Thug Life Movie : భారీ అంచనాలతో ‘థగ్ లైఫ్’ విడుదల.. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే

Thug Life Movie : విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) రచనా సహకారంతో, సంచలన దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో రూపొందిన భారీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘థగ్ లైఫ్’ (Thug Life) సినిమా నేడు (జూన్ 5, 2025) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ (Raaj Kamal International), మద్రాస్ టాకీస్ (Madras Talkies), రెడ్ జెయింట్ మూవీస్ (Red Giant Movies) బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, ఆర్ మహేంద్రన్ తదితరులు ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘థగ్ లైఫ్’ సినిమాలో కమల్ హాసన్‌తోపాటు త్రిష (Trisha), శింబు (Simbu), ఐశ్వర్య లక్ష్మీ (Aishwarya Lekshmi), అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, మహేష్ మంజ్రేకర్, తనికెళ్ల భరణి వంటి భారీ తారాగణం నటించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. ఈ సినిమా ప్రీమియర్‌లు బుధవారం అర్ధరాత్రి ఓవర్సీస్‌లో ప్రారంభమయ్యాయి. విడుదలైన వెంటనే సినిమాపై నెటిజన్లు, సినీ విమర్శకులు (Critics) తమ అభిప్రాయాలను ట్విట్టర్ (X) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పంచుకోవడం మొదలుపెట్టారు. అలాగే థియేటర్ల వద్ద థగ్ లైఫ్ సినిమా గురించి పబ్లిక్ టాక్ ఎలా ఉందో చూద్దాం.
Bad second half. Apart from the high technical standards and cinematography, #Thuglife is disappointing. The entire film doesn’t carry any emotion and runs on flat note. The BGM by ARR is off.
— Sharat chandra (@Sharatsays2) June 5, 2025
Mani Ratnam’s making still holds class, & Rahman’s music is solid. Performance from Kamal, STR, Abhirami,Trisha, Joju & others are top-notch. But the story is predictable & flat screenplay. Zero engaging moments throughout.
Massive expectations… TOTAL DISAPPOINTMENT pic.twitter.com/Z06C5vkKbw
— Dh (@NaanPadamParpen) June 5, 2025
‘థగ్ లైఫ్’ ఫస్టాఫ్ కథ అంతా ఊహించినట్టుగానే ఉంది. పవర్ కోసం కొట్లాడుకునే ఇద్దరు వ్యక్తుల కథ. చాలా ల్యాగ్‌గా ఉన్నట్లు అనిపించిందని చెబుతున్నారు. పెద్దగా ఇంప్రెసివ్ కంటెంట్ కనిపించలేదు. పాత కథే.. పాత స్క్రీన్ ప్లే. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అంతగా గొప్పగా లేదు. సినిమాకు హెల్ప్ కాలేదని జనాలు అంటున్నారు. చాలా మంది మాత్రం ఫస్ట్ హాఫ్ బాగుందని అభిప్రాయపడ్డారు. కమల్ హాసన్, శింబు నటన (Simbu Acting) సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని పేర్కొన్నారు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ (Cinematography) అద్భుతంగా ఉందని ప్రశంసలు అందుకుంది. కొన్ని యాక్షన్ సీన్లు, ఎమోషనల్ సీన్లు ఆకట్టుకున్నాయని చెబుతున్నారు.
#Thuglife – BELOW AVERAGE ONE😑
Finally Mani Thatha Also Back Stabbed. An Average First Half With a Good for nothing Second Half. Totally Execution of Old Wine in The Old Pot 🙏🏻😓
Never Expected Such A Disappointment!!TOTALLY : ONE TIME WATCHABLE 2/5⭐pic.twitter.com/eeFBcvvDPm
— Abin Babu 🦇 (@AbinBabu2255) June 5, 2025
#ThugLife Mani sir what were u thinking? Worse than #Indian2 #KamalHaasan𓃵 is aged and gives the weakest perf. #SilambarasanTR is wasted in a role with 0 scope. #Trisha is in a dummy role. Slow boring and hard to sit through this bad gangster drama. Semma mokka! 1.25/5 pic.twitter.com/tPQkbHaFB4
— AllAboutMovies (@MoviesAbout12) June 5, 2025
#ThugLife had potential but turns into a drag. Kamal acted well, but his nonstop dialogues get tiring. Simbu did his role neatly, but even that couldn’t save the flat, slow-paced second half. No Mani Ratnam spark.
Below average 👍#ThugLife #KamalHaasan #ThugLifeFDFS pic.twitter.com/I5wQlxoBO7
— The Flicks (@Flicks_rithick) June 5, 2025
సెకండాఫ్ అనుకున్నంతగా లేదని, కొంత నిరాశపరిచిందని ప్రేక్షకులు అంటున్నారు. కథనం నెమ్మదిగా సాగిందని, కొన్ని చోట్ల లాగ్ అనిపించిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ కూడా కొందరిని నిరాశపరిచిందని, సినిమాకు పెద్దగా ప్లస్ అవ్వలేదని టాక్. మొత్తంగా, ‘థగ్ లైఫ్’ సినిమాకు మొదటి రోజు మిశ్రమ స్పందన లభించింది. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ నుండి ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకోవడం, వాటిని పూర్తి స్థాయిలో చేరుకోలేదన్న అభిప్రాయం కొంతమందిలో వ్యక్తమవుతోంది. అయితే, కమల్, శింబుల నటన, మణిరత్నం టేకింగ్ మాత్రం ప్రశంసలు అందుకుంటున్నాయి.
Read Also:Andhra Pradesh: ఏపీ కేబినెట్.. మహిళలకు గుడ్ న్యూస్