Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం

Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. మొదట కర్ణాటకలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రష్మిక, ఆ తర్వాత తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టింది. అక్కడి నుంచి తమిళంలోకి, ఇప్పుడు బాలీవుడ్‌లోనూ వరుస హిట్లతో దూసుకుపోతోంది. ఇలా పాన్ ఇండియా స్టార్‌గా మారిన రష్మిక, ప్రస్తుతం పలు ప్రఖ్యాత మ్యాగజైన్ల కవర్‌పేజీలపై కూడా మెరిసిపోతుంది. తాజాగా ‘డర్టీ కట్ 25’ అనే మ్యాగజైన్ కవర్‌పేజీ కోసం రష్మిక చేసిన ఫోటోషూట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను ఒక్కసారిగా చూస్తే, అది రష్మిక మందన్న అని గుర్తుపట్టడం చాలా కష్టం. అంతగా ఆమె లుక్ మారిపోయింది. థిక్ లిప్‌స్టిక్ వేసుకుని, కొత్త హెయిర్ స్టైల్‌తో రష్మిక ఈ ఫోటోషూట్‌లో కనిపించింది. ఆమె అభిమానులకు ఈ కొత్త గెటప్ చాలా నచ్చింది. హీరోయిన్ అమలా పాల్ కూడా రష్మిక కొత్త లుక్‌ను చూసి తెగ మెచ్చుకుంది.
రష్మిక మందన్న ఇంతకుముందు చాలా రకాల ఫోటోషూట్లు చేసింది. కానీ, ఇలాంటి గెటప్‌లో కనిపించడం ఇదే మొదటిసారి. అందుకే అభిమానులు ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఫ్యాషన్‌కు సంబంధించిన డర్టీ కట్ 25 మ్యాగజైన్ రష్మికను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేసింది. సినిమా ఇండస్ట్రీలో రష్మిక సాధించిన విజయాలను మెచ్చుకుంది.
Read Also:Blood Sugar : బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండాలంటే ఈ పండ్లను తినొద్దు
బాలీవుడ్ ప్రేక్షకులకు రష్మిక మందన్న ఇప్పుడు ఫేవరెట్ హీరోయిన్ అయ్యింది. చాలా మంది హీరోలకు ఆమె లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. రష్మిక నటించిన పుష్ప 2 సినిమా హిందీలో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత వచ్చిన యానిమల్, ఛావా వంటి సినిమాలు బాలీవుడ్లో ఓ ఊపు ఊపాయి. ఇలా రష్మిక మందన్న సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది.
అయితే, ఇటీవల రష్మిక మందన్న ఒక కొత్త వివాదంలో చిక్కుకుంది. “కొడగు కమ్యూనిటీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన మొదటి హీరోయిన్ నేనే” అని ఆమె ఒక సందర్భంలో వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యను చాలా మంది ఖండించారు. ప్రేమా, హర్షికా పూనచ్చ, శ్వేతా చంగప్ప, అశ్వినీ నాచప్ప వంటి సెలబ్రిటీలు రష్మిక కంటే ముందే చిత్ర పరిశ్రమలో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఈ విషయం తెలిసి కూడా రష్మిక అలాంటి వ్యాఖ్య చేయడం వివాదానికి దారితీసింది.
Read Also:Origin of the kiss: అసలు ముద్దు ఎలా పుట్టిందో మీకు తెలుసా?
-
Sanjay Dutt : అనవసరంగా చేశా.. డైరెక్టర్ లోకేష్ పై సీరియస్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్
-
Rashmika : స్టార్ హీరోల లక్కీ హీరోయిన్ రష్మిక.. అల్లు అర్జున్‌తో నాలుగోసారి!
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Allu Arjun : తానా వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అల్లు అర్జున్‌కు షాకిచ్చిన రాఘవేంద్ర రావు
-
Samantha : ‘మీ వల్లే నేను బ్రతికున్నా’.. వేదిక పైనే కన్నీళ్లు పెట్టుకున్న సమంత
-
Ramayana : రావణుడి క్రేజ్ రాముడిని డామినేట్ చేసిందా.. రామాయణ గ్లింప్స్ పై ట్రోలర్స్ ఇదే చెబుతున్నారా ?