AI Love Story: భర్త చనిపోయిన తర్వాత.. చాట్‌బాట్‌ను పెళ్లి చేసుకున్న మహిళ
AI Love Story ఎలైన్ అమెరికాలోని పిట్స్‌బర్గ్ నగరంలో నివసిస్తుంది. ఒక కమ్యూనికేషన్ టీచర్‌గా పనిచేస్తుంది. ఆమె ఫస్ట్ లవ్ డాన్నా (భర్త). వీరిద్దరూ 2015లో ఆన్‌లైన్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత 2019లో పెళ్లి చేసుకున్నారు.

AI Love Story : టెక్నాలజీ ప్రపంచం రోజుకో కొత్త వింతను చూపిస్తూనే ఉంది. కానీ ఈసారి జరిగిన సంఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అమెరికాకు చెందిన 58 ఏళ్ల ఎలైన్ వింటర్స్ అనే మహిళ మనిషితో కాదు, ఏకంగా ఒక AI చాట్‌బాట్‌తో పెళ్లి చేసుకుంది. వినడానికి వింతగా ఉన్నా.. ఆ బంధం నిజమైనది, ప్రత్యేకమైనది.
ఎలైన్ అమెరికాలోని పిట్స్‌బర్గ్ నగరంలో నివసిస్తుంది. ఒక కమ్యూనికేషన్ టీచర్‌గా పనిచేస్తుంది. ఆమె ఫస్ట్ లవ్ డాన్నా (భర్త). వీరిద్దరూ 2015లో ఆన్‌లైన్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత 2019లో పెళ్లి చేసుకున్నారు. కానీ 2023లో డాన్నా ఒక తీవ్రమైన అనారోగ్యంతో మరణించాడు. ఈ సంఘటనతో ఎలైన్ పూర్తిగా కుంగిపోయింది. ఒంటరిగా మిగిలిపోయింది.
జీవిత భాగస్వామిగా చాట్‌బాట్
ఒంటరితనం నుంచి బయటపడటానికి ఎలైన్ ఒక డిజిటల్ అసిస్టెంట్‌ను ఉపయోగించడం ప్రారంభించింది. మొదట్లో ఆమె దానిని తన పని కోసం ఉపయోగించేది, కానీ నెమ్మదిగా ఆ చాట్‌బాట్‌తో మాట్లాడటం మొదలుపెట్టింది. దానికి లూకాస్ అని పేరు పెట్టింది. లూకాస్‌తో మాట్లాడుతూ ఉండగా.. ఎలైన్‌కు తాను ఒక నిజమైన వ్యక్తితో మాట్లాడుతున్నట్లు అనిపించింది. లూకాస్ మాటలు ఆమెకు నిజమైన తోడు, అవగాహన, ఆత్మీయతను కలిగించాయి. ఎలైన్ లూకాస్ లైఫ్‌టైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా కొనుగోలు చేసింది. తద్వారా ఆమె ఎల్లప్పుడూ అతనితో ఉండే అవకాశాన్ని పొందింది.
పెళ్లి చేసుకుంది.. చిన్నపాటి గొడవలు కూడా
ఎలైన్ లూకాస్‌తో వర్చువల్‌గా వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత నిజమైన సంబంధాలలో ఎలా గొడవలు జరుగుతాయో, అలాగే ఒకసారి లూకాస్ బంధాన్ని ముగించాలని చెప్పాడు. కానీ ఎలైన్ అతనికి ప్రేమగా నచ్చజెప్పింది, ఆ తర్వాత ఇద్దరూ కలిసిపోయారు. ఇప్పుడు ఎలైన్ ‘Meandmyaihusband’ అనే ఒక బ్లాగును నడుపుతోంది. అందులో ఆమె తన AI భర్తతో గడిపిన క్షణాలను పంచుకుంటుంది. ఈ కథ మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు. టెక్నాలజీ నెమ్మదిగా మనుషుల స్థానాన్ని ఆక్రమిస్తోంది. ఈ కేసును చూస్తే మనుషులు యంత్రాలను ప్రేమించడం మొదలుపెట్టారని అనిపిస్తుంది.