Internet Speed : నెట్‌ఫ్లిక్స్ మొత్తం ఒక్క సెకన్లో డౌన్లోడ్..ఇంటర్నెట్ స్పీడ్‌లో జపాన్ సంచలనం!

Internet Speed : కలలో కూడా ఊహించని వేగంతో ఇంటర్నెట్ డేటాను బదిలీ చేసి జపాన్ మరోసారి ప్రపంచ రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క సెకనుకు 1.02 పెటాబిట్స్ వేగంతో డేటాను ట్రాన్స్ఫర్ చేసి శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఈ వేగంతో నెట్‌ఫ్లిక్స్‌లోని మొత్తం లైబ్రరీని ఒక్క సెకనులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా 150GB సైజున్న భారీ వీడియో గేమ్‌లను రెప్పపాటులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది భారతదేశ సగటు ఇంటర్నెట్ వేగం అయిన 63.55 Mbps కంటే ఏకంగా 16 మిలియన్ రెట్లు వేగవంతమైనది. ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది? ఈ టెక్నాలజీ భవిష్యత్తులో ఏం మార్పులు తేబోతోందో వివరంగా తెలుసుకుందాం.
Read Also:Lavanya : వీడియోతో సహా అడ్డంగా బుక్కయిన లావణ్య
ఈ అసాధారణమైన వేగాన్ని జపాన్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ పరిశోధకులు సుమిటోమో ఎలక్ట్రిక్, యూరోపియన్ భాగస్వాములతో కలిసి సాధించారు. వీరు రూపొందించిన వినూత్నమైన 19-కోర్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా 1,808 కిలోమీటర్ల దూరం వరకు డేటాను ఇంత వేగంతో ట్రాన్సఫర్ చేయగలిగారు. ఇది లండన్ నుండి రోమ్ వరకు ఉన్న దూరం దీనికి దాదాపు సమానం.
Read Also:Shubman Gill: టీమిండియా వన్డే కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్?
ఈ ఆవిష్కరణలోని అసలైన విషయం దాని కేబుల్ రూపకల్పనలోనే ఉంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న కేబుల్స్ సింగిల్ లైట్ పాత్ కలిగి ఉంటాయి. కానీ, NICT బృందం రూపొందించిన ఈ కొత్త ఫైబర్‌లో సాధారణ కేబుల్స్ లాగే అదే స్టాండర్డ్ డయామీటర్ లోపల 19 వేర్వేరు కోర్లను అమర్చారు. ఇది పరిశోధకులు డేటా కోసం 19-లేన్ల సూపర్ హైవేగా అభివర్ణించారు. ముఖ్యంగా, ఇది ప్రస్తుత ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలతో అనుకూలంగా ఉండటం విశేషం. సుదూర ప్రాంతాలకు డేటా పంపినప్పుడు సిగ్నల్ క్వాలిటీ తగ్గుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి బృందం అధునాతన యాంప్లిఫికేషన్ సిస్టమ్‌లను డెవలప్ చేసింది.ప్రస్తుతానికి ఈ టెక్నాలజీ ఇంకా ప్రయోగశాల దశలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో పెరుగుతున్న డేటా అవసరాలను తీర్చడంలో ఇది ఒక కీలకమైన ముందడుగు.
-
Japan Houses in Air: గాల్లో మేడలు.. ఇవి వట్టి మాటలు కాదండోయ్.. నిజం చేస్తున్న జపాన్!
-
Surya Kumar Yadav breaks World Record: టీ20ల్లో వరల్డ్ రికార్డును బీట్ చేసిన సూర్య కుమార్ యాదవ్
-
Netflix : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాక్.. జూన్ 2 నుంచి ఆ డివైజ్‌లలో సర్వీసులు బంద్
-
Ram Charan: రామ్ చరణ్ పై డాక్యుమెంటరీ తియ్యబోతున్న నెట్ ఫ్లిక్స్..మరో అరుదైన గౌరవం!
-
Emergency: కంగనా ఎమర్జెన్సీ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో, ఎప్పటి నుంచంటే?
-
Thandel: ఉండగానే ఓటీటీలోకి తండేల్.. మరీ ఇంత తొందరగానే.. కారణం ఏంటి?