Auto Driver: నెలకు రూ.8 లక్షలు.. ఇది ఒక ఆటో డ్రైవర్ జీతం.. వైరల్ న్యూస్

Auto Driver: లక్షల్లో జీతం సంపాదించాలంటే ఉద్యోగం కంటే వ్యాపారం బెటర్ అని చాలా మంది భావిస్తారు. ఎందుకంటే ఎంత పెద్ద ఉద్యోగం అయినా కూడా కొంత డబ్బులు మాత్రమే వస్తాయి. అదే వ్యాపారం అయితే లెక్కలేనంత వస్తుంటాయి. అయితే డైలీ మనం బయటకు వెళ్లినప్పుడు కొందరు ఆటోలు ప్రిఫర్ చేస్తుంటారు. ఏదైనా ఆటో ఎక్కితే వీరికి అసలు పెద్ద లాభం రాదేమో.. ఎలా జీవిస్తారని అనుకుంటారు. కానీ నిజానికి ఉద్యోగం చేసే వారి కంటే ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవడం, తెలివిగా ఇలా ఆటో డ్రైవర్లు నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే ఢిల్లీలో ఓ ఆటో డ్రైవర్ నెలకు రూ.8 లక్షలు సంపాదిస్తున్న వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇంత పెద్ద మొత్తంలో అయితే ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, చార్టర్డ్ అకౌంటెంట్లు సంపాదిస్తారు. కానీ ఆటో నడుపుతూ నెలకు ఇన్ని లక్షలు సంపాదించడం అనేది చాలా ఆశ్చర్యమైన ఘటన. అయితే ఒక ఆటో డ్రైవర్ మళ్లీ తన ఆటోను కూడా నడపడం లేదు. తన ఆటోను నడపకుండా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇతన్ని చూసిన వారు వాట్ యాన్ ఐడియా సర్జీ అంటున్నారు. అయితే ఢిల్లీలో ఉండే ఒక ఆటో డ్రైవర్ కాన్సులేట్ బయట ఉంటాడు. అయితే ఆయన అపాయిట్మెంట్ల కోసం లోపలికి చాలా మంది వెళ్తుంటారు. ఇలా వెళ్లే వారి లగేజీని తన వాహనంలో ఉంచుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు. దీంతో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇది కూడా చూడండి: Thug Life Movie : భారీ అంచనాలతో ‘థగ్ లైఫ్’ విడుదల.. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే
ఈ వీసా లోపిలికి అసలు బ్యాగ్‌లు తీసుకెళ్లకూడదని సెక్యూరిటీ చెప్పారు. దీంతో అక్కడ బ్యాగ్ పెట్టారు. అప్పుడు ఆ ఆటో డ్రైవర్ మీ బ్యాగ్ నాకు ఇవ్వండి జాగ్రత్తగా ఉంచుతాను. ఇక్కడ ఎలాంటి లాకర్లు కూడా లేవు. నేను ఇక్కడే సేఫ్‌గా ఉంచుతా. రోజుకి రూ.1000 అని చెప్పారు. ఆ ఆటో డ్రైవర్ ప్రతిరోజూ కాన్సులేట్ బయట ఆటో పార్క్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. ప్రతి కస్టమర్ నుంచి రూ.1,000 తీసుకుంటున్నాడు. రోజుకి ఇలా ఒక 20 లేదా 30 మంది వస్తున్నారు. దీనివల్ల ఆటో నడపకుండా ఒకే ప్లేస్‌లో ఉండి రోజుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నాడు. అంటే నెల దాదాపుగా రూ.5 లక్షల నుంచి రూ.8లక్షల వరకు వస్తుంది. అయితే అన్ని లాక్‌లో ఇక్కడ ఉంచలేక సమీపంలోని పోలీస్తో డీల్ మార్చుకున్నాడు. అక్కడ లాకర్‌కు వెళ్లి ఉంటాయి. ఎలాంటి టెక్నాలజీ వాడకుండా నెలకు లక్షలు సంపాదిస్తున్నాడు. హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ ఎక్కువగా చేస్తున్నాడు.
-
Brutal Incident In Delhi: ఢిల్లీలో దారుణ ఘటన.. భర్త హత్యకు ప్లాన్ ఎలా చేసిందంటే?
-
Telugu States CMs Meet: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ
-
Fake Wedding trend: తినంత తిండి.. తాగేంత మందు.. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్. తో ఎంజాయ్ చేయండి
-
Viral News: రూ.84 లక్షల లగ్జరీ కారు.. కేవలం రూ. 2.5 లక్షలు మాత్రమే.. ఎక్కడో తెలిస్తే మీరు కొనేస్తారు
-
Phone Farming: ఫోన్ ఫార్మింగ్ అంటే ఏంటో మీకు తెలుసా?
-
Kedarnath: తక్కువ బడ్జెట్లో కేదార్నాథ్ వెళ్లడం ఎలా? అయితే ఈ ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి