Dmart: డీ-మార్ట్ భారీ డిస్కౌంట్లు ఎందుకు ఇస్తుందో మీకు తెలుసా?

Dmart: ఇంటి సరుకులు కొనుగోలు చేయడానికి చాలా మంది డీ-మార్ట్‌కు వెళ్తుంటారు. అక్కడ వస్తువులు చాలా తక్కువ ధరలకే లభిస్తాయి. ముఖ్యంగా పండుగ సమయాల్లో, ప్రత్యేక ఆఫర్లలో భారీ డిస్కౌంట్లు ఉంటాయి. వీటిని చూసి ఆశ్చర్యపోతుంటారు. అసలు డీ-మార్ట్ ఇంత తక్కువ ధరలకు వస్తువులను ఎలా అమ్ముతుందనే విషయం చాలా మందికి తెలియదు. ఇలా తక్కువ ధరకే సరకులు ఇస్తే డీమార్ట్‌కి లాభం ఏంటి? ఎలా సరుకులను తక్కువ ధరకే ఇస్తుంది? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
డీ-మార్ట్ వ్యవస్థాపకుడు, యజమాని రాధాకిషన్ ధమానీ తెలివిగా బిజినెస్ చేస్తున్నారు. ఆయన వ్యాపార విధానం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. డీ-మార్ట్ స్టోర్లను అద్దె భవనాలలో తెరవడానికి బదులుగా, ఆయన సొంత స్థలంలోనే స్టోర్లను ఏర్పాటు చేస్తారు. సాధారణంగా ఒక పెద్ద షాపింగ్ మాల్ లేదా సూపర్ మార్కెట్ నడపడానికి అద్దె చాలా పెద్ద ఖర్చు అవుతుంది. ప్రతి నెలా లక్షల్లో అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే, డీ-మార్ట్ ఈ అద్దె ఖర్చులను పూర్తిగా ఆదా చేస్తుంది. అద్దె ఖర్చులు లేకపోవడం వల్ల డీ-మార్ట్‌కు ఐదు నుంచి ఏడు శాతం వరకు ఖర్చులు తగ్గుతాయి. ఈ ఆదా అయిన మొత్తాన్ని డీ-మార్ట్ నేరుగా వినియోగదారులకు డిస్కౌంట్ల రూపంలో అందిస్తుంది. అందుకే, డీ-మార్ట్‌లో వస్తువులు బయట షాపుల కంటే తక్కువ ధరలకు లభిస్తాయి. ఇది వినియోగదారులకు లాభం వస్తుంది.
డీ-మార్ట్ తమ స్టాకును చాలా తక్కువ సమయంలో అమ్ముడుపోవాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది. సాధారణంగా, వారు ఒక నెల రోజుల్లోగా తమ దగ్గర ఉన్న సరుకు అంతా అమ్మేసి, మళ్లీ కొత్త సరుకును తెప్పించుకుంటారు. దీని వల్ల వారి దగ్గర సరుకు నిల్వ ఉండదు. త్వరగా స్టాక్ క్లియర్ చేయడం కోసం కూడా కొన్నిసార్లు భారీ డిస్కౌంట్లు ఇస్తుంటారు. తొందరగా సరకు పూర్తి కావాలని భారీ డిస్కౌంట్లు పెడుతుంటారు. ప్రజలు కూడా తక్కువ ధరకే ఉన్నాయి. మళ్లీ ఈ అవకాశం లభించదని ఎక్కువ మొత్తంలో కొంటారు. ధర ఎక్కువగా ఉంటే కొనుగోలు చేయరు. కానీ తక్కువగా ఉంటే మాత్రం అధిక మొత్తంలో కొనుగోలు చేస్తారు. ఇలా చేయడం వల్ల డీ మార్ట్‌కి లాభం వస్తుంది. ఇలాంటి వ్యాపార వ్యూహాల వల్ల డీ-మార్ట్ వినియోగదారులకు తక్కువ ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూనే, స్వయంగా లాభాలను ఆర్జిస్తోంది. అందుకే, డీ-మార్ట్ భారతదేశంలో ఇంత తక్కువ సమయంలోనే ఇంత పెద్ద విజయవంతమైన రిటైల్ చైన్‌గా మారింది. ఇది రాధాకిషన్ ధమానీ వ్యాపార టెక్నిక్.
ఇది కూడా చూడండి: ENG vs IND: త్వరలోనే ఇంగ్లాండ్ సిరీస్.. ఫైనల్ జట్టు ఇదే
-
Auto Driver: నెలకు రూ.8 లక్షలు.. ఇది ఒక ఆటో డ్రైవర్ జీతం.. వైరల్ న్యూస్
-
Viral News: మరీ ఇంత దారుణమా.. స్నానం చేసిన నీరు విక్రయించడం.. వైరల్ న్యూస్
-
TVs with Dolby Sound: డాల్బీ సౌండ్‌తో టీవీలు.. ఇక థియేటర్‌కు వెళ్లక్కర్లేదు
-
Buying Shares: అప్పు చేసి షేర్లు కొంటున్నారా.. అయితే ఇది మీ కోసమే
-
Personal Loans: సున్నా వడ్డీతో పర్సనల్ లోన్ ఇస్తారా?
-
Invest: మ్యూచువల్ ఫండ్‌లో దీర్ఘకాలికంగా పెట్టుబడులు ఎందుకు పెడతారు?