Andhra Pradesh: ఏపీ కేబినెట్.. మహిళలకు గుడ్ న్యూస్

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారుగా 9 అంశాలు అజెండాగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పాలనాపరమైన సంస్కరణలకు సంబంధించిన నిర్ణయాలు ఇందులో ఉన్నాయి. అమరావతి రాజధాని నిర్మాణంపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. అలాగే అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్ల విషయంలో కూడా ఏపీ మంత్రివర్గం నేడు ఆమోదం తెలిపింది. అలాగే, సీఆర్‌డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. హెచ్‌ఓడీ (హెడ్స్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్) 4 టవర్ల టెండర్లకు కూడా ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి రెండో దశలో భూమి సేకరణ అంశంపై కూడా నేటి కేబినేట్‌లో మంత్రులు చర్చలు జరిపారు. 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు, అలాగే ఇతర స్మార్ట్ ఇండస్ట్రీస్ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అమరావతి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పోలీస్ అకాడమీకి 94.45 ఎకరాలను కేటాయించాలని నిర్ణయించుకున్నారు.
ఇది కూడా చూడండి:IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!
తల్లికి వందనం కార్యక్రమానికి నిధుల విడుదలపై మంత్రులు చర్చించారు. దీనికి త్వరలో నిధులు విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళంలో మంచినీటి సరఫరా కోసం రూ. 5.75 కోట్లు ఆమోదం తెలిపింది. అలాగే కుప్పంలో వయబిలిటీ గ్యాప్ ఫండ్ కోసం రూ. 8.22 కోట్లు కేటాయించేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. పాలనాపరమైన సంస్కరణల్లో భాగంగా, 248 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇది పోలీసు బలగాల నైతిక స్థైర్యాన్ని పెంపొందించడానికి, సమర్థవంతమైన పాలనకు దోహదపడుతుందని తీసుకున్నారు. న్యాయ పరంగా 17 మంది ఖైదీలను విడుదల చేసే ప్రతిపాదనపైన కూడా కేబినేట్‌లో నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పేరును యధాతథంగా ఉంచుతూ గతంలో ఇచ్చిన జీవోకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, రాయితీల కల్పనపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలకు సంబంధించిన 2025 చట్టంలో సవరణలకు కూడా ఆమోదముద్ర పడింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా సమావేశంలో నిర్ణయించారు.
-
Mango Farmers: మామిడి రైతులకు ఊరట.. రూ.260 కోట్లు విడుదల!
-
Telugu States CMs Meet: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ
-
Tirumala: ఈ దేవుడిని కాదని తిరుమల శ్రీవారిని ముందు దర్శించుకుంటున్నారా.. ఇక మీకు పుణ్యం రాదు
-
Pawan Kalyan leaves Cabinet Meeting: క్యాబినెట్ భేటీ నుంచి పవన్ బయటకు.. హుటాహుటిన హైదరాబాద్ కు!
-
Andhra Pradesh: తల్లికి వందనం రూ.13 వేలు.. మరి మిగతా రూ.2 వేల పరిస్థితి ఏంటి?
-
APEAPCET: వచ్చేసిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు.. ర్యాంక్ ఎంతో ఇలా తెలుసుకోండి