Japan Houses in Air: గాల్లో మేడలు.. ఇవి వట్టి మాటలు కాదండోయ్.. నిజం చేస్తున్న జపాన్!

Japan Houses in Air: ఎప్పటికీ నిజం కాని కొన్నింటిని ఊహిస్తే గాల్లో మేడలు కట్టవద్దని కొందరు అంటుంటారు. అయితే గాలిలో మేడలు కట్టడం అనేది ఎప్పటికీ నిజం కాదనేది చాలా మంది వాదన. కానీ జపాన్ దీన్ని నిజం చేస్తుంది. మిగతా దేశాలతో పోలిస్తే జపాన్ అప్‌డేటెట్‌గా ఉంటుంది. అలాగే ఈ దేశంలో భూకంపాలు కూడా ఎక్కువగా వస్తాయి. కేవలం రెండు వారాల్లో 900 సార్లు ఇటీవల భూమి కంపించింది. చిన్నవే కాకుండా పెద్ద భూకంపాలు కూడా ఎక్కువగానే జపాన్‌లో వచ్చాయి. అయితే ఎన్ని భూకంపాలు వచ్చి, తీవ్ర నష్టం జరిగినా కూడా జపాన్ మళ్లీ అన్నింటిని సెట్ చేసుకుంటుంది. భూకంపం వస్తే ఒక్కసారిగా అన్ని ధ్వంసం అవుతాయి. ముఖ్యంగా మానవులకు అవసరమైన ఇళ్లు అయితే పూర్తిగా ధ్వంసం అవుతాయి. ప్రతీసారి నిర్మించుకోవడం, మళ్లీ భూకంపం రావడం అక్కడి ప్రజలకు అలవాటు. అయితే భూకంపం వచ్చినా కూడా ఇళ్లు ఏం కాకుండా ఉండాలని, వీటికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుక్కోవాలని జపాన్ భావిస్తోంది. ఈ క్రమంలోనే గాలిలో మేడలు కట్టాలని భావిస్తున్నారు. అసలు గాల్లో మేడలు కట్టడం ఎలా? అసలు ఎలా సాధ్యం అవుతుంది? పూర్తి అవుతుందో ఈ స్టోరీలో చూద్దాం.
జపాన్‌లో లెవిటేటింగ్ హౌస్ వ్యవస్థను తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇలా ఇళ్లు కట్టడం వల్ల భూకంపం వచ్చినప్పుడు అవి భూమి నుంచి కాస్త పైకి తేలుతాయి. దీనివల్ల ఇళ్లు ధ్వంసం కావు. గాల్లో ఇళ్లు తేలేలా ఉండేలా ప్లాన్ చేస్తున్నాయి. దీనివల్ల ఎక్కువగా నష్టం కూడా జరగదు. పదే పదే ఇళ్లు కట్టుకోనక్కర్లేదు. అయితే దీన్ని జపాన్‌కు చెందిన ఎయిర్ డాన్సిన్ అనే కంపెనీ నిర్మిస్తోంది. భూకంపం వస్తే భూమి బీటలు వారుతుంది. దీంతో నేల మీద ఉన్న అన్ని కూడా పూర్తిగా ధ్వంసం అవుతాయి. అదే గాల్లో ఉంటే ఎలాంటి నష్టం ఉండదు. ఈ క్రమంలోనే గాల్లో మేడలు కట్టాలని భావిస్తోంది. అయితే సాధారణంగా ఇల్లు అంటే నేలమీద. అసలు గాల్లో ఎలా అవుతుందనే సందేహం మీకు ఉంటుంది. అయితే గాల్లో ఇళ్లు కట్టడానికి ఇంటి బేస్ కింద ప్రత్యేకమైన ఎయిర్ బ్యాగ్ సెట్ చేస్తారు. భూకంపం రాకపోతే సాధారణంగానే ఉంటుంది. అదే భూకంపం వస్తే గాల్లోకి వెళ్తుంది. అయితే భూకంపాన్ని కనిపెట్టే సెన్సార్‌ను దీనికి కనెక్ట్ చేయడం వల్ల కొన్ని సెకన్ల సమయంలో యంత్రం ఎయిర్ బ్యాగ్‌ను గాలితో నింపేయడంతో అది నిండిపోతుంది. దాదాపుగా ఒక సెంటీమీటర్ నుంచి మూడు సెంటీమీటర్ల వరకు ఇల్లు గాల్లోకి తేలుతుంది. ఆ తర్వాత అది నేలపైకి వచ్చేస్తుంది. దీనివల్ల భూకంప సమయంలో ఉన్న ప్రమాదం తగ్గుతుంది.
గాల్లో మేడలు అనేది వర్క్‌వుట్ కాదని అంటున్నారు. కానీ ఇది అవుతుంది. ఇంతకు ముందు ఒకసారి ట్రై చేసి కూడా చూశారు. 2021లో 7.3 తీవ్రతతో వచ్చిన భూకంప సమయంలో లెవిటేటింగ్ వ్యవస్థ ఉన్న ఇల్లుకి ఏం కాలేదు. ఈ ఇల్లు భూకంపం రాకముందు ఎలా ఉన్నాయో, ఆ తర్వాత కూడా అలాగే ఉన్నాయి. అయితే వీటికి పెద్దగా ఖర్చు అవుతుందని మీరు అనుకోవచ్చు. కానీ వీటికి పెద్దగా ఖర్చు కాదు. ఈ ఇంటిని నిర్మించుకోవాలంటే 37 వేల డాలర్లు ఖర్చు అవుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో 31 లక్షలు అన్నమాట. ఇప్పటికే కొన్ని కార్యాలయాలు, ఇంటికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. భూకంప సమయంలో వీటికి ఎలాంటి ప్రమాదం కూడా రాలేదట. అయితే జపాన్‌లో భూకంపాన్ని ముందుగానే గుర్తించే యంత్రాంగం ఉంది. అందుకే ఎక్కువగా అక్కడ ప్రాణ నష్టం జరగదు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Puja: అబ్బాయిలు పూజలు చేస్తే ఏమవుతుందో తెలిస్తే.. డైలీ ఇంట్లో మీరే ఇక పంతులు
-
Internet Speed : నెట్‌ఫ్లిక్స్ మొత్తం ఒక్క సెకన్‌లో డౌన్‌లోడ్..ఇంటర్నెట్ స్పీడ్‌లో జపాన్ సంచలనం!
-
Ants: ఇంట్లోకి చీమలు అధికంగా వస్తుంటే.. ఇంత అదృష్టమా!
-
Mirror: ఇంట్లో ఇక్కడ అద్దం పెడితే.. ఇళ్లంతా డబ్బు మయం
-
Vastu Tips: ఈ ప్రదేశాల్లో భోజనం చేస్తున్నారా.. అయితే మీకు పేదరికం తప్పదు
-
Black Ants in House: ఇంట్లో నల్ల చీమలు ఉంటే ఎంత అదృష్టమో మీకు తెలుసా?