Smartphone : కంపెనీల స్టాక్ క్లియరెన్స్ ప్లాన్.. భారీగా తగ్గనున్న స్మార్ట్ ఫోన్ ధరలు

Smartphone : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? అలాంటి వాళ్లకు ఓ గుడ్ న్యూస్. రాబోయే ప్రైమ్ డే, రక్షా బంధన్, ఇండిపెండెన్స్ డే సేల్ సీజన్ల సందర్భంగా స్మార్ట్ఫోన్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. కంపెనీలు తమ దగ్గర పేరుకుపోయిన స్టాక్‌ను తగ్గించుకోవడానికి ఈ భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో రాబోయే కీలకమైన దివాళి సీజన్ కు ముందు తమ వద్ద ఉన్న అదనపు స్టాక్‌ను ఖాళీ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి.
ప్రముఖ ఎనాలసిస్ కంపెనీ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అమ్ముడుపోకుండా మిగిలి ఉన్న స్టాక్ గత సంవత్సరంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. గతేడాది దివాళి తర్వాత అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. ఈ సంవత్సరం కొత్త మోడల్లను విడుదల చేయడంతో కంపెనీల దగ్గర పాత స్టాక్ భారీగా పెరిగిపోయింది.
Read Also:Youtube new rules: యూట్యూబర్లకు షాకింగ్ న్యూస్.. ఈ రూల్స్ పాటిస్తేనే డబ్బులు లేకపోతే కట్!
కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ.. “స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు 2025 కోసం కొత్త మోడల్లను విడుదల చేశాయి” అని చెప్పారు. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో స్టాక్‌ను క్లియర్ చేయడంపై బ్రాండ్లు దృష్టి సారించాయని, రిటైల్ అమ్మకాలు 3 శాతం పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. కంపెనీలు సరఫరాను తగ్గించినప్పటికీ, ఇన్వెంటరీ ఇంకా ఎక్కువగా ఉంది. ఈ కారణంగానే దీపావళి సీజన్‌కు ముందు స్టాక్‌ను ఖాళీ చేయడానికి బ్రాండ్లు ప్రైమ్ డే వంటి సేల్ ఈవెంట్ల సమయంలో భారీ డిస్కౌంట్లు, ప్రమోషన్లను అందిస్తున్నాయి.
కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం.. వివో, శామ్సంగ్, ఆపిల్, మోటరోలాల వద్ద తక్కువ స్టాక్ ఉంది. అయితే, వన్‌ప్లస్, షావోమి, ఐక్యూ, రియల్మీ, ఒప్పో, నథింగ్ ల వద్ద ఎక్కువ స్టాక్ ఉంది. ఎక్కువ స్టాక్ ఉన్న బ్రాండ్లు ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తాయని పాఠక్ చెప్పారు. స్మార్ట్‌ఫోన్, కన్స్యూమర్ టెక్ కంపెనీలు దీపావళి సీజన్‌కు ముందు స్టాక్‌ను ఖాళీ చేయడానికి అమెజాన్ ప్రైమ్ డే వంటి సేల్ ఈవెంట్ల సమయంలో భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి.
Read Also:Fake Wedding trend: తినంత తిండి.. తాగేంత మందు.. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్. తో ఎంజాయ్ చేయండి