Mango Farmers: మామిడి రైతులకు ఊరట.. రూ.260 కోట్లు విడుదల!
Mango Farmers చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు భారీగా లబ్ధి చేకూరనుంది. మరోవైపు రాయితీ మొత్తాన్ని రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Mango Farmers: ఎట్టకేలకు ఏపీలో మామిడి రైతులకు( mango farmers ) ఉపశమనం దక్కింది. మామిడి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కొద్దిరోజుల కిందట కుప్పంలో పర్యటించారు చంద్రబాబు. ఆ సమయంలో మామిడి రైతులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. త్వరలో పరిష్కరిస్తానని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. మాట ఇచ్చిన మాదిరిగా మామిడి రైతుల సమస్యల పరిష్కారానికి రూ.260 కోట్లు నిధులను విడుదల చేశారు. నాలుగు రూపాయల రాయితీతో 6.5 లక్షల టన్నుల తోతపురి మామిడికాయలు కొనుగోలు చేసేందుకు కేటాయించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు భారీగా లబ్ధి చేకూరనుంది. మరోవైపు రాయితీ మొత్తాన్ని రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
* ఆశాజనకంగా పండినా..
ఈ ఏడాది మామిడి పంట ఆశాజనకంగా పండింది. కానీ గిట్టుబాటు ధర లభించలేదు. దీంతో రైతులు తమ మామిడి ఉత్పత్తులను విక్రయించేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. రవాణా ఖర్చులు( transport charges) సైతం సర్దుబాటు చేసుకోలేక రోడ్ల పక్కన మామిడి పంటను నిల్వ చేశారు. దీంతో దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మామిడి రైతులను పరామర్శించారు కూడా. ఈ క్రమంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే అంతకుముందు చంద్రబాబు కుప్పం పర్యటన సమయంలో మామిడి రైతులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తప్పకుండా సమస్యకు పరిష్కారం చూపిస్తానని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు నిధులు విడుదల చేశారు.
* కేంద్ర సాయం కోసం విన్నపం..
మరోవైపు మామిడి రైతులు ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం( state government) కేంద్రాన్ని కోరింది. ఎంఐఎస్ విధానంపై మామిడి రైతులను ఆదుకునేందుకు ₹260 కోట్ల రూపాయల సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. తోతపురి మామిడికాయల కొనుగోలు ఆగస్టు 2025 వరకు కొనసాగించాలని కోరింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సైతం సానుకూలంగా స్పందించింది. దీంతో కొనుగోలు ప్రారంభం అయ్యాయి. తాజాగా రాయితీకి సంబంధించి నిధులు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. రైతులు తమ బ్యాంక్ ఖాతాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
-
Telugu States CMs Meet: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ
-
Andhra Pradesh: తల్లికి వందనం రూ.13 వేలు.. మరి మిగతా రూ.2 వేల పరిస్థితి ఏంటి?
-
Andhra Pradesh: ఏపీ కేబినెట్.. మహిళలకు గుడ్ న్యూస్
-
Tirumala: నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షల విరాళం ఇచ్చిన నారా కుటుంబం…