Trump Warning To Putin: పుతిన్ కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
Trump Warning To Putin ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీతో పాటు ఇతర ఐరోపా నేతలతో వర్చువల్ సమావేశం అనంతరం మాట్లాడారు. అయితే ట్రంప్, పుతిన్ భేటీ అత్యంత గోప్యంగా జరుగబోతున్నదని వైట్ హౌష్ వర్గాలు వెల్లడించాయి.

Trump Warning To Putin: పుతిన్ ను డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. మరికొన్ని గంటల్లో సమావేశం జరుగనుండగా పుతిన్ కు ట్రంప్ హెచ్చరించారు. శుక్రవారం నాటి చర్చల తర్వాత ఉక్రెయిన్ తో యుద్ధాన్ని పుతిన్ ఆపకపోతే అత్యంత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ భూభాగం విషయంలోనే చర్చలుంటాయని స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీతో పాటు ఇతర ఐరోపా నేతలతో వర్చువల్ సమావేశం అనంతరం మాట్లాడారు. అయితే ట్రంప్, పుతిన్ భేటీ అత్యంత గోప్యంగా జరుగబోతున్నదని వైట్ హౌష్ వర్గాలు వెల్లడించాయి. సమావేశం జరిగే గదిలో వారిద్దరితో పాటు అనువాదకులు మాత్రమే ఉంటారని పేర్కొన్నాయి. ఇరుదేశాల నేతలు దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ముఖాముఖి చర్చలు జరుపనుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.