Rashmika : స్టార్ హీరోల లక్కీ హీరోయిన్ రష్మిక.. అల్లు అర్జున్‌తో నాలుగోసారి!

Rashmika : రష్మిక మందన్నా.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్. ఆమె ఏ సినిమా చేసినా అది హిట్ గ్యారంటీ అన్న నమ్మకం వచ్చేసింది. ఆమె ఉన్నందువల్లే సినిమాలు హిట్ అవుతున్నాయా, లేదా హిట్టయ్యే సినిమాల్లోనే ఆమె ఉంటుందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం. ఏదేమైనా నిర్మాతలకు రష్మిక ఒక అదృష్ట లక్ష్మిగా మారిపోయింది. ఈ కారణంగానే నిర్మాతలు ఆమె ఇంటి తలుపు తడుతున్నారు. తాజాగా రష్మికకు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. ఆమె మళ్ళీ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతోంది.
అల్లు అర్జున్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరో. ఆయన పుష్ప, పుష్ప 2 సినిమాల్లో రష్మికతో కలిసి నటించారు. ఈ రెండు సినిమాలు పెద్ద హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ ఇద్దరూ మరో సినిమా కోసం కలిసి పనిచేయబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
Read Also:Smartphone : కంపెనీల స్టాక్ క్లియరెన్స్ ప్లాన్.. భారీగా తగ్గనున్న స్మార్ట్ ఫోన్ ధరలు
సన్ పిక్చర్స్ నిర్మాణంలో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో AA22xA6 అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే, జాన్వి కపూర్, మృణాల్ ఠాకూర్ ఇప్పటికే ఖరారు అయ్యారు. ఇప్పుడు వీరితో పాటు రష్మిక కూడా నటిస్తోంది. అయితే, ఈసారి రష్మికకు అల్లు అర్జున్‌తో రొమాన్స్ చేసే అవకాశం ఉండదని తెలుస్తోంది. ఆమె పాత్ర డిఫరెంటుగా ఉండబోతుందని సమాచారం.
ప్రస్తుతం పుష్ప 3 సినిమా కూడా రాబోతోంది. ఒకవేళ ఆ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్తే, రష్మిక, అల్లు అర్జున్ జంట నాలుగోసారి కలిసి నటించినట్లు అవుతుంది. రష్మిక ఇటీవల వరుసగా హిట్లు ఇస్తోంది. యానిమల్, ఛావా, పుష్ప 2 వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుత విజయాలను సాధించాయి. దీనివల్ల రష్మిక డిమాండ్ మరింత పెరిగింది.
Read Also:Youtube new rules: యూట్యూబర్లకు షాకింగ్ న్యూస్.. ఈ రూల్స్ పాటిస్తేనే డబ్బులు లేకపోతే కట్!
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Allu Arjun : తానా వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అల్లు అర్జున్‌కు షాకిచ్చిన రాఘవేంద్ర రావు
-
Rashmika : మరో వివాదంలో చిక్కుకున్న రష్మిక మందన్నా.. ఇంతకీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ?
-
Kubera : ఒకచోట హిట్.. ఇంకోచోట ఫ్లాప్.. ‘కుబేర’ కలెక్షన్లపై అంతుచిక్కని మిస్టరీ!
-
Rashmika : ‘మైసా’ పోస్టర్‌తో బయటపడిన విజయ్, రష్మిక బంధం