Viral News: మరీ ఇంత దారుణమా.. స్నానం చేసిన నీరు విక్రయించడం.. వైరల్ న్యూస్

Viral News: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. ప్రతీ ఒక్కరూ డబ్బు కోసం లేదా ఫేమస్ కోసం ఎన్నో పనులు చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఎంతటి పనిచేయడానికి అయినా కూడా దిగజారడం లేదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో స్నానం చేసిన నీరు విక్రయించిన వార్త వైరల్ అవుతోంది. యూఫోరియా, ఎనీవన్ బట్ యూ ఫేమ్ సిడ్నీ స్వీనీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ భామ కేవలం నటనలో మాత్రమే కాకుండా వ్యాపారంలో కూడా రాణించాలని ఓ సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. అందరిలా కాకుండా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని భావించింది. అయితే స్నానం చేసిన నీటిని సబ్బుగా మారుస్తూ ఆమె సక్సెస్ అవుతోంది. పురుషుల సహజ వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్ డాక్టర్ స్క్వాచ్తో కలిసి ‘సిడ్నీస్ బాత్‌వాటర్ బ్లిస్’ అనే లిమిటెడ్ ఎడిషన్ సబ్బును తయారు చేసింది. అయితే ఈ సోప్ నటి స్నానపు నీటి స్పర్శ ఉంటుంది. అలాగే ఎక్స్‌ఫోలియేటింగ్ శాండ్, పైన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్, పైన్, ఫిర్, ఆకుపచ్చ సుగంధాలతో కలిపి తయారు చేసింది. అయితే దీని ధరను కూడా కాస్త ఎక్కువగానే అమ్ముతుంది.
ఇది కూడా చూడండి:IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!
ఒక్కో సోప్ ధర రూ.500గా నిర్ణయించింది. అయితే ఈమె కేవలం 5,000 సోప్ బార్లు మాత్రమే తయారు చేసింది. దీంతో చాలా మంది వీటిని భారీగా కొనుగోలు చేశారు. అయితే ఈమె స్నానం చేసిన నీటిని కావాలని అడిగిన అభిమానులకు ఇలా గిఫ్ట్ ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే సహజ పరిశుభ్రత ఉత్పత్తులను ప్రోత్సహించడంతో పాటు ప్రేక్షకులను ఆకర్షించడానికి ఈ సబ్బును రూపొందించినట్లు సిడ్నీ తెలిపింది. అయితే ఈ సబ్బు విషయంలో మార్కెటింగ్ కూడా బాగా ఉపయోగపడింది. కొందరు దీన్ని పాజిటివ్‌గా తీసుకుని సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు ఎందుకు ఇలా బరి తెగించారని అంటున్నారు. అయితే ఇలా చేయడం ఇదేం మొదటిసారి కాదు. 2019లో బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్సర్ బెల్లె డెల్ఫిన్ తన స్నానపు నీటితో నిండిన ఒక్కో జార్‌ను తయారు చేసింది ఈ జార్‌ను రూ. 2600కు అమ్మింది. అయితే ఈ జార్‌ను కేవలం మూడు రోజులు విక్రయించి మొత్తం రూ.77 లక్షలు సంపాదించింది. డెల్ఫిన్ స్నానపు నీటిని కేవలం సెంటిమెంటల్ కోసం మాత్రమేనని తెలిపింది. అయితే దీన్ని బయట కూడా విక్రయించింది.
-
Viral News: రూ.84 లక్షల లగ్జరీ కారు.. కేవలం రూ. 2.5 లక్షలు మాత్రమే.. ఎక్కడో తెలిస్తే మీరు కొనేస్తారు
-
Phone Farming: ఫోన్ ఫార్మింగ్ అంటే ఏంటో మీకు తెలుసా?
-
UPI Payments : యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్థిక మంత్రిత్వ శాఖ
-
Singer Mangli Birthday Party: మంగ్లీ డ్రగ్స్ తీసుకుందా.. అందుకేనా వీడియో వద్దు.. ఇందులో ఏది నిజమేంటి?
-
Dmart: డీ-మార్ట్ భారీ డిస్కౌంట్లు ఎందుకు ఇస్తుందో మీకు తెలుసా?
-
Auto Driver: నెలకు రూ.8 లక్షలు.. ఇది ఒక ఆటో డ్రైవర్ జీతం.. వైరల్ న్యూస్