Ants: ఇంట్లోకి చీమలు అధికంగా వస్తుంటే.. ఇంత అదృష్టమా!

Ants: పంచదార ఎక్కడ ఉంటే చీమలు అక్కడ ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇంట్లో చీమలు ఉండటం సాధారణమే. కానీ కొందరి ఇంట్లో ఎక్కువగా చీమలు ఉంటాయి. వీటివల్ల కొందరు ఇబ్బంది పడుతుంటారు. ఎక్కడ చూసినా కూడా చీమలు కనిపిస్తాయి. తినే ఆహారం, దుస్తులు ఇలా ప్రతీ దాంట్లో కూడా ఉంటాయి. అయితే ఇంట్లో చీమలు ఉంటే కొందరు నెగిటివ్‌గా భావిస్తారు. ఇంట్లో ఎక్కడపడితే అక్కడ చీమలు ఎక్కువగా ఉంటే మాత్రం ఇంటికి మంచిది కాదని, అశుభం అని అంటున్నారు. సాధారణంగా చీమల్లో కొన్ని రకాలు ఉంటాయి. నలుపు, ఎరుపు వంటి రంగులతో చీమలు ఉంటాయి. వీటిని బట్టి అవి ఇంటికి మంచి, చెడు ఉంటుంది. అయితే ఇంట్లో ఏ చీమలు ఉంటే మంచిది? దేనివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
ఇంట్లో నల్ల చీమలు ఉంటే మంచిది. వీటిని శుభప్రదంగా భావిస్తారు. ఆహారం లేకుండా మీ ఇంటి చుట్టూ నల్ల చీమలు తిరుగుతున్నట్లు మీరు చూస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించబోతోందని అర్థం. దీనివల్ల ఇంటికి ప్రయోజనాలు లభిస్తాయి. ఎక్కువగా శుభవార్తలు వింటారు. కొన్నిసార్లు ఇది మీ జీవితంలో స్థిరత్వం, శ్రేయస్సు రాబోతోందనడానికి అర్థం. అయితే పిండితో కలిపిన ఆహారాన్ని నల్ల చీమలకు తినిపించడం శుభప్రదమైనది. అయితే ఇంటికి నల్ల చీమలు అదృష్టాన్ని తీసుకొస్తే, ఎర్ర చీమలు మాత్రం నష్టాన్ని తీసుకొస్తాయి. వీటిని అశుభానికి సంకేతంగా భావిస్తారు. ఇంట్లో ఎర్ర చీమలు వేగంగా కదులుతున్నట్లు కనిపిస్తే అవి పోరాటం, అనారోగ్యం లేదా తగాదానికి సంకేతంగా భావిస్తారు. నల్ల చీమలు మీ ఇంట్లోకి లైన్ కట్టి వస్తే అదృష్టాన్ని తెచ్చి పెడతాయి. వీటివల్ల ఇంట్లో ధన లాభం కలుగుతుంది. అనేక ఆర్థిక ప్రయోజనాలు కూడా చేకూరతాయని, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారని పండితులు అంటున్నారు. అలాగే ఉద్యోగస్తులకు అవకాశాలు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉందని పండితులు అంటున్నారు.
గుట్టలు గుట్టలుగా నల్ల చీమలు ఉంటే మాత్రం మంచిది కాదు. బెడ్ రూమ్ లో నల్ల చీమలు కనిపిస్తే కొత్త బంగారు వస్తువలు కొనుగోలు చేస్తారని, ఇంటి టెర్రస్ పైన ఉంటే మరో స్థలం లేదా ఇల్లు కొనుక్కునే అదృష్టం కలుగుతుందట. అలాగే నల్ల చీమలు ఉత్తరం వైపు నుండి బయటకు వస్తే జీవితాల్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని, దక్షిణ దిశ నుండి చీమలు బయటకు వస్తే ధన లాభం జరుగుతుందట. అలాగే తూర్పు దిశ నుండి చీమలు బయటకు వస్తే అదృష్టాన్ని సూచిస్తుందని చెబుతూంటారు. ఇలా నల్ల చీమలు ఇంట్లో ఉంటే అదృష్టం ఏ రూపంలో అయినా కలగవచ్చు. అదే ఎర్ర చీమలు ఇంట్లో ఉంటే మాత్రం అస్సలు మంచిది కాదట. ఎర్ర చీమలు ఇంట్లో ఉంటే ధన నష్టం, కష్టాలు, ప్రతికూల పరిస్థితులు, నెగిటివ్ వైబ్రేషన్స్ కలిగిస్తాయని పండితులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Read Also:Smartphone : ఫోన్లో ఎవరు ఏం చూశారో మొత్తం బయటపడుతుంది.. ఈ ట్రిక్ వెంటనే ట్రై చేయండి
-
Mirror: ఇంట్లో ఇక్కడ అద్దం పెడితే.. ఇళ్లంతా డబ్బు మయం
-
Amavasya: వెరీ పవర్ ఫుల్ అమావాస్య.. తెలిసో తెలియక ఇలా చేస్తే దరిద్రమే!
-
Salt Tips: ఉప్పుతో ఇలా చేశారో.. కుభేర యోగం పట్టడం ఖాయం
-
Vastu Tips: ఈ ప్రదేశాల్లో భోజనం చేస్తున్నారా.. అయితే మీకు పేదరికం తప్పదు
-
Zodiac Signs: ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ మాయం.. ఈ రాశుల వారి పంట పండినట్లే
-
Zodiac Signs: ఈ మూడు రాశుల వారికి ఇక అదృష్టమే.. ఏం పట్టినా బంగారమే