్మాసాని తెలిపిన వివరాల ప్రకారం.. 6G టెక్నాలజీ టెరాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో పనిచేస్తుంది. సెకనుకు 1 టెరాబిట్ వరకు వేగాన్ని చేరుకోగలదు. అంటే 5Gతో పోలిస్తే 6G వేగం 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
Read Also:Viral News: హిమాచల్‌లో 60 కోట్ల ఏళ్ల నాటి ‘నిధి’.. శాస్త్రవేత్తల సంచలన ప్రకటన!
6G వేగం 5G కంటే ఇంత ఎక్కువగా ఉంటే పెద్ద ఫైల్స్‌ను కేవలం కొద్ది సెకన్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా అలాంటి అనేక పనులు చాలా త్వరగా పూర్తవుతాయి. దీనితో పాటు, ఇంటర్నెట్ ఉపయోగించడం, వీడియోలు చూడటం, వీడియో కాలింగ్ చేయడం, OTTలో సినిమాలు చూడటం వంటి వాటిలో స్లో ఉండే స్పీడ్ సమస్య కూడా ఉండదు.
గ్లోబల్ లీడర్‌గా భారత్
టెలికాం శాఖ సహాయ మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ.. భారతదేశంలో ఎంతో మంది టాలెంటెడ్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఉన్నందున భారత్ 6G టెక్నాలజీ విషయంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవగలదని అన్నారు. 6G పరిశోధన, ఆవిష్కరణ కోసం మనకు తగినంత సమయం ఉంది. 6G టెక్నాలజీ వల్ల ప్రస్తుత పరిశ్రమ మాత్రమే కాకుండా అనేక కొత్త పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి.
Read Also:AI Love Story: భర్త చనిపోయిన తర్వాత.. చాట్‌బాట్‌ను పెళ్లి చేసుకున్న మహిళ
అంతేకాదు, 6G కారణంగా 2035 నాటికి భారత ఆర్థిక వ్యవస్థలో 1 ట్రిలియన్ డాలర్ల పెరుగుదల ఉండవచ్చు. 6G సేవలను సాధారణ ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి తెస్తారు? ప్రస్తుతం దీనికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం లేదు. ప్రస్తుతం భారతదేశంలో 5G విభాగంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఆధిపత్యం చెలాయిస్తుండగా, వొడాఫోన్ ఐడియా కూడా 5G నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించే పనిలో ఉంది.
-
My Bharat : ‘మై భారత్’ పోర్టల్ ఇప్పుడు వాట్సాప్‌లోనే.. ఒక్క ‘హాయ్’తో యువతకు బోలెడు అవకాశాలు!
-
Mobile Data : ఇంటర్నెట్ వాడకంలో ఇండియా టాప్.. నెలకు ఒక వ్యక్తి ఎంత డేటా వాడుతున్నాడో తెలుసా?
-
Voter ID Card : ఓటర్లకు గుడ్ న్యూస్.. 15 రోజుల్లోనే ఇంటికే ఓటర్ ఐడీ కార్డు!
-
Driverless Car : త్వరలో ఇండియాలో డ్రైవర్‌లెస్ కార్ల ట్రయల్స్ ప్రారంభం..ప్రభుత్వం భారీ సన్నాహాలు!
-
Job Creation : మేక్ ఇన్ ఇండియా నుంచి డిజిటల్ ఎకానమీ వరకు.. 10ఏళ్లలో 17కోట్ల ఉద్యోగాలు
-
Smart Phone : డిజిటల్ ఇండియా ఎఫెక్ట్.. దాని వినియోగంలో అమెరికాను దాటేసిన భారత్