Manchu Vishnu: నాన్న కోసమే ఇదంతా చేస్తున్నా.. మంచు విష్ణుసంచలన నిజాలు

Manchu Vishnu: ఈ ప్రపంచంలో తన తండ్రి సంతోషం కంటే ఏదీ తనకు ముఖ్యం కాదని మంచు విష్ణు తెలిపారు. ముఖ్య పాత్రలో నటిస్తున్న కన్నప్ప మూవీ జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మంచు విష్ణు ఓ పాడ్ కాస్ట్‌లో పాల్గొన్నారు. ఇందులో మాట్లాడుతూ తన తండ్రి మీద ఉన్న ప్రేమను చాటుకున్నారు. అలాగే కన్నప్ప మూవీ గురించి మాట్లాడారు. ఈ మూవీ ఎలా ఉందో కూడా తెలియకుండానే కొందరు సెన్సార్ బోర్డుకు లేఖలు రాశారని తెలిపారు. కొన్ని సన్నివేశాలను తప్పుపడుతూ ఇలా లేఖలు రాయడం ఏంటని అన్నారు. శ్రీకాళహస్తిలో ఉన్న అర్చకులు అందరికీ కూడా కన్నప్పను చూపించామని.. ఏవైనా పొరపాట్లు ఉంటే చెప్పమని అడిగామని అన్నారు. అయితే ఇందులో ఒక్క ఫ్రేమ్ కూడా మార్చవద్దని.. భక్తి మొత్తం ఇందులో చూపించారని అన్నారని విష్ణు తెలిపారు. ఈ సినిమా కోసం అనుకున్న దాని కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి: వీరంతా అదృష్టవంతులు లేరు.. జీవితాంతం సుఖమయమే
ఈ మధ్య కాలంలో సమస్యలు ఎక్కువగా వచ్చాయని, వాటి వల్ల తండ్రి సంతోషంగా లేరని తెలిపారు. తండ్రి కష్టానికి నేను మంచి పేరు తీసుకురాకపోయినా పర్లేదు. కానీ నాన్నని కష్టపెట్టకూడదని, అతనికి చెడ్డ పేరు తీసుకురాకూడదని విష్ణు అన్నారు. అయితే ఇప్పుడు పూర్తిగా తాను శివ భక్తుడిగా మారిపోయినట్లు తెలిపారు. ఎక్కువ సమయం ధ్యానం చేసుకుంటూ ఉంటున్నానని, అందుకే కాస్త టెన్షన్‌ల నుంచి ఫ్రీగా ఉంటున్నట్లు తెలిపారు. ప్రభాస్ నాకు చాలా క్లోజ్‌గా ఉంటారు. ఎంత గొప్ప నటుడూ ఆ విషయం ప్రభాస్‌కి కూడా తెలియదు. చాలా తక్కువ మంది ప్రభాస్‌లా ఉంటారు. అయితే కెరీర్ స్టార్టింగ్‌లో అందరూ ఒకేలా ఉంటారు. కానీ ఇంత స్టార్ అయ్యాక కూడా ఇలా కొందరు మాత్రమే ఉంటారు. ఇదే ప్రభాస్ గొప్పతనం అని తెలిపారు. ఎప్పటికీ తాము సోదరులమేనని ఎన్ని జన్మలు అయినా కూడా తనకి రుణపడి ఉంటానని తెలిపారు.
ఇది కూడా చూడండి: Kangana Ranaut : ట్రంప్‌పై పోస్ట్… పార్టీ ఆదేశాలతో తొలగించిన కంగనా రనౌత్
కన్నప్ప కథ కోసం ఎందరో కూడా సాయం చేశారు. విజయేంద్ర ప్రసాద్ సలహాలు కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ మూవీలో మోహన్‌లాల్ పాత్ర అందరినీ కూడా సర్‌ప్రైజ్ చేస్తుందని విష్ణు తెలిపారు. భారీ స్థాయిలో కన్నప్పను 2000లకు పైగా థియేటర్‌లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్‌కు థాంక్స్ చెప్పాలని విష్ణు అన్నారు.
ఇది కూడా చూడండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఆ రోజే వార్ 2 టీజర్ రిలీజ్
-
Pan India Star Prabhas: గొప్ప మనస్సు చాటుకున్న రెబల్ స్టార్.. ఫిష్ వెంకట్‌కు ఆర్థిక సాయం!
-
Movie piracy: మూవీ రూల్జ్, తమిళ్ ఎంవీలకు సినిమాలు అమ్మింది ఇతడే.. వేల కోట్ల నష్టం తెప్పించాడు
-
Prabhas : ప్రభాస్ వింటేజ్ లుక్స్ రీలోడెడ్.. ‘ఫౌజీ’ నుంచి వైరల్ అవుతున్న ఫోటోతో ఫ్యాన్స్ ఫిదా!
-
Kannappa Movie Collections: రూ.50 కోట్ల క్లబ్‌లోకి కన్నప్ప.. బ్రేక్ ఈవెన్‌కు సమయం పడుతుందా?
-
Kannappa Movie : కన్నప్ప సినిమా చూసి కేసు పెడతామంటున్న ప్రభాస్ ఫ్యాన్స్
-
Manchu Manoj: మంచు విష్ణు కన్నప్ప మూవీ రిలీజ్ వేళ.. మనోజ్ ఆసక్తికర పోస్ట్!