Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Andhra Pradesh News »
  • Andhra Pradesh Talliki Vandanam Sheme Amount 13 Thousand Rupees Only

Andhra Pradesh: తల్లికి వందనం రూ.13 వేలు.. మరి మిగతా రూ.2 వేల పరిస్థితి ఏంటి?

Andhra Pradesh: తల్లికి వందనం రూ.13 వేలు.. మరి మిగతా రూ.2 వేల పరిస్థితి ఏంటి?
  • Edited By: kusuma,
  • Updated on June 12, 2025 / 04:35 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Andhra Pradesh: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. అయితే నేటితో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావడంతో తల్లికి వందనం డబ్బులను అకౌంట్‌లోకి వేసింది. తల్లికి వందనం పథకం కింద డబ్బులు అకౌంట్‌లోకి రూ.15 వేలు జమ చేయనున్నట్లు తెలిపారు. కానీ ఇప్పుడు రూల్ మారిపోయింది. తల్లికి వందనం పథకం కింద తల్లుల అకౌంట్‌లోకి రూ.13 వేలు మాత్రమే వేశారు. మిగతా రెండు వేలు ఇక స్కూల్లకు చెందుతాయి. ఈ పథకం ద్వారా విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పథకం ప్రారంభంలోనే మొదటి విడత నిధులను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షలకు పైగా విద్యార్థుల తల్లులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చేటప్పుడు ఒక్కో తల్లికి రూ.15 వేలు ఇవ్వనున్నట్లు తెలిపింది. కానీ తాజాగా విడుదల చేసిన జీవో (ప్రభుత్వ ఉత్తర్వు)లో మాత్రం తల్లుల ఖాతాల్లో నేరుగా జమయ్యే మొత్తం రూ.13 వేలు మాత్రమేనని పేర్కొంది. మిగిలిన రూ.2 వేలు పాఠశాలల అభివృద్ధి, నిర్వహణ నిధులకే వినియోగించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వం అమలు చేసిన ‘అమ్మ ఒడి’ పథకంలో కూడా స్కూళ్ల నిర్వహణ కోసం నిధులను మినహాయించిన విషయం తెలిసిందే. ఈ నిధులు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉన్న ఖాతాల్లో జమ అవుతాయి.

‘తల్లికి వందనం’ పథకం ద్వారా లబ్ధి పొందడానికి కొన్ని అర్హతా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం తెలిపింది. పట్టణాల్లో నివసించే కుటుంబాల నెలవారీ ఆదాయం రూ.12 వేలు లోపు ఉండాలి. గ్రామాల్లో నివసించే కుటుంబాల నెలవారీ ఆదాయం రూ.10 వేలు లోపు ఉండాలి. కుటుంబంలో కనీసం ఒక్కరి పేరు అయినా రేషన్ కార్డులో ఉండాలి. మాగాణి (నీటిపారుదల) భూమి మూడు ఎకరాలలోపు, మెట్ట (బీడు) భూమి 10 ఎకరాలలోపు ఉండాలి. రెండు కలిపి 10 ఎకరాలలోపు ఉన్నవారు మాత్రమే అర్హులు. వ్యక్తిగత వాహనాలు కార్లు వంటివి ఉండకూడదు. అయితే ట్రాక్టర్లు, ఆటోలు వంటి ఉపాధి కోసం ఉపయోగించే వాహనాలకు మినహాయింపు ఉంటుంది. విద్యుత్ వినియోగం సగటున నెలకు 300 యూనిట్లు మించకూడదు. ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేవారు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ పథకానికి అర్హులు కాదు. అయితే నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకంపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు సమయానికి జమ కావాలని ఆయన ఆదేశించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు నిధుల కొరత రాకుండా చూసే బాధ్యతను అప్పగించారు. అలాగే కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు, షూస్ అందించనున్నట్లు విద్య శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. అలాగే మధ్యాహ్న భోజనం కోసం డొక్కా సీతమ్మ స్కీమ్ ద్వారా నాణ్యమైన భోజనం అందించనున్నట్లు ప్రకటించారు.

ఇది కూడా చూడండి: Early Morning Anjeer: ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తీసుకుంటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!

Tag

  • Accounts
  • Andhra pradesh
  • cm chandrababu
  • Money
  • Nara lokesh
Related News
  • Free Bus In AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్ డేట్

  • Mango Farmers: మామిడి రైతులకు ఊరట.. రూ.260 కోట్లు విడుదల!

  • Telugu States CMs Meet: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ

  • Tirumala: ఈ దేవుడిని కాదని తిరుమల శ్రీవారిని ముందు దర్శించుకుంటున్నారా.. ఇక మీకు పుణ్యం రాదు

  • Youtube new rules: యూట్యూబర్లకు షాకింగ్ న్యూస్.. ఈ రూల్స్ పాటిస్తేనే డబ్బులు లేకపోతే కట్!

  • Ants: ఇంట్లోకి చీమలు అధికంగా వస్తుంటే.. ఇంత అదృష్టమా!

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us