Origin of the kiss: అసలు ముద్దు ఎలా పుట్టిందో మీకు తెలుసా?

Origin of the kiss: ముద్దు అనే పదం ఎన్నో అర్థాలను ఇస్తుంది. ప్రేమ, ఆప్యాయత, ఎమోషనల్, బాధ ఇలా ఎన్నో వస్తాయి. అయితే ఈ ముద్దు అనేది మానవుల నుంచి పుట్టిందని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ ముద్దు అనే ఒక చిన్న ఘటన వల్ల జంతువు వల్ల పుట్టిందనే విషయం మనలో చాలా మందికి తెలియదు. అయితే మనుషులకు మొదటి ముద్దు తన అమ్మ నుంచి వస్తుంది. పుట్టిన వెంటనే తల్లిదండ్రులు బిడ్డను ముద్దాడుతారు. మరి ఇంతటి స్పెషల్ ముద్దు ఎలా పుట్టింది? ఏ జంతువుల నుంచి పుట్టిందో మీకు తెలియాలంటే మీరు ఈ ఆర్టికల్‌పై ఓ లుక్కేయాల్సిందే.
ముద్దు అనేది చింపాంజీల నుంచి పుట్టిందట. చింపాజీల పిల్లలు వాటికి అవే సొంతంగా తినలేవు. తల్లి చింపాంజీ నమిలిన తర్వాత వాటిని పిల్లల నోటి దగ్గరకు తీసుకొచ్చి ఇస్తుంది. అయితే కేవలం చింపాంజీలోనే కాదు. పశువులు కూడా ఇలానే చేస్తాయి. అయితే తల్లి నోటి నుంచి పిల్ల నోటికి ఫుడ్ అందించడాన్ని ‘ప్రీమెస్టికేషన్ ఫుడ్ ట్రాన్స్‌ఫర్’ అంటారు. పూర్వీకులు అప్పట్లో ముద్దు పెట్టుకోవడం ప్రారంభించారు. అయితే అనుకోకుండా జరిగిన ఓ ప్రక్రియ వల్ల ముద్దు పుట్టిందని ఆంత్రోపాలజిస్టులు చెబుతున్నారు. ఒకరినొకరు వాసన చూసుకునే టైంలో ఈ ముద్దు పుట్టిందట. చాలా ఏళ్ల క్రితం ఒకరి వాసన ఇంకొకరు చూసుకునే వారు. ఇలా వాసన చూసుకునే సమయంలో ముద్దు పుట్టిందట. వాసన చూసే సమయంలో పెదవులు కలవడంతోనే ముద్దు పుట్టిందని చెబుతున్నారు. అయితే అప్పట్లో ఇది ఒక తెగలో సాంప్రదాయంగా ఉండేది. యూరప్‌లో దీన్ని ఒక విషెష్‌లా చూస్తారు.
ఇప్పటికీ కూడా యూరప్‌లో ఈ కల్చర్ ఉంది. ఇష్టమైన వారిని కలిస్తే చెంపలను తాకడం, చేతులపై ముద్దులు పెట్టుకుంటారు. అయితే ఇలా పెట్టుకోవడం అనారోగ్య సమస్యలు వస్తాయని రోమ్కు చెందిన రాజు టాయిబోరిస్ లిప్ కిస్‌ను పూర్తిగా బ్యాన్ చేశారు. ఈజిప్టు, ఇటలీ, జర్మనీ, బెల్జియం వంటి దేశాల్లో ముద్దు పెట్టుకోవడాన్ని నేరంగా భావించేవారు. 17వ శతాబ్దంలో ప్లేగు వ్యాధి వల్ల ముద్దు పెట్టుకోకూడదు. ఎవరైనా పెట్టుకుంటే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించేవారు. అమెరికాలో అయితే బ్యాడ్ మ్యానర్స్ లిస్ట్‌లో కూడా దీన్ని చేర్చారు. కానీ అమెరికాలో ఇప్పుడు ఒక ట్రెండ్. ప్రేమకు చిహ్నంగా ముద్దును భావిస్తారు. ప్రేమ ఎంత ఉందో దాన్ని వ్యక్తపరచడానికి ముద్దు రూపంలో చూపిస్తారు. ముద్దు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.