Driverless Car : త్వరలో ఇండియాలో డ్రైవర్‌లెస్ కార్ల ట్రయల్స్ ప్రారంభం..ప్రభుత్వం భారీ సన్నాహాలు!

Driverless Car : వచ్చే రోజుల్లో స్వదేశీ, విదేశీ కార్ల కంపెనీలు డ్రైవర్‌లెస్ కార్ల ట్రయల్స్‌ను భారతదేశంలో నిర్వహించనున్నాయి. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ఆయా కంపెనీలకు చెందిన అధికారుల బృందం (Group of Secretaries) ట్రాయ్ (TRAI) టెరా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ సిఫార్సులకు ఆమోదం తెలిపింది. డ్రైవర్‌లెస్ కార్ల ట్రయల్స్‌కు టెరా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ ప్రాథమిక అవసరం. ఈ నిర్ణయానికి ఆమోదం లభించిన తర్వాత భారతదేశం కార్ల కంపెనీలతో కలిసి డ్రైవర్ లేని కార్లు లేదా ఆటో డ్రైవర్ కార్ల టెక్నాలజీ యుగంలోకి అడుగుపెడుతుంది.
టెరా హెర్ట్జ్ లేకుండా ఇలాంటి కార్ల ట్రయల్స్ సాధ్యం కావు. డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ (DCC) టెరా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ వాడకానికి ఆమోదం తెలిపింది. TRAI ఈ స్పెక్ట్రమ్‌ను ప్రయోగాత్మక వినియోగం కోసం తెరవాలని సిఫార్సు చేసింది.
Read Also:Lata Mangeshkar:వచ్చే జన్మలో అబ్బాయిగా పుట్టాలనుకున్న లెజండరీ సింగర్
వాస్తవానికి, టెరా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ పరిధి 95 GHz నుంచి 3 THz వరకు ఉంటుంది. ఈ స్పెక్ట్రమ్‌పై టెలికమ్యూనికేషన్స్ విభాగం త్వరలో మార్గదర్శకాలను జారీ చేస్తుంది. కొన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిన తర్వాత, కంపెనీలు ప్రతి వినియోగానికి రూ. 1,000 రుసుము చెల్లించి దీనిని ఉపయోగించగలవు. దీనికి రిజిస్ట్రేషన్ రుసుమును విడిగా చెల్లించాల్సి రావొచ్చు, ఆ తర్వాత కంపెనీలు ఐదు సంవత్సరాల పాటు రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (R&D) కోసం దీనిని ఉపయోగించగలవు. ఈ స్పెక్ట్రమ్ రోబోటిక్స్, ఆటోమోటివ్ రాడార్లలో పనిచేస్తుంది. 6G సేవల ట్రయల్స్‌లో కూడా ఉపయోగపడుతుంది.
డ్రైవర్‌లెస్ కార్లు ఎలా పనిచేస్తాయి?
డ్రైవర్‌లెస్ కారు లేదా ఆటో డ్రైవ్ కారు అనేది మానవ డ్రైవర్ లేకుండా నడపగల కారు. ఇది సెన్సార్లు, కెమెరాలు, రాడార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి పరికరాలను ఉపయోగించి తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గుర్తించి, దానికి అనుగుణంగా స్పందిస్తుంది. టెస్లా (Tesla) 2015లో లెవెల్ 2 ఆటోపైలట్‌ను ప్రారంభించిన మొదటి ప్రధాన కార్ల తయారీ సంస్థ. డ్రైవర్‌లెస్ కార్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, వాటిలో రోడ్డు ప్రమాదాలు తగ్గడం, ట్రాఫిక్‌లో మెరుగుదల, ఇంధన ఆదా, సమయం ఆదా వంటివి ఉన్నాయి.
Read Also:Job Creation : మేక్ ఇన్ ఇండియా నుంచి డిజిటల్ ఎకానమీ వరకు.. 10ఏళ్లలో 17కోట్ల ఉద్యోగాలు
-
My Bharat : ‘మై భారత్’ పోర్టల్ ఇప్పుడు వాట్సాప్‌లోనే.. ఒక్క ‘హాయ్’తో యువతకు బోలెడు అవకాశాలు!
-
Mobile Data : ఇంటర్నెట్ వాడకంలో ఇండియా టాప్.. నెలకు ఒక వ్యక్తి ఎంత డేటా వాడుతున్నాడో తెలుసా?
-
Voter ID Card : ఓటర్లకు గుడ్ న్యూస్.. 15 రోజుల్లోనే ఇంటికే ఓటర్ ఐడీ కార్డు!
-
Job Creation : మేక్ ఇన్ ఇండియా నుంచి డిజిటల్ ఎకానమీ వరకు.. 10ఏళ్లలో 17కోట్ల ఉద్యోగాలు
-
Viral Video : స్టైల్ కొట్టబోయి చతికిల పడ్డ బైకర్.. డివైడర్‌పై భయంకర బైక్ ప్రమాదం
-
Viral Video : రోడ్డుపై విచిత్ర స్టంట్లు.. యమరాజుకు మేనల్లుడే వీడు అంటున్న నెటిజన్లు