Kangana Ranaut : ట్రంప్‌పై పోస్ట్… పార్టీ ఆదేశాలతో తొలగించిన కంగనా రనౌత్
Kangana Ranaut : సోషల్ మీడియా వేదికగా తరచూ సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచే బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, తాజాగా చేసిన ఓ పోస్ట్ రాజకీయ దుమారం రేపింది.

Kangana Ranaut : సోషల్ మీడియా వేదికగా తరచూ సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచే బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, తాజాగా చేసిన ఓ పోస్ట్ రాజకీయ దుమారం రేపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో కలకలం సృష్టించాయి. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనల మేరకు ఆమె తన ఎక్స్ (X), ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లను తొలగించి క్షమాపణ చెప్పారు.
మండి లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన కంగనా రనౌత్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. ట్రంప్-మోదీ ‘పోలిక’ వ్యాఖ్యల పర్యవసానాలపై పార్టీ వర్గాల్లో ఆందోళన రేపాయి. ఇప్పటికే సీనియర్ పార్టీ నాయకుడు, మంత్రి విజయ్ షా కర్నల్ సోఫియా ఖురేషిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ తీవ్ర నష్టాన్ని చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో కంగనా చేసిన వ్యాఖ్యలు మరింత తలనొప్పి తెచ్చిపెట్టాయి.
కంగనా ఎక్స్ (X) వేదికగా పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు డొనాల్డ్ ట్రంప్‌పై చేసిన ట్వీట్‌ను తొలగించినట్లు ప్రకటించారు. ఆ వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయమని ఆమె పేర్కొన్నారు. “జేపీ నడ్డా గారు ఫోన్ చేసి, యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌ను భారతదేశంలో తయారీ చేయవద్దని ట్రంప్ చెప్పిన దానిపై నేను చేసిన ట్వీట్‌ను తొలగించమని అడిగారు. నా వ్యక్తిగత అభిప్రాయాన్ని పోస్ట్ చేసినందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆదేశాల మేరకు వెంటనే ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా తొలగించాను” అని కంగనా ఎక్స్ (X) లో పోస్ట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌ను ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారానికి సహకరించడం మానేసి, స్వదేశంపై దృష్టి పెట్టాలని చేసిన విజ్ఞప్తిపై కంగనా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కంగనా పోస్ట్ ఇప్పుడు తొలగించినప్పటికీ కొన్ని వైరల్ స్క్రీన్‌షాట్‌ల ప్రకారం, ఆమె డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీని పోల్చి భారత ప్రధానిని అమెరికా అధ్యక్షుడి కంటే ఉన్నతంగా చూపించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల దోహాలో జరిగిన ఒక వ్యాపార కార్యక్రమంలో.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌ను అధిక సుంకాల కారణంగా భారతదేశంపై కాకుండా అమెరికాపై దృష్టి పెట్టాలని కోరారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కోవడానికి బీజింగ్ నుంచి భారతదేశానికి తమ స్థావరాన్ని మార్చాలని యాపిల్ భావిస్తున్న సమయంలో ట్రంప్ భారతదేశంలో తయారీ చేయవద్దని యాపిల్‌కు సూచించడం చర్చనీయాంశంగా మారింది.
-
Trump Warning To Putin: పుతిన్ కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
-
Modi Meets Trump: వచ్చేనెల ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ
-
PM Modi: ట్రంప్ టారిఫ్ లు.. మోదీ స్ట్రాంగ్ మెసేజ్
-
Sanjay Dutt : అనవసరంగా చేశా.. డైరెక్టర్ లోకేష్ పై సీరియస్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు