Voter ID Card : ఓటర్లకు గుడ్ న్యూస్.. 15 రోజుల్లోనే ఇంటికే ఓటర్ ఐడీ కార్డు!

Voter ID Card : ఎన్నికలు అనగానే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తుకొచ్చేది ఓటర్ ఐడీ కార్డు. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారికి లేదా తమ వివరాల్లో మార్పులు చేసుకున్న వారికి ఓటర్ ఐడీ కార్డు రావడానికి చాలా టైం పడుతుంది. కొన్ని సార్లు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు అలాంటి ఎదురుచూపులకు గుడ్ బై చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశంలో జరగబోయే అన్ని ఎన్నికల కోసం ముఖ్య ఎన్నికల సంఘం ఒక పెద్ద మార్పును ప్రకటించింది. ఇకపై ఓటర్ కార్డు (EPIC) కేవలం 15 రోజుల్లోనే మీ ఇంటికి చేరేలా ఒక కొత్త ప్రక్రియ ప్రారంభించినట్లు బుధవారం ప్రకటించింది. కొత్త ఓటర్లుగా నమోదు చేసుకున్న వారికి లేదా పాత ఓటర్ల సమాచారంలో ఏదైనా మార్పులు చేసుకున్న వారికి ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ఇప్పటివరకు ఓటర్ కార్డులు ప్రజలకు చేరడానికి నెల రోజుల కంటే ఎక్కువ టైం పట్టేది. కానీ, ఇప్పుడు ఎన్నికల సంఘం తీసుకొచ్చిన కొత్త ప్రక్రియ ప్రకారం ఓటర్ కార్డు తయారుచేసే దశ నుంచి పోస్ట్ ద్వారా ఇంటికి చేరే వరకు ప్రతి దశను ట్రాక్ చేయవచ్చు. అంటే, ఈ సిస్టమ్ మొత్తం రియల్-టైమ్‌లో ట్రాక్ అవుతుంది. అంతేకాకుండా, ప్రతి అడుగు సమాచారం ఎస్ఎంఎస్ (SMS) ద్వారా ఓటర్‌కు చేరుతుంది. దీంతో, తమ ఓటర్ కార్డు ఎక్కడి వరకు వచ్చిందో వారికి స్పష్టంగా తెలుస్తుంది.
ఈ కొత్త సౌకర్యాన్ని పొందడానికి లేదా ఆన్లైన్లో ఓటర్ ఐడీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి భారతీయ ఎన్నికల సంఘం ‘ఓటర్ హెల్ప్‌లైన్ యాప్’ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ సహాయంతో మీరు కొత్త ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మీ పాత ఓటర్ కార్డులో ఏమైనా మార్పులు కూడా చేసుకోవచ్చు.
Read Also:Viral Video : నువ్వేం తండ్రివిరా నాయనా.. ఆ పిల్లాడిని సింహానికి ఆహారంగా వేద్దాం అనుకుంటున్నావా ?
కొత్త ఓటర్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
* ముందుగా మీ మొబైల్లో ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి.
* యాప్‌ను ఓపెన్ చేసి ‘ఓటర్ రిజిస్ట్రేషన్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత యాప్‌లో అడిగిన సమాచారం అంటే మీ పేరు, అడ్రస్, మొబైల్ నంబర్, ఆధార్ కార్డు వివరాలు అన్నీ నింపాలి.
* ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక Submit బటన్‌పై క్లిక్ చేయండి.
* ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత బూత్ లెవెల్ ఆఫీసర్ ద్వారా వెరిఫికేషన్ జరుగుతుంది. ఆపై మీ కొత్త ఓటర్ కార్డు రెడీ అయి మీ ఇంటికి వచ్చేస్తుంది.
పాత ఓటర్ కార్డులో మార్పులు ఎలా చేసుకోవాలి?
ఇదే ‘ఓటర్ హెల్ప్‌లైన్ యాప్’ ద్వారా మీరు మీ పాత ఓటర్ ఐడీ కార్డులో మార్పులు కూడా చేసుకోవచ్చు. యాప్‌లోని చివరిలో ఉన్న ‘కంప్లైన్ అండ్ రిజిస్ట్రేషన్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కొన్ని అవసరమైన వివరాలను ఫిల్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన 15 రోజుల్లోపు మీ కొత్త ఓటర్ ఐడీ కార్డు మార్పులతో సహా మీ ఇంటికి చేరుతుంది.
Read Also:Driving History: మన దేశంలో ఎడమవైపు.. విదేశాల్లో కుడివైపు డ్రైవింగ్.. దీని చరిత్ర ఏంటంటే?
-
Mobile Data : ఇంటర్నెట్ వాడకంలో ఇండియా టాప్.. నెలకు ఒక వ్యక్తి ఎంత డేటా వాడుతున్నాడో తెలుసా?
-
Driverless Car : త్వరలో ఇండియాలో డ్రైవర్‌లెస్ కార్ల ట్రయల్స్ ప్రారంభం..ప్రభుత్వం భారీ సన్నాహాలు!
-
Job Creation : మేక్ ఇన్ ఇండియా నుంచి డిజిటల్ ఎకానమీ వరకు.. 10ఏళ్లలో 17కోట్ల ఉద్యోగాలు
-
Smart Phone : డిజిటల్ ఇండియా ఎఫెక్ట్.. దాని వినియోగంలో అమెరికాను దాటేసిన భారత్
-
Bharat 6G 2025 : టెలికాం రంగంలో విప్లవం.. 5G కంటే 100 రెట్లు వేగంతో ఇంటర్నెట్!