Smart Phone : డిజిటల్ ఇండియా ఎఫెక్ట్.. దాని వినియోగంలో అమెరికాను దాటేసిన భారత్

Smart Phone : స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్‌ఫోన్ల వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. అయితే, ప్రపంచంలో ఏ దేశాలు స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్యలో ముందున్నాయో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ విషయంలో భారత్ ఎక్కడ ఉందో చూద్దాం.
ప్రపంచంలో అత్యధిక స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కలిగిన దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. అక్కడి జనాభా ఎక్కువ కావడంతో పాటు ప్రజలు టెక్నాలజీని చాలా వేగంగా అలవాటు చేసుకుంటున్నారు. ఒక నివేదిక ప్రకారం చైనాలో ఏకంగా 100 కోట్ల మందికి పైగా స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నారు. పట్టణాల నుంచి పల్లెల వరకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ కనిపిస్తోంది.
Read Also:Manchu Vishnu: నాన్న కోసమే ఇదంతా చేస్తున్నా.. మంచు విష్ణుసంచలన నిజాలు
ఇక రెండో స్థానంలో మన భారతదేశం ఉంది. ఇక్కడ దాదాపు 70 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం చౌకగా లభిస్తున్న ఇంటర్నెట్, తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉండటం.. దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉండటం. ముఖ్యంగా యువత అయితే స్మార్ట్‌ఫోన్‌లకు బాగా అలవాటు పడ్డారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ క్లాసులు, డిజిటల్ పేమెంట్స్ వంటి వాటితో స్మార్ట్‌ఫోన్ వాడకం మరింత ఎక్కువైంది. అమెరికా జనాభా కంటే మన జనాభా చాలా ఎక్కువ కాబట్టి, స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అంతేకాకుండా, భారతదేశంలో టెక్నాలజీ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కాబట్టి రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్యలో అమెరికా మూడవ స్థానంలో ఉంది. అక్కడ దాదాపు 30 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నారు. అమెరికా జనాభా భారత్, చైనా కంటే తక్కువగా ఉన్నప్పటికీ, అక్కడ టెక్నాలజీ చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది. దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. వారు దానిని పని చేసుకోవడానికి, ఈమెయిల్స్ పంపడానికి, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికి, వినోదం కోసం ఉపయోగిస్తారు.
Read Also:Phone Battery Drain :మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ 5 సింపుల్ చిట్కాలు పాటించండి
భారత్, అమెరికా మధ్య స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్యలో దాదాపు 40 కోట్ల తేడా ఉంది. అయితే అమెరికా జనాభా భారతదేశం కంటే చాలా తక్కువ అని గుర్తుంచుకోవాలి. చైనా, భారత్ తర్వాత ఇండోనేషియా, బ్రెజిల్, రష్యా, జపాన్ వంటి దేశాలు కూడా స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్యలో ముందున్నాయి. కానీ చైనా, భారత్‌తో పోటీ పడటం మాత్రం అంత సులువు కాదు.
-
Karakoram Highway : ప్రపంచంలోనే ఎత్తైన రహదారి.. ప్రకృతి అందాలకు, సాహస యాత్రకు అడ్డా.. ఎక్కడ ఉందంటే ?
-
Team india captain Subhaman gill: డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించిన గిల్.. ఒకే మ్యాచ్‌లో ఇన్ని రికార్డులా!
-
IBPS Notification: గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వేలలో బ్యాంకులో ఉద్యోగాలు!
-
Rishabh Pant: ఫ్రస్టేషన్‌లో రిషబ్ పంత్.. హెల్మెట్‌ను నేలకేసి కొట్టి.. వీడియో వైరల్!
-
My Bharat : ‘మై భారత్’ పోర్టల్ ఇప్పుడు వాట్సాప్‌లోనే.. ఒక్క ‘హాయ్’తో యువతకు బోలెడు అవకాశాలు!
-
Gautam Gambhir: కోచ్‌గా వచ్చాడు.. చెత్త రికార్డులు సృష్టించాడు.. వద్దంటున్న ఫ్యాన్స్!